IPL 2024: ఐపీఎల్‌ 2024 షెడ్యూల్‌.. హైదరాబాద్‌లో రెండే మ్యాచ్‌లు

IPL 2024: ఐపీఎల్‌ 2024 షెడ్యూల్‌.. హైదరాబాద్‌లో రెండే మ్యాచ్‌లు

క్రికెట్‌ అభిమానుల ఎదురుచూపులకు తెరదించుతూ బీసీసీఐ ఐపీఎల్ -17వ సీజన్‌ షెడ్యూల్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. కొన్ని గంటల క్రితమే ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్.. మొదటి 15 రోజుల షెడ్యూల్‌ (21 మ్యాచ్‌లు)ను ప్రకటించింది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి.

ఈ ఏడాది దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలోనే ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఈ నిర్ణయం తీసుకుంది. రెండు భాగాలుగా మ్యాచ్‌లు నిర్వహించనుంది. మిగిలిన షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికల తేదీలను వెల్లడించిన తర్వాత ప్రకటించనుంది. మార్చి 22 నుండి ఏప్రిల్ 7 వరకు తొలి భాగం జరగనుండగా.. చెన్నై, ముంబై, మొహాలీ, కోల్‌కతా, జైపూర్, అహ్మదాబాద్, బెంగళూరు, లక్నో, విశాఖపట్నం, హైదరాబాద్ వేదికలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి.

అహ్మదాబాద్‌లో 3 మ్యాచ్‌లు

మొత్తం 10 వేదికల్లో ఐపీఎల్ తొలి భాగం జరగనుండగా.. అహ్మదాబాద్ మినహా ప్రతి స్టేడియం రెండు మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనుంది. ఒక్క నరేంద్ర మోడీ స్టేడియంలో మాత్రమే మూడు మ్యాచ్‌లు జరగనున్నాయి. మహిళా ప్రీమియర్ లీగ్()డబ్ల్యూపీఎల్) ఉన్న నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ తొలి రెండు మ్యాచ్‌లను తమ సొంత గ్రౌండ్‌ (అరుణ్‌ జైట్లీ స్టేడియం)లో కాకుండా వైజాగ్‌లో ఆడనుంది.

మొదటి 21 మ్యాచ్‌ల షెడ్యూల్

  • మార్చి 22: చెన్నై వర్సెస్‌ బెంగళూరు (చెన్నై)
  • మార్చి 23: పంజాబ్‌ వర్సెస్‌ ఢిల్లీ (మొహాలీ)
  • మార్చి 23: కోల్‌కతా వర్సెస్‌ హైదరాబాద్ (కోల్‌కతా)
  • మార్చి 24: రాజస్తాన్‌ వర్సెస్‌ లక్నో (జైపూర్‌)
  • మార్చి 24: గుజరాత్‌ వర్సెస్‌ ముంబై (అహ్మదాబాద్‌)
  • మార్చి 25: బెంగళూరు వర్సెస్‌ పంజాబ్‌ (బెంగళూరు)
  • మార్చి 26: చెన్నై వర్సెస్‌ గుజరాత్‌ (చెన్నై)
  • మార్చి 27: హైదరాబాద్‌ వర్సెస్‌ ముంబై (హైదరాబాద్‌)
  • మార్చి 28: రాజస్తాన్‌ వర్సెస్‌ ఢిల్లీ (జైపూర్‌)
  • మార్చి 29: బెంగళూరు వర్సెస్‌ కోల్‌కతా (బెంగళూరు)
  • మార్చి 30: లక్నో వర్సెస్‌ పంజాబ్‌ (లక్నో)
  • మార్చి 31: గుజరాత్‌ వర్సెస్‌ హైదరాబాద్‌ (అహ్మదాబాద్‌)
  • మార్చి 31: ఢిల్లీ వర్సెస్‌ చెన్నై (వైజాగ్‌)
  • ఏప్రిల్‌ 01: ముంబై వర్సెస్‌ రాజస్తాన్‌ (ముంబై)
  • ఏప్రిల్‌ 02: బెంగళూరు వర్సెస్‌ లక్నో (బెంగళూరు)
  • ఏప్రిల్‌ 03: ఢిల్లీ వర్సెస్‌ కోల్‌కతా (వైజాగ్‌)
  • ఏప్రిల్‌ 04: గుజరాత్‌ వర్సెస్‌ పంజాబ్‌ (అహ్మదాబాద్‌)
  • ఏప్రిల్‌ 05: హైదరాబాద్‌ వర్సెస్‌ చెన్నై (హైదరాబాద్‌)
  • ఏప్రిల్‌ 06: రాజస్తాన్‌ వర్సెస్‌ బెంగళూరు ( జైపూర్‌)
  • ఏప్రిల్‌ 07: ముంబై వర్సెస్‌ ఢిల్లీ (ముంబై)
  • ఏప్రిల్‌ 07: లక్నో వర్సెస్‌ గుజరాత్‌ (లక్నో)