IPL 2024: బౌలర్లపై పగబట్టిన ఆర్‌సీబీ.. ఏకంగా 11 మంది ఔట్

IPL 2024: బౌలర్లపై పగబట్టిన ఆర్‌సీబీ.. ఏకంగా 11 మంది ఔట్

ఐపీఎల్‌ 2024 రిటెన్ష‌న్ ప్ర‌క్రియ‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) జ‌ట్టు ప్ర‌క్షాళ‌న చేప‌ట్టింది. ఏకంగా 11 మందిపై వేటు వేసింది. వీరిలో ఐదుగురు ఆల్ రౌండర్లు కాగా, నలుగురు బౌలర్లు ఉన్నారు. మొత్తంగా 10 మంది బౌలర్లను వదిలించుకున్న ఆర్‌సీబీ నిర్ణయం ఆ జట్టు అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది. 

ఎప్పటిలానే ఆర్‌సీబీ యాజమాన్యం.. డుప్లెసిస్, మాక్స్‌వెల్, విరాట్ కోహ్లీ, దినేష్ కార్తీక్, విల్ జాక్స్  వంటి స్టార్  బ్యాటర్లపైనే నమ్మకముంచింది. మొత్తం 18 మందిని అంటిపెట్టుకోగా.. 11 మందిని వేలంలోకి వదిలింది. ఇక సన్ రైజర్స్ నుంచి ట్రేడ్ రూపంలో మయాంక్ దాగర్‌ను సొంతం చేసుకుంది.   

   
ఆర్‌సీబీ రిలీజ్ చేసిన ఆటగాళ్ల లిస్ట్: జోష్ హాజిల్‌వుడ్, వనిందు హసరంగా, హర్షల్ పటేల్, ఫిన్ అలెన్, మైఖేల్ బ్రేస్ వెల్, డేవిడ్ విల్లీ, వేన్ పార్నెల్, సోనూ యాదవ్, అవినాష్ సింగ్, సిద్ధార్థ్ కౌల్ మరియు కేదార్ జాదవ్. 

 

ఆర్‌సీబీ రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల లిస్ట్: ఫాఫ్ డుప్లెసిస్, గ్లెన్ మాక్స్‌వెల్, విరాట్ కోహ్లీ, రజిత్ పాటిదార్, అనుజ్ రావత్, దినేష్ కార్తీక్, సుయాష్ ప్రభుదేసాయి, విల్ జాక్స్, మహిపాల్ లోమ్రోర్, కర్ణ్ శర్మ, మనోజ్ భాండాగే, మయాంక్ దాగర్ (ట్రేడ్), వైషాక్ విజయ్‌కుమార్, ఆకాశ్ దీప్, మహ్మద్ సిరాజ్, రీస్ టోప్లీ, హిమాన్షు శర్మ, రాజన్ కుమార్.