గత మ్యాచ్లో ముంబై బౌలర్లను ఊచకోత కోస్తూ రికార్డు స్కోర్(20 ఓవర్లలో 277 పరుగులు) చేసిన సన్ రైజర్స్ బ్యాటర్లు.. గుజరాత్ తో పోరులో మాత్రం తేలిపోయారు. బ్యాటింగ్కు స్వర్గధామమైన అహ్మదాబాద్ పిచ్ పై పరుగులు చేయడానికి అవస్థలు పడ్డారు. ఏ ఒక్క బ్యాటరూ 30 పరుగులు దాటలేకపోయారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన సన్ రైజర్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ(29), అబ్దుల్ సమాద్(29 నాటౌట్) టాప్ స్కోరర్లు. ఆదుకుంటారనుకున్న విదేశీ బ్యాటర్లు ట్రావిస్ హెడ్(19), హెన్రిచ్ క్లాసెన్(24), ఐడెన్ మార్క్రామ్(17) సమిష్టిగా విఫలమయ్యారు.
It needed a Rashid Khan's special to end six-hitting machine, Heinrich Klaasen innings in Ahmedabad.
— CricTracker (@Cricketracker) March 31, 2024
📸: Jio Cinema pic.twitter.com/zaojgCcTG7
చివరలో అబ్దుల్ సమద్(29 నాటౌట్; 14 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్స్), షాబాజ్ అహ్మద్(22) జోడి పోరాడడంతో ఆ మాత్రం స్కోరైనా చేయగలిగారు. గుజరాత్ బౌలర్లలో మోహిత్ శర్మ 3 వికెట్లు పడగొట్టగా.. ఒమర్జాయ్, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ఉమేష్ యాదవ్ తలా వికెట్ తీసుకున్నారు.
Big second half coming up in Ahmedabad 👊🔥#PlayWithFire #GTvSRH pic.twitter.com/4EKXe1VXjU
— SunRisers Hyderabad (@SunRisers) March 31, 2024