ఐపీఎల్ 2023 షెడ్యూల్ వచ్చేసింది. మార్చి 31 నుంచి ఈ మెగా టోర్నీ మొదలుకానుంది. తొలి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరగనుంది. మొదటి మ్యాచ్ కు గుజరాత్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదిక కానుంది. చివరి మ్యాచ్ మే 21న జరగనుంది. మొత్తం పది జట్లు ఈ టోర్నీలో తలపడనున్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ - ఏప్రిల్ 2న రాజస్థాన్ రాయల్స్ తో తొలి మ్యాచ్ ఆడనుంది. మొత్తం ఐపీఎల్ మ్యాచ్ లు అహ్మదాబాద్, మొహాలీ, లక్నో, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, కోల్‌కతా, జైపూర్, ముంబై, గౌహతి, ధర్మశాలలో జరగనున్నాయి. ఇక మొత్తం 10 జట్లను రెండు గ్రూపులుగా విభజించారు - ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ గ్రూప్ A లో, చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ గ్రూప్ B లో ఉన్నాయి.