IPL 2024: ఐపీఎల్‌ 2024లో రెండు మ్యాచ్‌లు రీషెడ్యూల్

ఐపీఎల్ (IPL) 2024 షెడ్యూల్‌లో కీలక మార్పు చోటుచేసుకుంది. రెండు మ్యాచ్‌లను రీషెడ్యూల్ చేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. రామనవమి వేడుకల కారణంగా తగిన భద్రత కల్పించలేమని స్థానిక పోలీసులు తెలియజేయడంతో ఏప్రిల్ 17, 2024న ఈడెన్ గార్డెన్స్‌(కోల్‌కతా) వేదికగా జరగాల్సిన కోల్‌కతా నైట్ రైడర్స్ vs రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్.. ఒక రోజు ముందు అనగా ఏప్రిల్ 16, 2024న జరగనుంది.

అలాగే, ఏప్రిల్ 16, 2024న నరేంద్ర మోడీ స్టేడియం(అహ్మదాబాద్‌) వేదికగా జరగాల్సిన గుజరాత్ టైటాన్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్..  ఏప్రిల్ 17, 2024న జరగనుంది. ఈ రెండు మ్యాచ్‌లు మినహా మిగిలిన షెడ్యూల్‌లో ఎలాంటి మార్పులు లేవు.

ALSO READ | IPL 2024: మయాంక్ యాదవ్ రికార్డ్ బ్రేక్: దక్షిణాఫ్రికా పేసర్ ఫాస్టెస్ట్ డెలివరీ

కాగా,  ఏడు దశల సార్వత్రిక ఎన్నికల్లో ఏప్రిల్ 19న బెంగాల్‌లో తొలి దశ పోలింగ్ జరగనుంది. కోల్‌కతాలో ఓటింగ్ జూన్ 1న జరుగుతుంది. ఐపీఎల్ మ్యాచ్ ల రీషెడ్యూల్ కు ఇది కూడా ఒక కారణమే.