IPL 2024 Auction: ఐపీఎల్ వేలానికి సర్వం సిద్ధం.. ఏ ఫ్రాంచైజీ వద్ద ఎంత డబ్బు ఉందంటే ?

 IPL 2024 Auction: ఐపీఎల్ వేలానికి సర్వం సిద్ధం.. ఏ ఫ్రాంచైజీ వద్ద ఎంత డబ్బు ఉందంటే ?

ఐపీఎల్‌ 2024 మినీ వేలానికి సర్వం సిద్ధమైంది. మంగళవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి దుబాయ్‌లోని కోకోకోలా ఎరెనా వేదికగా వేలం ప్రక్రియ షురూ కానుంది. ఈ వేలం ద్వారా 77 బెర్త్ లు భర్తీ చేయనుండగా, భారత్ సహా 12 దేశాలకు చెందిన 333 మంది ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వీరిలో 214 మంది భారతీయులు కాగా, 119 మంది విదేశీయులు, మరో ఇద్దరు అసోసియేట్‌ దేశాల క్రికెటర్లు.

ఐపీఎల్ అంటేనే కాసుల లీగ్. కోట్లు కొల్లగొట్టేందుకు క్రికెటర్లు తహతహలాడుతుంటారు. అదృష్టం ఉన్న ఆటగాళ్లు తమ ఖజానా నింపుకుంటే, అదృష్టం తప్పినోళ్లు మరో సీజన్ కోసం ఎదురు చూస్తుంటారు. మినీ వేలంలో ఖర్చు పెట్టడానికి ఫ్రాంఛైజీల వద్ద మొత్తం రూ.262.95 కోట్లు ఉన్నాయి. అత్యధికంగా గుజరాత్ టైటాన్స్‌ వద్ద రూ.38.15 కోట్లు ఉండగా, అత్యల్పంగా లక్నో సూపర్‌ జెయింట్స్‌ వద్ద రూ.13.15 కోట్ల సొమ్ము ఉంది.

ఏ ఫ్రాంచైజీ వద్ద ఎంత డబ్బు ఉందంటే..

  • గుజరాత్‌ టైటాన్స్‌: రూ. 38.15 కోట్లు
  • సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌: రూ. 34 కోట్లు
  • కోల్‌కతా నైట్‌ రైడర్స్‌: రూ. 32.7 కోట్లు
  • చెన్నై సూపర్‌ కింగ్స్‌: రూ. 31.4 కోట్లు
  • పంజాబ్‌ కింగ్స్‌: రూ. 29.1 కోట్లు
  • ఢిల్లీ క్యాపిటల్స్‌: రూ. 28.95 కోట్లు
  • రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు: రూ. 23.25 కోట్లు
  • ముంబై ఇండియన్స్‌: రూ. 17.75 కోట్లు
  • రాజస్తాన్‌ రాయల్స్‌: రూ. 14.5 కోట్లు
  • లక్నో సూపర్‌ జెయింట్స్‌: రూ. 13.15 కోట్లు