IPL 2025: గుజరాత్ vs పంజాబ్: హెడ్ టు హెడ్ రికార్డ్.. పిచ్ రిపోర్ట్ ఇదే..

IPL 2025: గుజరాత్ vs పంజాబ్: హెడ్ టు హెడ్ రికార్డ్..  పిచ్ రిపోర్ట్ ఇదే..

ఐపీఎల్ 2025లో ఇవాళ ( మార్చి 25 ) గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ 11 తలపడనున్నాయి. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఇవాళ సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభం కానుంది మ్యాచ్. ఈ సీజనలో ఇరు జట్లకు ఇదే తొలి మ్యాచ్ కావడంతో ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. 2022లో ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్ తమ డెబ్యూ సీజన్లోనే ట్రోఫీ అందుకొని అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఆ తర్వాత 2023లో రన్నరప్ గా నిలిచింది. 

పంజాబ్ కింగ్స్ 11 మాత్రం ఇప్పటిదాకా ట్రోఫీ అందుకోలేదు.. గత సీజన్లో 14 మ్యాచులలో 5 మ్యాచులు గెలుపొంది..  9వ స్థానానికి పరిమితమైన పంజాబ్ కింగ్స్ ఈ సీజన్లో అయినా మెరుగైన ప్రదర్శన ఇస్తుందా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.


గుజరాత్ టైటాన్స్ vs పంజాబ్ కింగ్స్ హెడ్ టు హెడ్ రికార్డ్:

ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్‌ టీమ్స్ ఐదుసార్లు హెడ్ టు హెడ్ తలపడ్డాయి. ఈ క్రమంలో గుజరాత్ మూడు విజయాలతో మెరుగైన రికార్డును కలిగి ఉండగా.. పంజాబ్ రెండు సార్లు మాత్రమే విజయం సాధించింది.

పిచ్ రిపోర్ట్ ఇదే:

నరేంద్ర మోడీ స్టేడియంలోని పిచ్ బ్యాట్స్‌మెన్ పారడైస్ గా ప్రసిద్ధి చెందింది... 5 లేయర్స్ సాయిల్ తో ఉన్న ఈ పిచ్ బౌన్సీగా ఉంటుంది కాబట్టి.. బ్యాట్స్ మెన్ ఏ డైరెక్షన్లో అయినా ఆడేందుకు ఈజీగా ఉంటుంది. అయితే.. ఈ పిచ్ స్పిన్నర్లను బాగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. 

మార్చి 25న అహ్మదాబాద్‌లో వాతావరణం సాధారణంగానే ఉంది. ఉష్ణోగ్రతలు పగటిపూట 39 డిగ్రీలుగా..  రాత్రిపూట 23 డిగ్రీలుగా ఉంటుంది. గంటకు 8 కి.మీ కంటే ఎక్కువ వేగంతో గాలులు వీస్తాయని... హ్యూమిడిటీ లెవెల్స్ 23 శాతం నుండి 32 శాతం వరకు ఉంటాయని తెలుస్తోంది.

మొత్తానికి నరేంద్ర మోడీ స్టేడియం బ్యాట్స్ మెన్ కి అనుకూలంగా ఉంటుంది కాబట్టి మొదట బ్యాటింగ్ చేసిన జట్టు భారీ టార్గెట్ సెట్ చేస్తే విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని చెప్పచ్చు.