అహ్మదాబాద్, నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరగాల్సి ఉన్న క్వాలిఫైయర్ 2 పోరుకు వర్షం అంతరాయం కలిగిస్తోంది. ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడుతున్నాయి. ఈ కారణంగా మ్యాచ్ ఆలస్యం కానుంది. 7.20 నిమిషాల తర్వాత అంఫైర్లు పిచ్ పరిశీలించనున్నారు. ఆ తర్వాత టాస్‌పై నిర్ణయం తీసుకోనున్నారు.
వర్షం కారణంగా ఈ మ్యాచ్ రద్దు అయితే లీగ్ దశలో అత్యధిక విజయాలు అందుకున్న గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ 2023 ఫైనల్ కు అర్హత సాధిస్తుంది. ఒకవేళ వర్షం తగ్గి మ్యాచ్ సజావుగా సాగితే నేటి మ్యాచులో గెలిచిన జట్టు, ఇదే గ్రౌండ్లో మే 28న చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. కాగా, లీగ్ దశలో ఈ ఇరు జట్ల మధ్య రెండు మ్యాచులు జరగగా.. చెరో మ్యాచ్ గెలిచాయి.