లీగ్ ఆసాంతం అద్భుత ప్రదర్శన కనబరిచిన హైదరాబాద్ బ్యాటర్లు తుది పోరులో తడబడ్డారు. ఫైనల్ మ్యాచ్‌లో ప్రత్యర్థి జట్టు ముందు బంతికో పరుగు చొప్పున లక్ష్యాన్ని నిర్ధేశించలేకపోయారు. కోల్‌కతా బౌలర్లు విజృంభించడంతో 18.3 ఓవర్లలో 113 పరుగుల వద్ద ఆలౌట్ అయ్యారు. ఈ క్రమంలో సన్‌రైజర్స్ జట్టు చెత్త రికార్డు మూటగట్టుకుంది. ఐపీఎల్ ఫైనల్ చరిత్రలో అత్యల్ప స్కోరు నమోదు చేసిన జట్టుగా తన పేరు లిఖించుకుంది.
ఐపీఎల్ ఫైనల్స్‌లో అతి తక్కువ స్కోర్లు
113: సన్‌రైజర్స్ హైదరాబాద్ (కోల్‌కతాపై, 2024)
125/9: చెన్నై సూపర్ కింగ్స్ (ముంబై ఇండియన్స్‌పై, 2013)
129/8: ముంబై ఇండియన్స్ (రైజింగ్ పుణె సూపర్ జెయింట్ పై, 2017) ఈ మ్యాచ్‌లో ఛేదనకు దిగిన పుణె 128 పరుగులు చేసి ఒక్క పరుగు తేడాతో ఓడింది.
LOWEST SCORE IN IPL FINAL HISTORY - 113 BY SRH.#IPLonJioCinema pic.twitter.com/WyVvwCQlpb
— Dhoni #IPL2024 #CSK 💛 (@CricCrazySubs) May 26, 2024