రెండు నెలల పాటు క్రికెట్ లవర్స్ ఫుల్ కిక్ ఇచ్చిన ఐపీఎల్ ఆదివారం (మే 26) తో ముగిసింది. చెపాక్ వేదికగా మొదలైన ఐపీఎల్ తొలి మ్యాచ్ అదే మైదానంలో ఫైనల్ తో ముగిసింది. నిన్న ఏకపక్షంగా ముగిసిన ఈ ఫైనల్ మ్యాచ్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ 8 వికెట్ల తేడాతో సన్ రైజర్స్ పై ఘన విజయం సాధించింది. లీగ్‌లో పదేండ్ల గ్యాప్ తర్వాత మళ్లీ విజేతగా నిలిచిన కోల్‌కతా ముచ్చటగా మూడోసారి కప్పు నెగ్గి తీన్‌మార్ కొట్టింది. ఆరేండ్ల తర్వాత ఫైనల్‌కు వచ్చిన సన్ రైజర్స్ రెండోసారి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. రన్నరప్ గా నిలిచినా సన్ రైజర్స్ కు ఈ టోర్నీలో ఏకంగా 5 అవార్డులు లభించాయి. ఈ మెగా లీగ్ అవార్డులు ఇప్పుడు చూద్దాం.
విజేతకు రూ 20 కోట్లు:
ఐపీఎల్ 2024 సీజన్ లో విజేతగా నిలిచిన కోల్ కతా నైట్ రైడర్స్ కు రూ. 20 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ లభించింది. రన్నరప్ సన్ రైజర్స్ హైదరాబాద్ కు రూ. 12.50 కోట్ల రూపాయలు దక్కాయి.
నరైన్ కు రెండు అవార్డులు:
ఈ సీజన్ లో బ్యాటింగ్, బౌలింగ్ తో దుమ్ములేపిన నరైన్ రెండు అవార్డులు గెలుచుకున్నాడు. ఫాంటసీ ప్లేయర్ ఆఫ్ ది సీజన్(రూ. 10 లక్షలు)తో పాటు.. మోస్ట్ వ్యాల్యూబుల్ ప్లేయర్ (రూ. 10 లక్షలు) అవార్డులు సొంతం చేసుకున్నాడు. మొత్తం 14 మ్యాచ్ ల్లో 488 పరుగులు చేసిన నరైన్.. బౌలింగ్ లో 17 వికెట్లు పడగొట్టాడు.
కోహ్లీకు ఆరెంజ్, హర్షల్ కు పర్పుల్:
టోర్నీ అంతటా బ్యాటింగ్ లో సత్తా అత్యధిక పరుగులు చేసిన కోహ్లీ ఆరెంజ్ క్యాప్ (రూ. 10 లక్షలు) ను అందుకున్నాడు. 15 మ్యాచ్ ల్లో కోహ్లీ 61 యావరేజ్ తో 741 పరుగులు చేశాడు. పంజాబ్ కింగ్స్ బౌలర్ హర్షల్ పటేల్ (రూ. 10 లక్షలు) 14 మ్యాచ్ ల్లో 24 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచి పర్పుల్ క్యాప్ కైవసం చేసుకున్నాడు.
జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్ బెస్ట్ స్ట్రైక్ రేట్ అవార్డు:
సీజన్ మధ్యలో వచ్చి ధనాధన్ ఇన్నింగ్స్ తో ఒక్కసారిగా మెరిశాడు ఢిల్లీ క్యాపిటల్స్ యువ ప్లేయర్ ఫ్రేజర్-మెక్‌గర్క్. ముఖ్యంగా పవర్ ప్లే లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. రెండు సార్లు 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి సంచలనంగా మారాడు. 200కు పైగా స్ట్రైక్ రేట్ టిఘో ఈ సీజన్ లో బెస్ట్ స్ట్రైక్ రేట్ (రూ. 10 లక్షలు) అవార్డు గెలుచుకున్నాడు.
ఇతర అవార్డుల లిస్ట్ ఈ విధంగా ఉన్నాయి:
క్యాచ్ ఆఫ్ ది సీజన్ (రూ. 10 లక్షలు) - రమణదీప్ సింగ్
ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ (రూ. 10 లక్షలు) - నితీష్ కుమార్ రెడ్డి (SRH)
అత్యధిక సిక్స్‌ల అవార్డు (రూ. 10 లక్షలు) - అభిషేక్ శర్మ (SRH)
అత్యధిక ఫోర్లు అవార్డు (రూ. 10 లక్షలు) - ట్రావిస్ హెడ్ (SRH)
ఫెయిర్ ప్లే అవార్డు (రూ. 10 లక్షలు) - సన్‌రైజర్స్ హైదరాబాద్
పిచ్, గ్రౌండ్ అవార్డు (రూ. 50 లక్షలు) - రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం, హైదరాబాద్
IPL ఫైనల్ - KKR vs SRH అవార్డ్స్
ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ - మిచెల్ స్టార్క్
ఫాంటసీ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ - మిచెల్ స్టార్క్
మ్యాచ్‌లో అత్యధిక సిక్సర్లు - వెంకటేష్ అయ్యర్
మ్యాచ్‌లో అత్యధిక ఫోర్లు - రహ్మానుల్లా గుర్బాజ్
మ్యాచ్‌లో అత్యధిక డాట్ బాల్స్ - హర్షిత్ రానా