లక్నోపై మ్యాచ్ లో మెరిసిన అశుతోష్ శర్మకి శిఖర్ ధావన్ వీడియో కాల్.. ఏమన్నారంటే...

లక్నోపై మ్యాచ్ లో మెరిసిన అశుతోష్ శర్మకి శిఖర్ ధావన్ వీడియో కాల్.. ఏమన్నారంటే...

సోమవారం ( మార్చి 24 ) ఐపీఎల్ లో ఉత్కంఠగా సాగిన లక్నో, ఢిల్లీ మ్యాచ్ లో అశుతోష్ శర్మ మెరుపు ఇన్నింగ్స్ ఆడి ఢిల్లీకి ఘనవిజయం అందించిన సంగతి తెలిసిందే.. ఆల్మోస్ట్ ఓటమి ఖాయం అనుకున్న సమయంలో బ్లాక్ బస్టర్ ఇన్నింగ్స్ తో ఢిల్లీకి విక్టరీని అందించిన అశుతోష్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. ఇదిలా ఉండగా.. మ్యాచ్ తర్వాత ఢిల్లీ డ్రెస్సింగ్ రూమ్ లో ఆసక్తికర సీన్ చోటు చేసుకుంది..31 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 66 సాధించి బ్లాక్ బస్టర్ ఇన్నింగ్స్ ఆడిన అశుతోష్ కి పంజాబ్ మాజీ కెప్టెన్ శిఖర్ ధావన్ వీడియో కాల్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

అశుతోష్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ని తన మెంటర్ శిఖర్ ధావన్ కి డేడికేట్ చేశాడు. ఆ తర్వాత ధావన్ అశుతోష్ కి వీడియో కాల్ చేయడం నెటిజన్స్ ని ఆకట్టుకుంది. 

ఢిల్లీ క్యాపిటల్స్ టార్గెట్ 210. ఏడు రన్స్‌‌కే మూడు వికెట్లు పడ్డాయి. ఏడు ఓవర్లు పూర్తయ్యే సరికి సగం మంది డగౌట్‌‌కు వచ్చేయడంతో ఆ జట్టు  65/5తో నిలిచింది. ఇక లక్నో సూపర్ జెయింట్స్ గెలుపు ఖాయమే అనుకుంటున్న సమయంలో డీసీ మ్యాజిక్ చేసింది. ఇంపాక్ట్‌ ప్లేయర్‌‌‌‌గా వచ్చిన యంగ్‌‌స్టర్ అశుతోష్‌‌ శర్మ (31 బాల్స్‌‌లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 66 నాటౌట్‌‌)  ఫోర్లు, సిక్సర్ల వర్షంతో ఫుల్ ఇంపాక్ట్‌‌ చూపెట్టాడు. 

Also Read:-ఉప్పల్ స్టేడియంలో తమన్ మ్యూజికల్ ఈవెంట్.. ఎప్పుడంటే?.

దాంతో ఏకపక్షం అనుకున్న ఆట.. ఆఖరి ఓవర్ వరకూ ఉత్కంఠ రేపగా..ఢిల్లీ ఒక్క వికెట్ తేడాతో లక్నోను ఓడించి ఐపీఎల్‌‌–18లో బోణీ చేసింది. సోమవారం వైజాగ్‌‌లో జరిగిన ఈ మ్యాచ్‌‌లో  తొలుత నికోలస్ పూరన్ (30 బాల్స్‌‌లో 6 ఫోర్లు, 7 సిక్సర్లతో 75), మిచెల్‌‌ మార్ష్‌‌  (36 బాల్స్‌‌లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 72) మెరుపులతో లక్నో 20 ఓవర్లలో 209/8 స్కోరు చేసింది. మిచెల్ స్టార్క్‌‌ మూడు, కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు పడగొట్టారు. 

అనంతరం ఛేజింగ్‌‌లో ఢిల్లీ 19.3 ఓవర్లలో 211/9 స్కోరు చేసి గెలిచింది. విప్రజ్ నిగమ్ (15 బాల్స్‌‌లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 39), ట్రిస్టాన్ స్టబ్స్ (34) కూడా రాణించారు. అశుతోష్‌‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.