ప్రస్తుత ఐపీఎల్ 2024 సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు రియాన్ పరాగ్ చెలరేగిపోతున్నాడు. ఆడిన 3 మ్యాచ్‌ల్లో 160కిపైగా స్ట్రయిక్‌రేట్, 180కిపైగా సగటుతో 181 పరుగులు చేశాడు. ముంబైతో మ్యాచ్‌లో సహచరులంతా తక్కువ స్కోర్లకే ఔటైతే రియాన్(54 నాటౌట్) ఒక్కడే నిలదొక్కుకుని జట్టును విజయతీరాలకు చేర్చాడు. దీంతో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి(180) పరుగులను సమం చేసి ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు.
ఇక్కడే అందరి మదిలో ఓ ప్రశ్న మెదులుతోంది. ఇద్దరి పరుగులు సమానమైనప్పుడు.. కోహ్లీని కాదని పరాగ్‌కు ఎందుకు ఆరెంజ్ క్యాప్ ఇచ్చారనేది అందరి నోట చర్చ. అందుకు కొన్ని కారణాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం..
స్ట్రైక్ రేట్ మరియు యావరేజ్
ఇద్దరి పరుగులు సమం అయినప్పటికీ, కోహ్లీతో పోలిస్తే రియాన్ పరాగ్ అత్యుత్తమ ప్రదర్శన కనపరిచాడు. కోహ్లీ స్ట్రైక్ రేట్ 141.41, సగటు 90.50గా ఉండగా.. పరాగ్ స్ట్రైక్ రేట్ 141.41, సగటు 90.50గా ఉంది. ఈ గణాంకాలను ఆధారంగా చేసుకొని పరాగ్‌కు ఆరెంజ్ క్యాప్ అందించారు.
ALSO READ :- RCB vs LSG: ఆర్‌సీబీదే టాస్.. తుది జట్టులో ఒకే ఒక మార్పు
Riyan Parag joins his idol Virat Kohli on the list and currently holds the Orange cap in IPL 2024.
— CricTracker (@Cricketracker) April 1, 2024
📸: Jio Cinema pic.twitter.com/3vktRlJ5Ei