ఇండియాలో ఐపీఎల్ కు విపరీతమైన క్రేజ్ ఉన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఐపీఎల్ మొదలైందంటే చాలు దేశంలో పండగ వాతావారణం నెలకొంటుంది. రెండు నెలలపాటు జరిగే ఈ సంగ్రామం అభిమానులకి పిచ్చ కిక్ ఇస్తుంది. ఒకరకంగా చెప్పాలంటే వరల్డ్ కప్ కంటే ఐపీఎల్ కే ఎక్కువ క్రేజ్ ఉందనే మాట వాస్తవం. ఇదిలా ఉండగా.. ఈ సారి సార్వత్రక ఎన్నికల కారణంగా ఐపీఎల్ 2024 ను దుబాయ్ లో నిర్వహించాలని నివేదికలు చెప్పుకొచ్చాయి.
అందుకు తగ్గట్టుగానే ఐపీఎల్ 2024 మినీ వేలాన్ని దుబాయిలోనే జరిపారు. అయితే ఐపీఎల్ 2024 సీజన్ భారత్ లోనే జరగనున్నట్లు ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ నేడు(ఫిబ్రవరి 20) అధికారికంగా ప్రకటించారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. చెన్నైలో తొలి మ్యాచ్ నిర్వహించనున్నారు. సార్వత్రిక ఎన్నికలు జరిగినా ఇండియాలోనే ఈ మెగా లీగ్ నిర్వహిస్తారని.. లీగ్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ మంగళవారం (ఫిబ్రవరి 20) PTIకి తెలిపారు.
ఏప్రిల్, మే నెలల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా, ఐపీఎల్ 17వ ఎడిషన్ షెడ్యూల్ ఇంకా వెల్లడించాల్సి ఉంది. మొదటి 15 రోజుల షెడ్యూల్‌ను మాత్రమే ప్రకటిస్తామని.. సాధారణ ఎన్నికల తేదీల ప్రకటన తర్వాత మిగిలిన షెడ్యూల్ నిర్ణయిస్తామని ధుమాల్ తెలిపారు. వచ్చే నెల ప్రారంభంలో లోక్‌సభ ఎన్నికల తేదీలను ప్రకటించే అవకాశం ఉంది.
జూన్ 1 నుంచి వెస్టిండీస్,అమెరికా వేదికగా టీ 20 వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో మే 20 లోపు ఈ మెగా టోర్నీని ముగించే అవకాశం ఉంది. గత నెలలో దుబాయ్‌లో జరిగిన IPL 2024 వేలం తర్వాత ఫ్రాంచైజీలు ఇప్పటికే తమ జట్లని ఖరారు చేశాయి. ఆస్ట్రేలియన్ క్రికెటర్ మిచెల్ స్టార్క్ ఐపీఎల్ చరిత్రలో అత్యధికంగా రూ. 24.75 కోట్లకు కోల్‌కతా నైట్ రైడర్స్ కోట్లకు కొనుగోలు చేసింది. డిఫెండింగ్ ఛాంపియన్ గా చెన్నై సూపర్ కింగ్స్ బరిలోకి దిగుతుంది.
IPL Chairman Arun Dhumal confirms IPL 2024 start date
— SportsTiger (@The_SportsTiger) February 20, 2024
📷: BCCI/IPL#IPL2024 #TATIPL2024 #T20Cricket #IPL #Chennai #Cricket #CricketTwitter pic.twitter.com/bmsNCw9Kra