
మరో సమ్మర్ వచ్చేసింది.. మినీ క్రికెట్.. ఫటాఫట్ క్రికెట్ పండుగ వచ్చేసింది.. IPL 2025 మహా సంగ్రామానికి కౌంట్ డౌన్ మొదలైంది. 2025, మార్చి 22వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్న మ్యాచ్ తో ప్రపంచం అంతా క్రికెట్ ఫీవర్ లోకి వెళ్లిపోతుంది. ఇప్పటికే టికెట్లు అన్నీ హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. 13 నగరాల్లోని స్టేడియాలు ముస్తాబయ్యాయి. 65 రోజులు.. 74 మ్యాచ్ లు.. 13 నగరాల్లో జరిగే ఐపీఎల్ క్రికెట్ మహా సంగ్రామం పూర్తి వివరాలు.. ఫటాఫట్ తెలుసుకుందామా..
- ఈ ఐపీఎల్ లో మొత్తం 10 టీమ్స్ వారి వారి హోమ్ గ్రౌండ్స్ లో మ్యాచ్ లు ఆడనున్నాయి
- 3 టీమ్స్ మాత్రం అదనంగా సెకండ్ హోమ్ గ్రౌండ్ లో ఆడతాయి
- ఢిల్లీ క్యాపిటల్స్ కొన్ని మ్యాచ్ లు విశాఖపట్నంలో ఆడుతుంది
- పంజాబ్ కింగ్స్ సెకండ్ హోమ్ గేమ్ ధర్మశాలలో ఆడుతుంది
- రాజస్థాన్ రాయల్స్ సెకండ్ హోమ్ గేమ్ గువహతిలో ఆడనుంది.
ఫార్మాట్ ఎలా ఉంటుంది:
- మొత్తం 10 టీమ్స్ రెండు గ్రూపులుగా విభజించడం జరిగింది.
- గ్రూప్ A: CSK, KKR, RR, RCB, PBKS
- గ్రూప్ B: MI, SRH, GT, DC, LSG
- గ్రూప్ లో ఉన్న ప్రతి టీమ్ ఇతర ఒక్కో టీమ్ తో రెండేసి మ్యాచ్ లు ఆడుతుంది
- ఇతర గ్రూప్ లో ఉన్న ఒక్కో టీమ్ తో కూడా రెండు మ్యాచ్ లు ఆడుతుంది
- హోమ్ గ్రౌండ్ లో ప్రతి టీమ్ 7 మ్యాచ్ లు ఆడుతుంది
- ఇతర గ్రౌండ్ లో కూడా 7 మ్యాచ్ లు ఆడాల్సి ఉంటుంది.
మ్యాచ్ టైమింగ్స్:
- మధ్యాహ్నం మ్యాచ్ లు 3.30 గంటలకు స్టార్ట్ అవుతాయి
- సాయంత్రం మ్యాచ్ లు 7.30 కు ప్రారంభం అవుతాయి.
మారిన రూల్స్:
- బాల్ పై లాలాజలం (ఉమ్ము) రుద్దడంపై ఉన్న నిషేధాన్ని ఎత్తేశారు.
- అంటే ఇక నుంచి బాల్ పైన ఉమ్ము రుద్దవచ్చు
- స్లో ఓవర్ రేట్ కారణంగా కెప్టెన్స్ పై బ్యాన్ ఇకనుంచి ఉండదు
- కాకపోతే వారి మ్యాచ్ ఫీజు లో కోత విధిస్తారు
- స్లో ఓవర్ రేట్ పై కెప్టెన్స్ కు డీమెరిట్ పాయింట్స్ కూడా ఇస్తారు
- మూడేళ్లు ఈ పాయింట్స్ పరిగణనలో ఉంటాయి
- ఆఫ్ సైడ్, తలపైనుంచి వెళ్లే వైడ్స్ కోసం డేగకన్ను (Hawk-eye) వినియోగిస్తారు
- గతంలో నడుము పైనుంచి వెళ్లే నోబాల్స్ కోసమే వాడేవారు
5 మంది కొత్త కెప్టెన్లు:
- ఈ ఐపీఎల్ లో 5 టీమ్స్ తమ కెప్టెన్లను మార్చాయి..
- పంజాబ్ కింగ్స్ - శ్రేయస్ అయ్యర్
- కోల్ కతా నైట్ రైడర్స్ - అజింక్యా రహనే
- లక్నో సూపర్ గెయింట్స్ - రిషభ్ పంత్
- ఢిల్లీ క్యాపిటల్స్ - అక్షర్ పటేల్
- రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ - రజత్ పాటిదార్
ఫ్యాన్స్ మిస్ అవ్వనున్న ప్లేయర్లు:
- బ్యాక్ ఇంజురీ (వెన్ను నొప్పి) కారణంగా బుమ్రా కొన్ని మ్యాచ్ లకు దూరంగా ఉండనున్నాడు.
- లక్నో ప్లేయర్ మయాంక్ సగం మ్యాచ్ లకు దూరం అవుతున్నాడు
- అల్లా గజన్ఫర్, లిజాడ్ విలియమ్స్, బ్రైడన్ కెర్సే లు గాయాల కారణంగా అందుబాటులో లేరు
- హారీ బ్రూక్ సీజన్ మొత్తానికే తొలగించడ జరిగింది.