
ముకేష్ అంబానీ కోట్లు సంపాదించారన్నది మాత్రమే మనం మాట్లాడుకుంటాం. మరి ఆ స్థాయికి చేరుకున్నారంటే.. దాని వెనుక ఎందరి శ్రమ దాగుంది..? అయన పడ్డ కష్టాలేంటి..? ఉపాయాలేంటి..? అన్నది ఆలోచించం. ఈ ఒక్క ఉదాహరణను చూస్తే.. వారి కుటుంబసభ్యుల ఆలోచనలు ఎలా ఉన్నాయో అద్దం పడుతోంది. రూ. 4.8 కోట్ల విలువైన ఒక ఆటగాడు జట్టుకు దూరమైతే.. అతని స్థానాన్ని రూ. 2 కోట్ల ధరతో భర్తీ చేసింది. అందునా, దూరమైనా ఆటగాడితో పోలిస్తే.. ఇప్పుడు జట్టులో చేరిన ఆటగాడు మరింత ప్రమాదకారి.
గాయం కారణంగా ఐపీఎల్(2025) నుంచి వైదొలిగిన అల్లా గజన్‌ఫర్ స్థానంలో ముంబై యాజమాన్యం.. ఆఫ్ఘన్ స్పిన్నర్ ముజీబ్ ఉర్ రెహమాన్‌ను జట్టులోకి తీసుకుంది. ఈ విషయాన్ని ఐపీఎల్ అధికారిక వర్గాలు ధృవీకరించాయి.
అల్లా గజన్‌ఫర్ దూరమవ్వడం ముంబై జట్టుకు భారీ దెబ్బే. 'పిట్ట కొంచెం కూత ఘనం' అన్నట్లు 18 ఏళ్ల వయస్సుకే ఈ మిస్టరీ స్పిన్నర్ అగ్రశ్రేణి బ్యాటర్లకు చెమటలు పుట్టించాడు. ఆ నైపుణ్యాన్ని గుర్తించే ముంబై యాజమాన్యం.. అతన్ని వేలంలో రూ. 4.8 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. కానీ వెన్ను పూసలో పగుళ్ల కారణంగా అతను టోర్నమెంట్ నుంచి వైదొలిగాడు. దూరమైన అల్లా గజన్‌ఫర్, అతని స్థానాన్ని భర్తీ చేసిన ముజీబ్ ఇద్దరూ.. ఆఫ్ఘన్ స్పిన్నర్లే.
చిన్న వయసులోనే ఆఫ్ఘనిస్తాన్ తరపున అరంగేట్రం చేసిన ముజీబ్.. ప్రపంచవ్యాప్తంగా టోర్నీల్లో ఆడి ఎంతో అనుభవం గడించాడు. అంతర్జాతీయ లీగ్‌ల్లో 300 కంటే ఎక్కువ టీ20లు ఆడాడు. 6.5 ఎకానమీ రేటుతో దాదాపు 330 వికెట్లు పడగొట్టాడు. ఇక ఐపీఎల్ విషయానికొస్తే..19 మ్యాచ్‌ల్లో 19 వికెట్లు పడగొట్టాడు.
📰 𝗠𝘂𝗺𝗯𝗮𝗶 𝗜𝗻𝗱𝗶𝗮𝗻𝘀 𝘀𝗶𝗴𝗻 𝗠𝘂𝗷𝗲𝗲𝗯 𝗨𝗿 𝗥𝗮𝗵𝗺𝗮𝗻 🇦🇫
— Mumbai Indians (@mipaltan) February 16, 2025
Mujeeb Ur Rahman, the Afghan off spinner has been signed by Mumbai Indians as a replacement for Allah Ghazanfar who has been ruled out of IPL 2025 due to an injury.
Mujeeb was one of the youngest ever… pic.twitter.com/urNJhbfVl7
బౌలింగ్ లైనప్ దుర్భేద్యం
ముజీబ్ రాకతో ముంబై బౌలింగ్ లైనప్ మరింత పటిష్టంగా తయారైంది. ట్రెంట్ బోల్ట్, బుమ్రా, ముజీబ్ ముగ్గురూ ముగ్గురే. వీరిని ఎదుర్కొని పవర్ ప్లేలో పరుగులు రాబట్టడం ప్రత్యర్థి జట్లకు సవాలే. మిడిల్ ఆర్డర్ లో హార్దిక్, శ్రేయాస్ గోపాల్, నమన్ ధీర్, అన్షుల్ కాంబోజ్ ఉండనే ఉన్నారు. చివరలో నాలుగు ఓవర్లు మళ్లీ బోల్ట్, బుమ్రా కట్టడి చేస్తారు.
ఐపీఎల్ 2025కు ముంబై స్క్వాడ్
రిటైన్ లిస్ట్:
- జస్‌ప్రీత్ బుమ్రా: రూ. 18 కోట్లు
- సూర్యకుమార్ యాదవ్: రూ. 16.35 కోట్లు
- హార్దిక్ పాండ్యా: రూ. 16.35 కోట్లు
- రోహిత్ శర్మ: రూ. 16.30 కోట్లు
- తిలక్ వర్మ: రూ.18 కోట్లు
వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు
- డెవాల్డ్ బ్రెవిస్
- ఇషాన్ కిషన్
- హర్విక్ దేశాయ్
- టిమ్ డేవిడ్
- విష్ణు వినోద్
- అర్జున్ టెండూల్కర్
- మొహమ్మద్ నబీ
- రొమారియో షెపర్డ్
- షమ్స్ ములాని
- నేహాల్ వధేరా
- జెరాల్డ్ కోట్జీ
- అన్షుల్ కాంబోజ్
- నమన్ ధీర్
- శివాలిక్ శర్మ
- క్వేనా మఫాకా
- కుమార్ కార్తికేయ
- పియూష్ చావ్లా
- ఆకాష్ మధ్వాల్
- ల్యూక్ వుడ్
- దిల్షాన్ మధుశంక
- శ్రేయాస్ గోపాల్
- నువాన్ తుషార
- ముజీబ్ ఉర్ రెహమాన్(అల్లా గజన్‌ఫర్)