
గత మూడు, నాలుగు సీజన్లుగా దారుణ వైఫల్యాలతో పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలుస్తున్న సన్ రైజర్స్ హైదరాబాద్(ఎస్‌ఆర్‌హెచ్).. ఈసారి అలాంటి తప్పులు పునరావృతం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఐపీఎల్ వేలంలో భారీ ధర వెచ్చించి స్టార్ ప్లేయర్లను దక్కించుకున్న ఎస్‌ఆర్‌హెచ్ యాజమాన్యం.. అందరికంటే ముందే ఐపీఎల్ సన్నాహకాలు ప్రారంభించింది. టైటిల్ గెలవడమే లక్ష్యంగా ప్రీ సీజన్ క్యాంప్ షురూ చేసింది. అందుకు సంబంధించిన ఫోటోలను అధికారిక ట్విట్టర్(ఎక్స్) హ్యాండిల్‌లో పోస్ట్ చేసింది.
తొలిరోజు ఎస్‌ఆర్‌హెచ్ క్యాంప్‌నకు పలువురు ప్లేయర్లు హాజరయ్యారు. యువ క్రికెటర్లు ఆకాశ్ సింగ్, అన్మోల్, ఉపేంద్ర, జతవేద్ సుబ్రమణియన్, నితీశ్ రెడ్డి సహా తమిళనాడు పేసర్, అభిమానులంతా యార్కర్ల నట్టూగా పిలుచుకునే నటరాజన్ క్యాంప్‌లో కనిపించారు. ఐపీఎల్ ప్రారంభానికి మరికొంత సమయం(మార్చి 22 నుంచి) ఉంది కనుక త్వరలోనే దేశీయ, అంతర్జాతీయ స్టార్లు క్యాంప్‌లో కలవనున్నారు.
Nattu’s ? to weave his ???-???????? ????? once again ? #FlameComing begins with our yorker king ? pic.twitter.com/YlDyGfnirF
— SunRisers Hyderabad (@SunRisers) March 4, 2024
కెప్టెన్‌గా కమ్మిన్స్
వేలంలో రూ. 20.50 కోట్లు వెచ్చించి ఆసీస్ పేసర్ పాట్ కమిన్స్‌కు దక్కించుకున్న ఎస్‌ఆర్‌హెచ్.. అతనికి నాయకత్వ బాధ్యతలు అప్పగించింది. అతడు సన్ రైజర్స్ కు టైటిల్ అందిస్తాడనే ధీమాతో ఉంది. అతనికి తోడుగా వరల్డ్ కప్ విన్నింగ్ హీరో ట్రావిస్ హెడ్( రూ. 6.5 కోట్లు), లంక ఆల్ రౌండర్ స్పిన్నర్ వనిందు హసరంగ(రూ. 1.5 కోట్లు), దక్షిణాఫ్రికా స్టార్ ఆల్‌రౌండర్ ఎయిడెన్ మార్క్‌రమ్, సఫారీ విధ్వంసకర బ్యాటర్ హెన్రిచ్ క్లాసేన్ రూపంలో మంచి విదేశీ స్టార్లు ఉన్నారు. వీరందరూ రాణిస్తే ఎస్‌ఆర్‌హెచ్ కప్పు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
Reℂ?ℙping Day 1 ✨#FlameComing pic.twitter.com/HgamsW01Fi
— SunRisers Hyderabad (@SunRisers) March 5, 2024
సన్‌రైజర్స్ స్క్వాడ్
పాట్ కమిన్స్(కెప్టెన్), అబ్దుల్ సమద్, అభిషేక్ శర్మ, ఐడెన్ మార్క్రామ్, మార్కో జాన్సెన్, రాహుల్ త్రిపాఠి, వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, సన్వీర్ సింగ్, హెన్రిచ్ క్లాసెన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ అగర్వాల్, టి. నటరాజన్, అన్మోల్‌ప్రీత్ సింగ్, మయాంక్ మార్కండే, ఉపేంద్ర సింగ్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్, నితీష్ కుమార్ రెడ్డి, ఫజల్హాక్ ఫరూఖీ, షాబాజ్ అహ్మద్, ట్రావిస్ హెడ్, వనిందు హసరంగా, జయదేవ్ ఉనద్కత్, ఆకాష్ సింగ్, ఝతావేద్ సుబ్రమణ్యన్.
ఐపీఎల్ 2024 సన్‌రైజర్స్ షెడ్యూల్
- మార్చి 23న: కోల్‌కతా నైట్ రైడర్స్‌తో
- మార్చి 27న: ముంబై ఇండియన్స్‌తో
- మార్చి 31న: గుజరాత్ టైటాన్స్‌తో
- ఏప్రిల్ 05న: చెన్నై సూపర్ కింగ్స్‌తో