ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించిన విషయం తెలిసిందే. ఎడతెరిపి లేని వర్షం కురవడంతో సిబ్బంది.. మైదానాన్ని అంతటిని కవర్లతో కప్పి ఉంచారు. అయితే, ప్రస్తుతం వర్షం పూర్తిగా నిలిచిపోయింది. దీంతో తిరిగి ఆట ప్రారంభం అయింది. టాస్ గెలిచిన ముంబై ఫీల్డింగ్ ఎంచుకుంది.
వర్షం అంతరాయం కారణంగా దాదాపు గంటసేపటి ఆట కోల్పోయాము. దీంతో అంపైర్లు ఓవర్లను కుదించారు. ఒక్కో జట్టుకు 16 ఓవర్ల చొప్పున ఆటను కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 9:00 గంటలకు టాస్ వేయగా.. 9 గంటల 15 నిమిషాలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే.. ఇరు జట్లకు ఒక పాయింట్ ఇవ్వబడుతుంది. దీంతో 9 పాయింట్లతో ముంబై ఇండియన్స్ 9వ స్థానంలో కొనసాగుతుంది. అదే సమయంలో కోల్‌కతా నైట్ రైడర్స్ 17 పాయింట్లతో అధికారికంగా ప్లే ఆఫ్స్ చేరిన మొదటి జట్టుగా నిలుస్తుంది.