
హైదరాబాద్, వెలుగు: రాబోయే ఐపీఎల్ సీజన్ కోసం ఉప్పల్ స్టేడియం సరికొత్తగా సిద్ధం అవుతోంది. స్టేడియంలో ఆధునీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావు తెలిపారు.
బుధవారం బీసీసీఐ, సన్ రైజర్స్ ప్రతినిధులతో కలిసి ఈ పనులను పరిశీలంచారు. స్టేడియం మొత్తానికి రంగులు వేయడంతో పాటు నార్త్ స్టాండ్స్‌లో కొత్త బాత్ రూమ్స్ నిర్మిస్తున్నామని తెలిపారు. క్రికెటర్ల డ్రెస్సింగ్ రూమ్స్, కార్పొరేట్ బాక్సుల్లో ఏసీలు, టైల్స్ మారుస్తున్నామని చెప్పారు. స్టేడియంకు కొత్త రూపు ఇచ్చేందుకు హెచ్‌సీఏ నుంచి సుమారు రూ.5 కోట్లు ఖర్చు చేస్తున్నామని ఎస్ఆర్‌హెచ్ కూడా సహకారం అందిస్తుందని తెలిపారు.