IPL 2024 Mock Auction: రూ. 18.5 కోట్లు పలికిన మిచెల్ స్టార్క్‌

IPL 2024 Mock Auction: రూ. 18.5 కోట్లు పలికిన మిచెల్ స్టార్క్‌

ఐపీఎల్ 2024 మినీ వేలానికి కౌంట్‌డౌన్ మొద‌లైంది. రేపు దుబాయ్‌లోని కోకో-కోలా అరేనా వేదికగా మ‌ధ్యాహ్నం 12 గంట‌ల నుంచి వేలంపాట షురూ కానుంది. మొత్తం 77 ఖాళీలు ఉండగా, 333 మంది క్రికెటర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకుకోనున్నారు. కాగా, అంతకంటే ముందుగా ఐపీఎల్ ఫ్రాంచైజీలకు రిహార్సల్‌గా మాక్ యాక్షన్ జరుగుతోంది. వేలం నియమాలు మరియు విధి విధానాలపై ప్రాంఛైజీలు ఓ కొలిక్కి రావడానికి వీలుగా జియోసినిమా ఈ మాక్ యాక్షన్ నిర్వహిస్తోంది.

ఐపీఎల్ 2024 మాక్ వేలంలో సురేశ్ రైనా(చెన్నై సూపర్ కింగ్స్), ఇయాన్ మోర్గాన్(సన్‌రైజర్స్ హైదరాబాద్), అనిల్ కుంబ్లే, పార్థివ్ పటేల్(గుజరాత్ టైటాన్స్), ఆకాశ్ చోప్రా, మైక్ హెస్సన్(రాయల్ చాలెంజర్స్ బెంగళూరు), ఆర్‌పి సింగ్, అభినవ్ ముకుంద్, రాబిన్ ఉతప్ప ఆయా ప్రాంచైజీల యజమానుల్లా వ్యవహరించారు. ఈ మాక్ వేలంలో ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్‌ అత్యధిక ధర పలికిన ఆటగాడిగా నిలిచాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్ సీబీ) రూ. 18.5 కోట్లు వెచ్చించి స్టార్క్‌ను సొంతం చేసుకుంది.

ఐపీఎల్ 2024 మాక్ వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాళ్లు

  • మిచెల్ స్టార్క్‌ - రూ. 18.5 కోట్లు (ఆర్ సీబీ)
  • గెరాల్డ్ కోయెట్జీ - రూ. 18 కోట్లు (గుజరాత్ టైటాన్స్)
  • పాట్ కమ్మిన్స్ - రూ. 17.5 కోట్లు (సన్ రైజర్స్)
  • శార్దూల్ ఠాకూర్ - రూ. 14 కోట్లు (పంజాబ్ కింగ్స్)
  • హ్యారీ బ్రూక్ - రూ.9.5 కోట్లు  (గుజరాత్ టైటాన్స్)
  • వనిందు హసరంగా - రూ. 8.5 కోట్లు (చెన్నై సూపర్ కింగ్స్)
  • ట్రావిస్ హెడ్‌ - రూ. 7.5 కోట్లు (చెన్నై సూపర్ కింగ్స్)