IPL 2024: చేతులు మారిన భారీ మొత్తం.. రెండు గంటల్లోనే ముంబై గూటికి పాండ్యా

IPL 2024: చేతులు మారిన భారీ మొత్తం.. రెండు గంటల్లోనే ముంబై గూటికి పాండ్యా
  • సమయం సాయంత్రం 5.30 గంటలు: హార్దిక్ ను రిటైన్ చేసుకున్నామని గుజరాత్ టైటాన్స్ ప్రకటన
  • సమయం రాత్రి 7.30 గంటలు: పాండ్యా తమకు సొంతమయ్యాడని ముంబై ఇండియన్స్ ప్రకటన

ఇదీ ఐపీఎల్ క్రేజ్. చూశారుగా! కేవలం రెండు గంటల్లోనే ఎంతటి సెన్సేషన్. చదవడానికి వార్తలా ఇది చిన్న విషయంలా అనిపించొచ్చు. కానీ, దేశమంతటా దీని గురుంచే చర్చ. అంబానీ కొనేశాడు.. అంబానీ కొనేశాడు..! ఇదే డిస్కషన్. ఈ డీల్ వెనుక భారీ మొత్తం చేతులు మారిందని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. హార్ధిక్‌ను రిటైన్‌ చేసుకున్నామని గుజరాత్‌ ప్రకటించిన రెండు గంటల్లోపే ముంబై తాము హార్దిక్‌ను తిరిగి దక్కించుకున్నామని వెల్లడించింది. 

రూ. 15 కోట్లు+ భారీ మొత్తం!

2022 ఐపీఎల్ వేలంలో పాండ్యా కోసం గుజరాత్ టైటాన్స్ యాజమాన్యం రూ.15 కోట్లు కోట్లు వెచ్చించింది. అనంతరం గత సీజన్ లోనూ అతనికి అదే మొత్తాన్ని చెల్లించారు. కానీ, ఇప్పుడు అతని కోసం ముంబై యాజమాన్యం చెల్లించింది.. భారీ మొత్తమట. ప్లేయర్లను ట్రేడ్ చేసుకోవడానికి టైటాన్స్ అంగీకరించకపోవడంతో రూ.15 కోట్లకు అదనపు మొత్తాన్ని చెల్లించిందట. దాదాపు రెట్టింపు మొత్తం అన్న టాక్ వినపడుతోంది. పంతం కోసమే ఈ డీల్ జరిగిందనేది మరో టాక్. 

గుజరాత్‌ యాజమాన్యంతో ఆర్ధిక పరమైన విభేదాలు ఉన్న కారణంగానే హార్దిక్‌ ముంబై ఇండియన్స్‌ పంచన చేరాడట. కాగా, పాండ్యా గతంలో ఆరేళ్ల పాటు (2015-2021) ముంబై ఇండియన్స్‌కే ప్రాతినిథ్యం వహించిన విషయం తెలిసిందే. మూడేళ్ళ క్రితం అతడు ఫామ్ కోల్పోవడంతో ముంబై అతన్ని విడిచి పెట్టింది.