ఓవైపు వరల్డ్ కప్ సంగ్రామం హోరాహోరీగా సాగుతుంటే.. మరోవైపు ఐపీఎల్ ప్రాంచైజీ ముంబై ఇండియన్స్ తన పని తాను కానిచ్చేస్తోంది. ట్రేడ్ విండో మొదలైన గంటల వ్యవధిలోనే వేట షురూ చేసింది. విండీస్ ఆల్ రౌండర్ రొమారియో షెపర్డ్‌ను లక్నో సూపర్ జెయింట్స్ నుంచి ట్రేడ్ విండో ద్వారా కొనుగోలు చేసింది. రూ. 50 లక్షల బేస్ ఫ్రైస్‌కు అతన్ని సొంతం చేసుకుంది.
ఐపీఎల్ 2024 సీజన్‌కి సంబంధించి ట్రేడ్ విండో నవంబర్ 1న ఓపెన్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రాంచైజీలన్నీ ఎవరిని ఉంచాలి.. ఎవరిని తప్పించాలి అనే దానిపై తలమునకలై ఉన్నాయి. ఈ గడువు నవంబర్ 26న ముగుస్తుంది. ఏమున్నా ఆ గడువు లోపే ఆటగాళ్ల బదిలీలు జరిగిపోవాలి. కాగా, ఫ్రాంచైజీలు తాము రిటైన్, రిలీజ్ చేసుకునే ఆటగాళ్ల జాబితాను అందించడానికి నవంబర్ 15 తుది గడువని వార్తలోస్తున్నాయి.
రూ.7.75 కోట్ల నుండి రూ.50 లక్షలకు..
బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ రాణించగల సమర్ధుడు రొమారియో షెపర్డ్. 2022 సీజన్‌లో సన్ రైజర్స్ జట్టు ఇతన్ని ఏకంగా రూ. 7.75 కోట్లు పెట్టి దక్కించుకుంది. కానీ ఆ సీజన్‌లో అతడు విపలమవడంతో 2023 వేలానికి ముందు వదిలించుకుంది. అనంతరం 2023 వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ అతన్ని రూ. 50 లక్షల బేస్ ప్రైజ్ కే దక్కించుకుంది. ఇప్పుడు అదే ధరకు అతడు ముంబై ఇండియన్స్ గూటికి చేరాడు.
Know more about our new ??? ?????? member: https://t.co/XOAEAdJHRP#OneFamily #MumbaiIndians #MumbaiMeriJaan #IPL pic.twitter.com/NqgCm924xx
— Mumbai Indians (@mipaltan) November 3, 2023
ముంబై ఇండియన్స్ జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), సందీప్ వారియర్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), డెవాల్డ్ బ్రెవిస్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, మొహమ్మద్ అర్షద్ ఖాన్, రమణదీప్ సింగ్, హృతిక్ షోకీన్, అర్జున్ టెండూల్కర్, ట్రిస్టన్ స్టబ్స్, కుమార్ కార్తికేయ, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్ , ఆకాష్ మాధ్వల్, కామెరాన్ గ్రీన్, రిలే మెరెడిత్, పియూష్ చావ్లా, డువాన్ జాన్సెన్, విష్ణు వినోద్, షామ్స్ ములానీ, నెహాల్ వధేరా, రాఘవ్ గోయల్, క్రిస్ జోర్డాన్, రొమారియో షెపర్డ్.