ఐపీఎల్ లో తెలుగు జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్ మరో కీలక పోరుకు సిద్ధమవవుతుంది. జోరు మీదున్న పంజాబ్ కింగ్స్ పై విజయం సాధించి గెలుపును కొనసాగించాలని భావిస్తుంది. మరోవైపు సొంతగడ్డపై పంజాబ్ మరో విజయంపై కన్నేసింది. రెండు జట్లు పటిష్టంగా ఉండడంతో ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగడం ఖాయంగా కనిపిస్తుంది. ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు 21 మ్యాచ్ లు జరిగితే సన్ రైజర్స్ 14 మ్యాచ్ ల్లో గెలిచింది. మరో 7 మ్యాచ్ ల్లో పంజాబ్ విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో ఇరు జట్ల బలాబలాలను ఒకసారి పరిశీలిద్దాం.
పంజాబ్ కింగ్స్:
తొలి మ్యాచ్ లో ఢిల్లీపై విజయం సాధించిన తర్వాత వరుసగా రెండు మ్యాచ్ ల్లో ఓడిపోయింది. అయితే గుజరాత్ పై 200 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేజ్ చేయడం ఆ జట్టు ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. బ్యాటింగ్ లో ఏ ఒక్కరు నిలకడగా రాణించకపోవడం ఆ జట్టుకు పెద్ద సమస్యగా మారింది. బౌలింగ్ లో అర్షదీప్, హరిప్రీత్ బ్రార్ మినహాయిస్తే మిగిలిన వారందరు భారీగా పరుగులు సమర్పించుకుంటున్నారు. బెయిర్ స్టో ఫామ్ లో లేకపోవడం పంజాబ్ జట్టును కలవరపెడుతుంది. మరోవైపు బౌలింగ్ లో రబడా రాణిస్తే పంజాబ్ కు తిరుగుండదు. సొంతగడ్డపై సత్తా చాటేందుకు అందరూ సిద్ధంగా ఉన్నారు. గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లో శశాంక్ సింగ్ రాణించడంతో పంజాబ్ జట్టుకు ఊరట.
పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ 11 (అంచనా):
శిఖర్ ధావన్ (కెప్టెన్ ), జానీ బెయిర్‌స్టో/అశుతోష్ శర్మ, జితేష్ శర్మ (వికెట్ కీపర్), ప్రభ్‌సిమ్రాన్ సింగ్, సామ్ కర్రాన్, శశాంక్ సింగ్, సికందర్ రజా, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబాడ, అర్ష్‌దీప్ సింగ్.
సన్ రైజర్స్ హైదరాబాద్ :
హైదరాబాద్ బ్యాటర్లలో అభిషేక్ శర్మ హెన్రిచ్ క్లాసెస్ చెలరేగి ఆడుతున్నారు. కేకేఆర్ పై క్లాసన్ 29 బంతుల్లో63 పరుగులు.. ముంబైపై 34 బంతుల్లో 80 పరుగులు చేశాడు. మరోవైపు అభిషేక్ శర్మ ముంబైపై 16 బంతుల్లో హాఫ్ సెంచరీ.. చెన్నైపై 12 బంతుల్లోనే 37 పరుగులు చేసి టాప్ ఫామ్ లో ఉన్నాడు. అలాగే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఎయిడెన్ మార్క్ రమ్ బ్యాటింగ్ లైనప్ బాగుంది. బౌలర్లలో ఫ్యాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్ సీజన్ ఆరంభంలో విఫలమైనా చెన్నైతో జరిగిన మ్యాచ్ తో గాడిలో పడ్డాడు. ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్ ల్లో రెండు విజయం సాధించింది. ఈ రెండు సొంతగడ్డపై రావడం విశేషం. తొలి మ్యాచ్ లో కేకేఆర్ పై చివరి బంతికి ఓడిన కమ్మిన్స్ సేన.. ఆ తర్వాత ముంబైని చిత్తు చేసి ఘన విజయాన్ని అందుకుంది. గుజరాత్ పై జరిగిన మ్యాచ్ లో ఓడిపోగా.. చెన్నై సూపర్ కింగ్స్ ను చిత్తు చేసింది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయింగ్ XI (అంచనా):
రాహుల్ త్రిపాఠి/మయాంక్ అగర్వాల్, ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఐడెన్ మర్క్రమ్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్ ), అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, నటరాజన్, జయదేవ్ ఉనద్కత్
ఇరు జట్ల బలాబలాలను పరిశీలిస్తే ఈ మ్యాచ్ లో పంజాబ్ కే విజయవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సొంతగడ్డపై ఆడుతుండడం.. బ్యాటింగ్ డెప్త్ ఎక్కువగా ఉండడం.. కలిసి రానుంది. మరో వైపు సన్ రైజర్స్ సమిష్టిగా రాణిస్తే గెలుపు పెద్ద కష్టం కాకపోవచ్చు. పంజాబ్ కు 55 శాతం.. సన్ రైజర్స్ కు 45 శాతం గెలిచే అవకాశాలు ఉన్నాయి.
North vs South, Punjab Kings Take On The SunRisers Hyderabad 🧡🥵🔥 Good Luck & All The Best, @SunRisers 🧡🧡🧡 #SRH #SunRisersHyderabad #OrangeArmy #IPL2024 #PBKS #PunjabKings pic.twitter.com/69PcNECviC
— Varun Velamakanti (@VarunSunRisers) April 8, 2024