KKR vs DC: ఢిల్లీ vs కోల్‌కతా.. గెలిచే జట్టేది..?

KKR vs DC: ఢిల్లీ vs కోల్‌కతా.. గెలిచే జట్టేది..?

ఐపీఎల్ లో నేడు మరో ఆసక్తికర సమరం జరగనుంది. ఢిల్లీ క్యాపిటల్స్ తో కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడనుంది. కోల్‌కతా లోని ఈడెన్ గార్డెన్స్ ఈ మ్యాచ్ కు ఆతిధ్యమిస్తుంది. ప్లే ఆఫ్ కు వెళ్లాలంటే ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకమే. ఈ నేపథ్యంలో నేడు హోరాహోరీ పోరు జరగడం ఖాయంగా కనిపిస్తుంది. ఇరు జట్ల బలాబలాలను ఒకసారి పరిశీలిద్దాం. 

ఢిల్లీ క్యాపిటల్స్:

ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ జోరు మాములుగా లేదు. టోర్నీ ప్రారంభంలో తడబడినా క్రమంగా పుంజుకుంది. ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్ ల్లో 5 విజయాలు సాధించి ప్లే ఆఫ్ రేస్ లో నిలిచింది. మరో నాలుగు మ్యాచ్ లు ఆడాల్సి ఉండగా.. మూడు మ్యాచ్ లు గెలిస్తే ప్లే ఆఫ్ కు వెళ్తుంది. బ్యాటింగ్ విషయానికి వస్తే ఫ్రేజర్ మెక్‌గుర్క్, కెప్టెన్ రిషబ్ పంత్ టాప్ ఫామ్ లో ఉన్నారు. పవర్ ప్లే లో మెక్‌గుర్క్ శుభారంభాన్ని అందిస్తుంటే.. పంత్ చివరి వరకు భాద్యతగా ఆడుతూ అద్భుతమైన ఫినిషింగ్ ఇస్తున్నాడు. బౌలర్లు కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్ నిలకడగా రాణిస్తుండడం ఢిల్లీకి అనుకూల అంశం. వీరందరూ నేటి మ్యాచ్ లో సత్తా చాటితే మరో గెలుపు ఖాయంగా కనిపిస్తుంది. 

కోల్‌కతా నైట్ రైడర్స్:

ఐపీఎల్ లో బలమైన జట్లలో కోల్‌కతా నైట్ రైడర్స్ ఒకటి. టోర్నీ ప్రారంభంలో తిరుగులేని జట్లలో ఒకటిగా ఉన్న కేకేఆర్ ప్రస్తుతం తడబడుతుంది. భారీ స్కోర్లు కొట్టినా వరుసగా రెండు మ్యాచ్ ల్లో ఓడిపోవడం వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీస్తుంది. ఇప్పటివరకు 8 మ్యాచ్ ల్లో 5 గెలిచింది. మరో 6 మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. వీటిలో మూడు గెలిచినా ప్లే ఆఫ్ కు వెళ్తుంది. బ్యాటింగ్ పరంగా జట్టులో ఎలాంటి ఇబ్బందులు లేవు. అందరూ ఫామ్ లో ఉండడం కలిసి వచ్చే అంశం. అయితే బౌలింగ్ లోనే ఆ జట్టు తడబడుతుంది. సునీల్ నరైన్ మినహాయిస్తే అందరూ విఫలమవుతున్నారు. బౌలింగ్ లో మెరుగ్గా రాణిస్తే కేకేఆర్ మళ్ళీ విజయాల బాట పట్టొచ్చు. 

ఇరు జట్ల బలాబలాలను పరిశీలిస్తే కేకేఆర్ కు ఈ మ్యాచ్ లో గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దుర్బేధ్యమైన బ్యాటింగ్ లైనప్.. సొంతగడ్డపై ఆడుతుండడం ఆ జట్టుకు కలిసి వస్తుంది. మరోవైపు ఫామ్ లో ఉన్న ఢిల్లీ అదే ఫామ్ ను కొనసాగిస్తే గెలుపు పెద్ద కష్టం కాకపోవచ్చు. కేకేఆర్ కు 60 శాతం గెలిచే అవకాశాలు ఉంటే.. ఢిల్లీకి 40 శాతం ఉన్నాయి. మరి ఏ జట్టు గెలిచి ప్లే ఆఫ్ రేస్ లోకి ముందుకు దూసుకెళ్తుందో చూడాలి. 

                
ఢిల్లీ ప్లేయింగ్ 11 (అంచనా ):

జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, అభిషేక్ పోరెల్, షాయ్ హోప్, రిషబ్ పంత్ (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, కుమార్ కుషాగ్రా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నార్ట్జే/లిజాద్ విలియమ్స్, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్, 

కోల్‌కతా ప్లేయింగ్ 11 (అంచనా): 

సునీల్ నరైన్, ఫిల్ సాల్ట్, అంగ్క్రిష్ రఘువంశీ, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్) , వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, హర్షిత్ రానా, దుష్మంత చమీరా/ స్టార్క్, వరుణ్ చక్రవర్తి