ఐపీఎల్ రిటెన్షన్ లిస్టుపై ఉత్కంఠ వీడిన విషయం విదితమే. ఫ్రాంఛైజీలు కోట్లు కురిపించి కొందరిని రిటైన్ చేసుకోగా.. మరికొందరిని వేలంలోకి వదిలేశాయి. దాంతో, వేలంలోకి వచ్చే ఆటగాళ్లు ఎవరు? ఫ్రాంఛైజీలు అంటిపెట్టుకున్న ఆటగాళ్లు ఎవరు? అనే సందిగ్ధత తొలగిపోయింది. ఈ నేపథ్యంలో రాబోవు ఐపీఎల్ ఎడిషన్ కోసం మెగా వేలం నిర్వహించేందుకు బీసీసీఐ సమాయత్తమవుతోంది.
ఐపీఎల్ 2025 ఎడిషన్ మెగా వేలం సౌదీ అరేబియా రాజధాని రియాద్ నగరంలో జరగనున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. నవంబర్ 24, 25 తేదీలలో వేలం జరగనుందని సమాచారం. వేలం కోసం పలు నగరాల పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ, బీసీసీఐ ఎడారి నగరం మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.
ఆ ముగ్గురిపైనే అందరి కళ్లు
డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్.. శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్)ను వదులుకోగా, ఢిల్లీ.. రిషభ్ పంత్(కెప్టెన్), లఖ్‌నవూ.. కేఎల్ రాహుల్( కెప్టెన్)ను వేలంలోకి వదిలేసింది. ప్రస్తుతానికి ఈ ముగ్గురిపైనే భారీ హైప్ ఉంది. వీరి కోసం ఫ్రాంచైజీలు భారీ మొత్తాలను వెచ్చించే అవకాశం లేకపోలేదు. ఈ ముగ్గురితోపాటు యువ బ్యాటర్ ఇషాన్ కిషన్, ఆల్ రౌండర్ వెంకటేశ్ అయ్యర్, పేసర్లు అర్ష్‌దీప్ సింగ్, దీపక్ చాహర్, మహమ్మద్ సిరాజ్ లు సైతం భారీ ధర పలకవచ్చని అంచనా వేస్తున్నారు. విదేశీ ఆటగాళ్లలో డుప్లెసీస్(ఆర్‌సీబీ కెప్టెన్ ), మిచెల్ స్టార్క్, జోస్ బట్లర్, మొయిన్ అలీ, శాంట్నర్, గ్రీన్, జాక్స్, మ్యాక్స్‌వెల్, కాన్వే, రచిన్ రవీంద్రలు అధిక ధర పలికే చాన్స్ ఉంది.
ALSO READ : India A vs Australia A: ఆస్ట్రేలియా ఏ జట్టుతో మ్యాచ్.. భారత ఎ స్క్వాడ్ లో రాహుల్
రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితా
చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్, మతీషా పతిరనా, శివమ్ దూబే, రవీంద్ర జడేజా , ఎంఎస్ ధోని.
ఢిల్లీ క్యాపిటల్స్: అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ , ట్రిస్టన్ స్టబ్స్, అభిషేక్ పోరెల్.
గుజరాత్ టైటాన్స్: రషీద్ ఖాన్, శుభమాన్ గిల్ , సాయి సుదర్శన్, రాహుల్ తెవాటియా, షారుక్ ఖాన్.
కోల్‌కతా నైట్ రైడర్స్: రింకు సింగ్, వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ , ఆండ్రీ రస్సెల్, హర్షిత్ రాణా, రమణదీప్ సింగ్.
లక్నో సూపర్ జెయింట్స్: నికోలస్ పూరన్, రవి బిష్ణోయ్, మయాంక్ యాదవ్, మొహ్సిన్ ఖాన్, ఆయుష్ బదోని.
ముంబై ఇండియన్స్: జస్ప్రీత్ బుమ్రా , సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా , రోహిత్ శర్మ , తిలక్ వర్మ.
పంజాబ్ కింగ్స్: శశాంక్ సింగ్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్.
రాజస్థాన్ రాయల్స్: సంజు శాంసన్, యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్, ధృవ్ జురెల్, షిమ్రోన్ హెట్మెయర్ , సందీప్ శర్మ.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లీ, రజత్ పటీదార్, యశ్ దయాల్.
సన్‌రైజర్స్ హైదరాబాద్: పాట్ కమిన్స్ , అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, ట్రావిస్ హెడ్.