శుభ్‌మాన్ గిల్ జట్టు ఓటమి.. ఎగిరి గంతేసిన సారా

శుభ్‌మాన్ గిల్ జట్టు ఓటమి.. ఎగిరి గంతేసిన సారా

బంతి బంతికి ఫలితం చేతులు మారుతూ నరాలు తెగే ఉత్కంఠను పంచిన ఫైనల్ పోరులో ధోనీ సేన దుమ్మురేపింది. డిఫెండింగ్‌ చాంపియన్‌ గుజరాత్‌ టైటాన్స్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో స్టేడియం మొత్తం 'చెన్నై.. చెన్నై..' అంటూ నామస్మరణతో మార్మోగింది. ఈ విజయాన్ని గిల్ ప్రేయసి సారా అలీ ఖాన్ కూడా ఎంజాయ్ చేయడం గమనార్హం. బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్‌తో కలిసి ఫైనల్ మ్యాచ్ కు హాజరైన సారా, ఆఖరి బంతికి చెన్నై విజయం అందుకోగానే కేరింతలు కొట్టింది. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. 

గిల్ - సారా అలీ ఖాన్ డేటింగ్‌లో ఉన్నారన్న వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరిద్దరూ ఓ హోటల్ నుండి బయటకొస్తూ కెమెరా కంట పడ్డారు. ఆపై ఇద్దరూ కలిసి ఒకే విమానంలో ప్రయాణిస్తూ తమ రిలేషన్ షిప్‌పై క్లారిటీ ఇచ్చారు. అలాంటిది ప్రియుడి జట్టు ఓటమి పాలైతే.. బాధపడాలి. కానీ ఇక్కడ సారా అలీ ఖాన్ సంబరాలు చేసుకుంది. ఇది స్పోర్ట్స్‌మెన్ షిప్‌లో భాగమైన గిల్ అభిమానులకు అది రుచించడం లేదు. 'ఓటమి బాధలో ఉన్న గిల్ ను ఓదార్చాల్సింది పోయి ఎంజాయ్ చేస్తావా?..' అంటూ గుజరాత్ ఫ్యాన్స్ ఆమెను ట్రోల్ చేస్తున్నారు. ఈ మ్యాచులో గిల్ 39 పరుగులకే ఔటయ్యాడు.
 
విక్కీ కౌశల్, సారా కలిసి నటించిన తాజా చిత్రం జరా హాట్కే జరా బచ్కే'. ఈ సినిమా ప్రచారంలో  భాగంగానే వీరిద్దరూ జంటగా కనిపించారు. 

https://twitter.com/mufaddal_vohra/status/1663294506114985984