మరికొన్ని గంటల్లో నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా చెన్నై, గుజరాత్ జట్ల మధ్య తుది పోరు మొదలుకానుంది. అయితే క్వాలిఫయర్-2కు వర్షం అంతరాయం కలిగించడంతో ఈ మ్యాచ్ జరుగుతుందా? లేదా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అభిమానులకు ఆ బెంగ అక్కర్లేదు. ఫైనల్ మ్యాచుకు వర్షం ఆటంకం లేదు. ఒక వరుణుడు అంతరాయం కలిగించినా.. 40 ఓవర్ల పూర్తి చూసే అవకాశం అభిమానులకు కలగనుంది.
మే 28న ఆదివారం రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. వెదర్ రిపోర్ట్ నివేదికలను బట్టి చూస్తే.. ఆ సమయంలో వాతావరణం అనుకూలంగా ఉంది. సాయంత్రం ఉష్ణోగ్రత 37° నుండి 29° సెల్సియస్ వరకు ఉండనుంది. దీన్ని బట్టి వర్షం అంతరాయం కలిగించే అవకాశాలు చాలా తక్కువ. ఒకవేళ క్వాలిఫయర్-2 తరహాలో వర్షం అంతరాయం కలిగినా.. ప్రేక్షకులు 40 ఓవర్ల పూర్తి మ్యాచును వీక్షించవచ్చు. అంతకూ వర్షం కారణంగా మ్యాచ్ రద్దయినా.. రిజర్వు డే ఉంది కనుక మరుసటి రోజు అనగా మే 29న రాత్రి మ్యాచ్ 8.00 గంటలకు ప్రారంభమవుతుంది.
తుది జట్ల అంచనా..
చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్యా రహానే, అంబటి రాయుడు, శివమ్ దూబే, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (కెప్టెన్& వికెట్ కీపర్), దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, మహేశ్ తీక్షణ.
గుజరాత్ టైటాన్స్: వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), శుభమాన్ గిల్, సాయి సుదర్శన్, విజయ్ శంకర్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, మహ్మద్ షమీ, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ, నూర్ అహ్మద్.