IPL 2025: నో బాల్, వైడ్ బాల్ నిర్ణయం మరింత పక్కాగా.. ఇక నుంచి కొత్త టెక్నాలజీ.. కొత్త రూల్స్

IPL 2025: నో బాల్, వైడ్ బాల్ నిర్ణయం మరింత పక్కాగా.. ఇక నుంచి కొత్త టెక్నాలజీ.. కొత్త రూల్స్

ఐపీఎల్ అంటేనే కొత్త కొత్త ప్రయోగాలకు, మార్పులకు, రూల్స్ కు వేదిక. ప్రతి సీజన్ లో ఏదో ఒక నిబంధనను తీసుకురావడం చూస్తూనే ఉన్నాం. క్రికెట్ మరింత ఈజీగా ఉండేందుకు టెక్నాలజీని వినియోగించుకుని మార్పులు చేస్తూ వస్తోంది బీసీసీఐ. తాజాగా IPL 2025 లో భాగంగా నోబాల్స్ కు సంబంధించి కొత్త రూల్స్, కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చింది బీసీసీఐ.

ఈ ఐపీఎల్ లో నోబాల్, వైడ్ బాల్ నిర్ణయం 100 శాతం పక్కాగా ఉండేందుకు.. షార్ట్ డెలివరీస్ ను అంచనా వేసేందుకు వినూత్నమైన పద్ధతిని తీసుకొచ్చింది బీసీసీఐ. ప్రస్తుతం ఫాస్ట్ బౌలర్స్ కు రెండు బౌన్సర్స్ వేసుకునే చాన్స్ ఉంది. మూడో బౌన్సర్ ను వైడ్ గా కన్సిడర్ చేస్తారు. అయితే బ్యాటర్ తలపై నుంచి వెళ్లే బాల్ ను వైడ్ బాల్ గా డిసైడ్ చేస్తారు. ఇవి ఇప్పటివరకు ఉన్న నియమాలే.

ALSO READ | IPL మహా సంగ్రామానికి కౌంట్ డౌన్ : 74 మ్యాచ్ లు.. 65 రోజులు.. 13 నగరాలు..

నడుము పైనుంచి వెళ్లే ఫుల్ టాస్ బాల్ ను కొలిచేందుకు.. కచ్చితత్వం కోసం ప్రతి ప్లేయర్ నడుమును టేప్ తో కొలిచేలా IPL2024 లో నిబంధనలు తెచ్చింది బీసీసీఐ. అయితే ఈ సారి నడుముతో పాటు భుజం (షోల్డర్), తల (హెడ్) ను కొలిచేలా కొత్త నిబంధన తీసుకొచ్చింది. 

బ్యాటర్ క్రీజ్ లో బాల్ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నపుడు అతడి నడుము, భుజం, తల ఎంత ఎత్తు ఉంటుందో దాన్ని కన్సిడర్ చేస్తారు. ఈ కొలతలను సిస్టమ్ లోకి ఎంట్రీ చేస్తారు. థర్డ్ అంపైర్ల దగ్గర కూర్చునే హాక్ ఐ (పై నుంచి చూసే కెమెరా - డేగ కన్ను) ఆపరేటర్లకు నడుంపై నుంచి వెళ్లే ఫుల్ టాస్ వైడ్లకు, నోబాల్ వైడ్ బాల్ కు సంబంధించిన బౌన్సర్ లను రివ్యూ చేసేందుకు ఇది చాలా ఉపయోగపడుతుంది. 

ఈ సారి 7 మంది కొత్త అంపైర్లు:

హై ప్రెజర్ మ్యాచ్ ల కోసం ఈసారి 7 మంది కొత్త అంపైర్లను ప్రవేశపెడుతోంది బీసీసీఐ. అందులో స్వరూపానంద్ కన్నూర్, అభిజీత్ భట్టాచార్య, పారాశర్ జోషి, అనిశ్ సహస్రబుద్ధే, కేయూర్ కేల్కర్, కౌశిక్ గాంధీ, అభిజీత్ బెనర్జీ. అయితీ సీనియర్ అంపైర్లైన ఎస్.రవి, సీకే నందన్ ఈ కొత్త అంపైర్లకు మెంటర్స్ గా వ్యవహరిస్తున్నారు.