ఐపీఎల్ 2023 ఫైనల్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన అభిమానులకు వరణుడు కోలుకోలేని షాకిచ్చాడు. గత నాలుగు గంటలుగా ఎడతెరిపి లేని వర్షం కురుస్తుండడంతో అంపైర్లు.. మ్యాచ్‌ను సోమవారానికి వాయిదా వేశారు. సోమవారం(మే 29) రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
మొదట వరుణుడు అభిమానులతో దాగుడు మూతలు ఆడాడనే చెప్పుకోవాలి. 9:10 నిమిషాల సమయంలో వర్షం ఆగిపోగా మైదాన సిబ్బంది కవర్లను తొలగించారు. కాసేపు ఇరు జట్ల ఆటగాళ్లు ప్రాక్టీస్ కూడా చేశారు. అంపైర్లు మైదానాన్ని పరిశీలించి ఔట్ ఫీల్డ్ చిత్తడిగా ఉందని గుర్తించారు. దీంతో అరగంట సమయం పట్టొచ్చని.. మరోసారి పిచ్ పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. ఆపై ఆట కొనసాగాలే సిబ్బంది కృషి చేస్తుండగా వర్షం మళ్లీ మొదలైంది. అలా మొదలైన వర్షం చివరకు ఎంతకూ తగ్గకపోవడంతో అంపైర్లు.. మ్యాచ్‌ను సోమవారానికి వాయిదా వేశారు.
ఒకవేళ రేపు కూడా వర్షం కురిసి మ్యాచ్ రద్దయితే.. లీగ్ దశలో విజయాలు ఆధారంగా విజేతను నిర్ణయిస్తారు. 10 విజయాలతో టేబుల్ టాపర్‌గా నిలిచిన డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్‌ను విజేతగా ప్రకటిస్తారు. దాంతో, రెండో స్థానంలో ఉన్న సీఎస్కే రన్నరప్‌తో సరిపెట్టుకోవాల్సి ఉంటుంది.