ఐపీఎల్ లో నేడు (ఏప్రిల్ 17) మరో ఆసక్తికర పోరు జరగనుంది. యువ ఆటగాళ్లతో నిండిన రెండు జట్లు మ్యాచ్ ఆడేందుకు సిద్ధమయ్యాయి. గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తో తలపడుతుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం ఈ మ్యాచ్ కు ఆతిధ్యమిస్తుంది. రెండు జట్లు బలంగా ఉండడంతో మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ కు ముందు ఇరు జట్ల బలాబలాలను ఒకసారి పరిశీలిద్దాం.
గుజరాత్ టైటాన్స్:
టోర్నీలో గుజరాత్ పర్వాలేదనిపిస్తుంది. యువ కెప్టెన్ శుభమాన్ గిల్ సారధ్యంలో ఇప్పటివరకు 6 మ్యాచ్ ల్లో మూడు విజయాలను సాధించింది. టోర్నీ ప్రారంభ మ్యాచ్ లో ముంబైపై గెలిచి శుభారంభం చేసినా.. మధ్యలో తడబడింది. అయితే రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో గెలిచి ఆత్మ విశ్వాసాన్ని కూడా కట్టుకుంది. బ్యాటింగ్ లో గిల్, సాయి సుదర్శన్ అద్భుతంగా రాణిస్తున్నాడు. మిడిల్ ఆర్డర్ రాణిస్తే తిరుగుండదు. ఫినిషర్లుగా టివాటియా, రషీద్ ఖాన్ అదరగొడుతున్నారు. బౌలింగ్ లో రషీద్ ఖాన్, మోహిత్ శర్మ మినహాయిస్తే ఎవరూ రాణించడం లేదు. ఉమేష్ యాదవ్ ఫామ్ లోకి రావాల్సి ఉంది.
ఢిల్లీ క్యాపిటల్స్:
గత సీజన్ మాదిరిగా ఈ సీజన్ లో కూడా ఢిల్లీ క్యాపిటల్స్ చెత్త ప్రదర్శన చేస్తుంది. పంత్ కెప్టెన్ గా, బ్యాటర్ గా అదరగొడుతున్నా.. మిగిలిన బ్యాటర్లు నిలకడగా రాణించడం లేదు. వార్నర్ ప్రతి మ్యాచ్ లో విఫలమవుతూ జట్టుకు భారంగా మారుతున్నాడు. షా పర్వాలేదనిపిస్తున్నాడు. స్టబ్స్ సూపర్ ఫామ్ లో ఉండగా.. లక్నోపై జరిగిన మ్యాచ్ లో ఐపీఎల్ డెబ్యూ చేసిన ఫ్రేజర్ మెక్‌గుర్క్ అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. బౌలింగ్ లో కుల్దీప్ ఒక్కడే నిలకడగా రాణిస్తున్నాడు. ఇశాంత్ పర్వాలేదనిపిస్తున్నా.. అక్షర్ పటేల్,ఖలీల్ అహ్మద్ ఫామ్ లోకి రావాల్సి ఉంది.
Also Read:ఆవేశ్ ఖాన్‌కే ఇలాంటివి సాధ్యం.. ఒక్క బంతి ఆడకుండానే వైరల్ అయ్యాడుగా
ఇరు జట్లు ఐపీఎల్ లో మూడు మ్యాచ్ లాడితే 2 గుజరాత్ టైటాన్స్.. ఒకటి ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించాయి. ఇరు జట్ల బలాబలాలను పరిశీలిస్తే సొంతగడ్డపై ఆడుతుండడంతో ఈ మ్యాచ్ లో గుజరాత్ జట్టు విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ మ్యాచ్ లో ఓడిపోయిన జట్టుకు ప్లే ఆఫ్ అవకాశాలు సంక్లిష్టం అవుతాయి. మరి ఈ మ్యాచ్ లో ఎవరు గెలిచి తమ ఖాతాలో రెండు పాయింట్లు వేసుకుంటారో చూడాలి.
గుజరాత్ ప్లేయింగ్ 11 (అంచనా):
శుభమాన్ గిల్ (కెప్టెన్), మాథ్యూ వేడ్ (వికెట్ కీపర్), సాయి సుదర్శన్, డేవిడ్ మిల్లర్, విజయ్ శంకర్ , రాహుల్ తెవాటియా, అభినవ్ మనోహర్, రషీద్ ఖాన్ , సాయి కిషోర్, ఉమేష్ యాదవ్ , స్పెన్సర్ జాన్సన్
ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ 11 (అంచనా) :
డేవిడ్ వార్నర్ , పృథ్వీ షా , జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్, రిషబ్ పంత్ (కెప్టెన్, వికెట్ కీపర్), షాయ్ హోప్, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్ , కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, ఖలీల్ అహ్మద్ , ఇషాంత్ శర్మ
Today, the Gujarat Titans will clash with the Delhi Capitals in the 32nd match of IPL 2024.
— CricTracker (@Cricketracker) April 17, 2024
It's Shubman Gill vs Rishabh Pant tonight.🔥 pic.twitter.com/J3vnzuB7Rb