ఐపీఎల్ లో నేడు (ఏప్రిల్ 5) హై వోల్టేజ్ మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. సన్ రైజర్స్ హైదరాబాద్ తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం ఈ మ్యాచ్ కు ఆతిధ్యమిస్తుంది. సాయంత్రం 7:30 నిమిషాలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. రెండు జట్లు బలంగా ఉండడంతో ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో ఆసక్తిగా మారింది. ఇరు జట్ల బలాబలాలను ఒకసారి పరిశీలిద్దాం
చెన్నై సూపర్ కింగ్స్ :
ఈ సీజన్ లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై తమ స్థాయికి తగ్గ ఆట తీరును ప్రదర్శిస్తుంది. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్ ల్లో రెండు మ్యాచ్ ల్లో గెలుపొందింది. టోర్నీలో తొలి రెండు మ్యాచ్ లు గెలిచి శుభారంభం చేసింది. ఢిల్లీతో వైజాగ్ లో జరిగిన మ్యాచ్ లో ఓటమి పాలైంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో చెన్నైకి తిరుగులేదు.
బ్యాటింగ్ లో చెన్నై జట్టు చాలా పటిష్టంగా కనిపిస్తుంది. ఓపెనర్లు గైక్వాడ్, రచీన్ రవీంద్ర సూపర్ ఫామ్ లో ఉంటే.. మిడిల్ ఆర్డర్ లో దూబే, డారిల్ మిచెల్ అదరగొడుతున్నారు. చివర్లో జడేజా, ధోనీ ఇన్నింగ్స్ ఫినిషింగ్ చేయడానికి ఉండనే ఉన్నారు. సమీర్ రిజ్వి ఆడిన తొలి మ్యాచ్ లోనే ఆకట్టుకోవడం చెన్నై జట్టుకు కలిసి వస్తుంది.
ఇక బౌలింగ్ లో చెన్నై సమిష్టిగా రాణిస్తుంది. పతిరానా, ముస్తఫిజుర్ రూపంలో ఇద్దరు విదేశీ పేసర్లు.. చాహర్, శార్దూలు ఠాకూర్, తుషార్దేశ్ పాండే రూపంలో పేస్ బౌలింగ్ దుర్బేధ్యంగా కనిపిస్తుంది. ఈ మ్యాచ్ లో ముస్తఫిజుర్ అందుబాటులో లేకపోవడం చెన్నైకు ప్రతికూలంగా మారనుంది. రవీంద్ర జడేజా, తీక్షణ రూపంలో ఇద్దరు నాణ్యమైన స్పిన్నర్లు ఉండడంతో చెన్నై అన్ని విభాగాల్లో బలంగా కనిపిస్తుంది.
సన్ రైజర్స్ హైదరాబాద్:
హైదరాబాద్ బ్యాటర్లలో హెన్రిచ్ క్లాసెస్ చెలరేగి ఆడుతున్నాడు. కేకేఆర్ పై 29 బంతుల్లో63 పరుగులు చేసిన ఇతను.. ముంబైపై 34 బంతుల్లో 80 పరుగులు చేశాడు. అలాగే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఎయిడెన్ మార్క్ రమ్ బ్యాటింగ్ లైనప్ బాగుంది. బౌలర్లలో ఫ్యాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్ సత్తా చాటాల్సి ఉంది. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్ ల్లో ఒకటే విజయం సాధించింది. సొంతగడ్డపై ఆడుతుండడంతో ఈ రోజు జరగబోయే మ్యాచ్ లో మరో విజయాన్ని అందుకోవాలని భావిస్తుంది. తొలి మ్యాచ్ లో కేకేఆర్ పై చివరి అబంతికీ ఓడిన కమ్మిన్స్ సేన ఆ తర్వాత ముంబైని చిత్తు చేసి ఘన విజయాన్ని అందుకుంది. ఇక గుజరాత్ పై జరిగిన మ్యాచ్ లో ఓడిపోయింది.
ALSO READ :- బీజేపీకి బిగ్ షాక్.. కాంగ్రెస్ లో చేరిన కూన శ్రీశైలం గౌడ్
రెండు జట్ల బలాబలాలను పరిశీలిస్తే ఈ మ్యాచ్ లో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమిష్టిగా కనిపిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ ఫేవరేట్ గా కనిపిస్తుంది. మరోవైపు సొంతగడ్డపై మ్యాచ్ కావడం.. క్లాసన్, అభిషేక్ శర్మ సూపర్ ఫామ్ లో ఉండడంతో సన్ రైజర్స్ గెలిచే అవకాశాలు ఉన్నాయి. చెన్నైకు 60 శాతం గెలిచే ఛాన్స్ ఉంటే.. హైదరాబాద్ జట్టుకు 40 శాతం అవకాశాలు ఉన్నాయి. చివరి మ్యాచ్ లో ఓడిపోయి వస్తున్న ఇరు జట్లు ఎవరు గెలిచి విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంటారో చూడాలి.
సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు (అంచనా)
మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్ (కెప్టెన్), మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్, తంగరాసు నటరాజన్, మయాంక్ మార్కండే
చెన్నై సూపర్ కింగ్స్ తుది జట్టు (అంచనా )
రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్), రచిన్ రవీంద్ర, అజింక్యా రహానే, డారిల్ మిచెల్, రవీంద్ర జడేజా, సమీర్ రిజ్వీ, ఎంఎస్ ధోని (వికెట్ కీపర్), దీపక్ చాహర్, మహేశ్ తీక్షణ, మతీషా పతిరణ, తుషార్ దేశ్‌పాండే
Chennai Super Kings vs Sunrisers Hyderabad
— 🏏CricketFeed (@CricketFeedIN) April 5, 2024
HEAD TO HEAD:
MATCHES PLAYED - 19
CSK - 14
SRH - 5#SRHvsCSK #Shashank #Warriors #SunrisersHyderabad #PBKS#ChennaiSuperKings pic.twitter.com/YufOT0rgDk