CSK ఫ్యాన్స్ దెబ్బకు చెవులు మూసుకున్న MI ఓనర్ నీతా అంబానీ !

CSK ఫ్యాన్స్ దెబ్బకు చెవులు మూసుకున్న MI ఓనర్ నీతా అంబానీ !

ధోనీ స్టేడియంలో అడుగుపెడితే అభిమానుల హర్షధ్వానాలకు ప్రత్యర్థులు కూడా చెవులుమూసుకోవాల్సిందేనని చెన్నై, ముంబై మధ్య జరిగిన మ్యాచ్ నిరూపించింది. ముంబై ఇండియన్స్ ఓనర్ నీతూ అంబానీకి అలాంటి అనుభవమే ఎదురైంది. అసలే.. ధోనీ ఫ్యాన్స్. పైగా చెన్నైలో మ్యాచ్. ఇక.. చెన్నై సూపర్ కింగ్స్ అభిమానుల సందడి ఎలా ఉంటుందో చెప్పేదేముంది. ధోనీ బ్యాటింగ్ కు వెళ్లేందుకు స్టేడియంలో అడుగుపెట్టిన సందర్భంలో CSK అభిమానుల అరుపులు, కేకలు, కేరింతల దెబ్బకు నీతూ అంబానీ చెవులు మూసుకోక తప్పలేదు.

చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు తమ అభిమాన క్రికెటర్ ధోనీకి ఆ రేంజ్లో ఎలివేషన్ ఇచ్చారు మరి. ఆ వీడియోను చెన్నై అభిమాని ఒకరు ‘ఎక్స్’లో పోస్ట్ చేస్తే 24 గంటలు గడవక ముందే 1 మిలియన్ వ్యూస్ దాటిపోయాయి. క్రికెట్ అభిమానుల్లో ధోనీకి ఉన్న క్రేజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఆటుపోట్లను చవిచూసి క్రికెట్లో ఉన్నత స్థాయికి ఎదిగిన ధోనీకి ఉన్న ఫ్యాన్ బేస్ అంతాఇంతా కాదు. ఇక.. ఐపీఎల్ ఫ్యాన్స్ గుండెల్లో, మరీ ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ గుండెల్లో ధోనీ స్థానం వేరు.

ALSO READ | DC vs LSG: పూరన్, మార్ష్ విధ్వంసం.. ఢిల్లీ ముందు బిగ్ టార్గెట్

ఐపీఎల్‌‌‌‌లో రెండు మేటి జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌‌‌‌లో చెన్నై సూపర్‌‌‌‌కింగ్స్‌‌‌‌ పైచేయి సాధించిన సంగతి తెలిసిందే. ఛేజింగ్‌‌‌‌లో రచిన్‌‌‌‌ రవీంద్ర (45 బాల్స్‌‌‌‌లో 2 ఫోర్లు, 4 సిక్స్‌‌‌‌లతో 65 నాటౌట్‌‌‌‌), రుతురాజ్‌‌‌‌ గైక్వాడ్‌‌‌‌ (26 బాల్స్‌‌‌‌లో 6 ఫోర్లు, 3 సిక్స్‌‌‌‌లతో 53) రాణించడంతో.. ఆదివారం జరిగిన మ్యాచ్‌‌‌‌లో చెన్నై 4 వికెట్ల తేడాతో ముంబైని ఓడించింది. టాస్‌‌‌‌ ఓడిన ముంబై 20 ఓవర్లలో 155/9 స్కోరు చేసింది. తిలక్‌‌‌‌ వర్మ (31) టాప్‌‌‌‌ స్కోరర్‌‌‌‌. తర్వాత చెన్నై 19.1 ఓవర్లలో 158/6 స్కోరు చేసింది. నూర్​అహ్మద్కు ‘ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌’ అవార్డు లభించింది.