IPL 2024: సొంత గడ్డపై కోల్‌కతాను లక్నో ఓడించేనా?.. బలాబలాలు ఇవే

IPL 2024:  సొంత గడ్డపై కోల్‌కతాను లక్నో ఓడించేనా?.. బలాబలాలు ఇవే

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో ఆదివారం(ఏప్రిల్ 14) మరో ఆసక్తికర మ్యాచ్ జరగనుంది. మరికొన్ని గంటల్లో ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్(కేకేఆర్)ను ఢీకొట్టబోతోంది లక్నో సూపర్ జెయింట్స్(ఎల్‌ఎస్‌జి). కోల్‌కతాలోని ఐకానిక్ ఈడెన్ గార్డెన్స్‌లో మధ్యాహ్నం 3.30గంటలకు ఇరుజట్లు తలపడనున్నాయి.

ఈ సీజన్‌లోని వరుసగా మూడు మ్యాచ్ ల్లో గెలుపొంది జోష్ మీదున్న కేకేఆర్ కు గత మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్‌ చెన్నై సూపర్ కింగ్స్‌ షాకిచ్చింది. దీంతో ఈ మెగా టోర్నీలో తొలి ఓటమి చవిచూసింది కేకేఆర్. ఇక,  కేఎల్ రాహుల్ సారథ్యంలోని లక్నో జట్టు ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో మూడు మ్యాచ్‌లు గెలుపొందింది. లక్నో తన చివరి మ్యాచ్ లో ఢిల్లీతో తలపడి ఓటమి పాలైంది. దీంతో కేకేఆర్, ఎల్ఎస్ జీ జట్టు ఈ రోజు జరగబోయే మ్యాచ్ లో గెలిచి సత్తా చాటాలని భావిస్తున్నాయి. 

ఈ క్రమంలో ఇరుజట్ల బలాబాలు ఎలా ఉన్నాయంటే.. ఈ సీజన్ లో భారీ విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న  కోల్‌కతా బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో బలంగా ఉంది. ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించే హిట్లర్లు కేకేఆర్ జట్టులో ఉన్నారు. ఆండ్రూ రస్సెల్, రింకూ సింగ్, సునీల్ నరైన్ వంటి హిట్టర్లు మంచి ఫామ్ లో ఉండటం కేకేఆర్ కు కలిసొచ్చే అంశం.  ఇక, బౌలింగ్ లో అస్ట్రేలియా స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్ తోపాటు సునీల్ నరైన్, వైభవ్ సింగ్, వరుణ్ చక్రవర్తిలు రాణిస్తే.. కోల్‌కతా విజయం ఖాయం. మరోవైపు లక్నోలోనూ డికాక్, కెఎల్ రాహుల్, పడిక్కల్, స్టోయినిస్, నికోలస్ పూరన్ లాంటి హిట్టర్లు ఉన్నారు. వీరు కలిసికట్టుగా రాణిస్తే.. లక్నో విజయం సాధించడం పెద్ద కష్టమేమి కాదు. కాకపోతే .. బ్యాటింగ్ విషయంలో కోల్‌కతాకు ధీటుగా ఉన్నా.. బౌలింగ్ విషయానికి వస్తే లక్నో మరింత మెరుగవ్వాల్సి ఉంటుంది.

ఐపీఎల్ లో ఇప్పటివరకు కోల్‌కతా, లక్నో జట్లు కేవలం మూడుసార్లు మాత్రమే తలపడ్డాయి.  మూడు మ్యాచ్ ల్లోనూ విజయం సాధించి కోల్‌కతాపై లక్నో ఆధిపత్యం చెలాయించింది. అయితే, సొంతగడ్డపై ఆడుతుండటం కోల్‌కతాకు కొంత బూస్ట్ ఇచ్చే అంశంగా చెప్పొచ్చు. ఈ క్రమంలో  లక్నోపై తొలి విజయం సాధించాలని కోల్‌కతా పట్టుదలగా ఉంది. మరి ఈ పోరులో ఎవరు గెలుస్తారో చూడాలి.

పిచ్ రిపోర్ట్:

ఈడెన్ గార్డెన్స్ పిచ్ అటు బ్యాటర్లు, ఇటు బౌలర్లు ఇద్దరికీ అనుకూలంగా ఉంటుంది. మ్యాచ్ ప్రారంభంలో పిచ్..  స్వింగ్‌తో ఫాస్ట్ బౌలర్‌లకు సహకరిస్తునున్నట్లు భావిస్తున్నారు. పిచ్ పరిస్థితులు పూర్తిగా స్పిన్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉండకపోవచ్చు. అయితే, ఆట సాగుతున్న కొద్దీ, పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా మారే అవకాశం ఉంది. దీంతో సెకండ్ బ్యాటింగ్ చేసే జట్టుకు పరుగులు రాబట్టేందుకు వీలుగు మారే అవకాశం ఉండడంతో.. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన జట్టు మొదట బౌలింగ్ ఎంచుకునే ఛాన్స్ ఉంది.

ఇరుజట్ల అంచనా:

కోల్‌కతా నైట్ రైడర్స్:

ఫిల్ సాల్ట్(వారం), సునీల్ నరైన్, వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్(సి), రింకు సింగ్, అంగ్క్రిష్ రఘువంశీ, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి

ఇంపాక్ట్ ప్లేయర్: అనుకుల్ రాయ్

లక్నో సూపర్ జెయింట్స్ (LSG):

KL రాహుల్ (wk/c), క్వింటన్ డి కాక్, దేవదత్ పడిక్కల్, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, ఆయుష్ బడోని, కృనాల్ పాండ్యా, అర్షద్ ఖాన్, రవి బిష్ణోయ్, నవీన్-ఉల్-హక్, యశ్ ఠాకూర్

ఇంపాక్ట్ ప్లేయర్: మణిమారన్ సిద్ధార్థ్