క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ -17వ సీజన్ షెడ్యూల్ పాక్షికంగా విడుదలైంది. ఈ ఏడాది మార్చి-ఏప్రిల్‌లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వాటిని దృష్టిలో ఉంచుకొని బీసీసీఐ మొదటి 21 రోజుల షెడ్యూల్ విడుదల చేసింది. ఈ మ్యాచ్‌లు మార్చి 22 నుండి ఏప్రిల్ 7 వరకు జరుగుతాయి.
చెన్నై, ముంబై, మొహాలీ, కోల్‌కతా, జైపూర్, అహ్మదాబాద్, బెంగళూరు, లక్నో, విశాఖపట్నం, హైదరాబాద్ వేదికలు.. తొలి 21 మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరగనుంది. మిగిలిన షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికల తేదీలను వెల్లడించిన తర్వాత ప్రకటించనున్నారు.
🚨 𝗦𝗧𝗢𝗣 𝗧𝗛𝗘 𝗣𝗥𝗘𝗦𝗦 - TATA #IPL2024 Schedule is HERE! 🤩
— Star Sports (@StarSportsIndia) February 22, 2024
Get ready for the thrill, excitement and fun to begin! Save this post so you don't have to search for it again 🔍
It's #CSKvRCB, @msdhoni 🆚 @imVkohli in the opener! Who's your pick ? 👀#IPLSchedule #IPLonStar pic.twitter.com/oNLx116Uzi
మొత్తం 10 జట్లు:
ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మరియు లక్నో సూపర్ జెయింట్స్.
జట్లు - కెప్టెన్లు
- MI: హార్దిక్ పాండ్యా
- CSK: ఎంఎస్ ధోని
- KKR: శ్రేయాస్ అయ్యర్
- RCB: ఫాఫ్ డు ప్లెసిస్
- DC: రిషబ్ పంత్
- PBKS: శిఖర్ ధావన్
- GT: శుభ్‌మన్ గిల్
- LSG: KL రాహుల్
- SRH: డేవిడ్ వార్నర్
- RR: సంజు శాంసన్