ఐపీఎల్ సీజన్ 2025 కోసం బీసీసీఐ నిబంధనలను ప్రకటించింది. వచ్చే ఏడాది జరగనున్న లీగ్ కోసం మెగా వేలానికి ముందు కీలక మార్పులు చేసింది. బీసీసీఐ, టీమ్ ఓనర్ల నుంచి అనేక సూచనలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత మెగా వేలానికి ముందు ప్రతి జట్టుకు ఆరుగురు రిటెన్షన్స్, ఒక రైట్ టు మ్యాచ్ (ఆర్‌టీఎం) ఆప్షన్‌ను ఇవ్వాలని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ శనివారం (సెప్టెంబర్ 29) నిర్ణయించింది. 2022 మెగా వేలంలో నలుగురు ప్లేయర్లను రిటైన్ చేసుకునేందుకు అనుమతించారు. ఈసారి ఆ సంఖ్య ఆరుకు పెరగడంతో పాటు ఆర్‌టీఎంను ఉపయోగించే అవకాశం కూడా కల్పించారు.
ALSO READ : IPL 2025 auction: ప్రతి జట్టుకు ఐదు రిటెన్షన్స్.. ఒక ఆర్‌టీఎం ఆప్షన్
రూ. 100 కోట్ల నుంచి 120 కోట్లకు పంపు:
బీసీసీఐ ఐపీఎల్ ఫ్రాంచైజీల పర్స్‌ను రూ. 100 కోట్ల నుండి రూ. 120 కోట్లకు పెంచింది. ఇది గత ఏడాది కంటే 20 శాతం పెంపు. మొదటి మూడు రిటెన్షన్‌ల కోసం ఫ్రాంచైజీలు రూ. 18 కోట్లు, రూ. 14 కోట్లు, రూ. 11 కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది. నాలుగో రిటెన్షన్ ప్లేయర్ కు రూ. 18 కోట్లు.. ఐదో ప్లేయర్ కు రూ. 14 కోట్లు చెల్లిచాల్సి ఉంటుంది. ఈ లెక్కన ఓ ఫ్రాంచైజీ ఐదుగురు ప్లేయర్లను రిటైన్ చేసుకుంటే ఆ జట్టు వేలం ఖాతా (రూ. 120 కోట్లు) నుంచి రూ. 75 కోట్లు మినహాయిస్తారు.
అన్‌క్యాప్డ్ ప్లేయర్ తీసుకోవాలంటే నాలుగు కోట్లు చెల్లించాలి. దీంతో ఆరుగురిని రిటైన్ చేసుకోవాలంటే రూ. 79 కోట్లు చెల్లించాలి. దీంతో మరో 15 మంది ప్లేయర్లను కొనుగోలు చేయడానికి వేలంలో సదరు ఫ్రాంచైజీకి రూ. 45 కోట్లు మాత్రమే మిగులుతాయి.
అన్‌క్యాప్డ్ ప్లేయర్ రూల్ తిరిగి తీసుకురాబడింది:
ఐపీఎల్ ఫ్రాంచైజీలు 6 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకునే అవకాశం కలిపించింది. ఈ రూల్ తో ఫ్రాంచైజీలు సంతృప్తికరంగా ఉన్నట్టు తెలుస్తుంది. వీరిలో గరిష్టంగా ఇద్దరు.. కనిష్టంగా ఒక అన్ క్యాప్డ్ ప్లేయర్ ఉండాలి. అన్‌క్యాప్డ్ ప్లేయర్‌కు రూ. 4 కోట్లు చెల్లించాలి. ధోనీ కోసం ఈ రూల్ మరోసారి తిరిగి ప్రవేశపెట్టినట్టు వార్తలు వస్తున్నాయి. మాహీని చెన్నై సూపర్ కింగ్స్ అన్‌క్యాప్డ్ ప్లేయర్ గా రిటైన్ చేసుకునే అవకాశముంది.
RTM తిరిగి తీసుకురాబడింది:
2025 మెగా వేలం కోసం రైట్ టు మ్యాచ్ ఎంపికను BCCI తిరిగి తీసుకురానుంది. ఈ ఎంపిక చివరిసారిగా 2017 మెగా వేలం కోసం ప్రవేశపెట్టబడింది. 2022 వేలం ముందు రద్దు చేయబడింది. ముంబై, సన్ రైజర్స్, కోల్ కతా ఫ్రాంచైజీలు వేలం సమయంలో తమకు 7-8 RTMలు కావాలని వాదించినట్లు నివేదికలు చెబుతున్నాయి.