వర్షం ఆటంకం కలిగించవడంతో ఆదివారం రాత్రి జరగాల్సిన ఐపీఎల్ 2023 ఫైనల్ మ్యాచ్ సోమవారానికి(మే 29) వాయిదా పడిన విషయం తెలిసిందే. మరో గంటలో మ్యాచ్ ఆరంభం కానుంది. ప్రస్తుతానికైతే అహ్మదాబాద్‌లో వాతావరణం అనుకూలంగా ఉంది. ఎలాంటి వర్షం లేదు. ఆకాశం కూడా సాధారణంగానే ఉంది. ఇప్పటికే ఇరు జట్ల ఆటగాళ్లు, అభిమానులు స్టేడియంకు చేరుకున్నారు. కాసేపట్లో టాస్ పడనుంది.
ఆదివారం సాయంత్రం 5 గంటల సమయంలో మొదలైన వర్షం రాత్రి 11 గంటల వరకూ ఎడతెరిపి లేకుండా కురిసింది. దీంతో వర్షపు నీటితో మైదానం చిత్తడిగా మారడంతో అంపైర్లు మ్యాచును వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఐపీఎల్ రూల్స్ ప్రకారం.. రిజర్వ్ డే అయిన సోమవారం రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ఆరంభమవ్వాల్సి ఉంది.
తుది జట్లు (అంచనా)
చెన్నై సూపర్ కింగ్స్: డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, అజింక్యా రహానే, అంబటి రాయుడు, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ(కెప్టెన్&వికెట్ కీపర్), దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, మహేశ్ తీక్షణ, మతీష పతిరాణా.
గుజరాత్ టైటాన్స్: శుభమాన్ గిల్, వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ, మహమ్మద్ షమీ.