
ఇప్పుడు దేశమంతా ఐపీఎల్ ఫీవర్ పట్టుకుంది. ఇంకా కొన్ని గంటలే.. అంటూ లెక్కలేసుకుంటూ ఎదురుచూస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్. శనివారం (మార్చి 22) ఐపీఎల్ ప్రారంభం అవుతుండటంతో.. భారీ అంచనాలతో వెయిటింగ్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఎప్పటిలాగే ఐపీఎల్ ఓపెనింగ్ సెర్మనీ గ్రాండ్ గా లాంచ్ చేసేందుకు బీసీసీఐ రంగం సిద్ధం చేసింది.
18వ ఐపీఎల్ ఎడిషన్.. IPL-2025 మార్చి 22న గ్రాండ్ గా ఓపెన్ అవ్వనుంది. గత ఏడాది కంటే మరింత గ్రాండ్ గా ఈసారి ఓపెనింగ్ సెర్మనీ ప్లాన్ చేశారు. బాలీవుడ్ సెలబ్రిటీలు, మ్యూజిక్ ఆర్టిస్ట్ లతో ఐపీఎల్ వేదిక అలరించనుంది. దిశా పఠానీ, శ్రేయా ఘోషల్, కరణ్ ఔజుల, అర్జున్ సింగ్, అరుణ్ ధవన్, శ్రద్ధా కపూర్ మొదలైన స్టార్స్ పర్ఫామెన్స్ తో ఫ్యాన్స్ కు కిక్కిచ్చేందుకు సిద్ధమైంది. ఈ సెర్మనీకి సబంధించి ఈవెంట్స్, టైమ్ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
When it’s 18 years of IPL, it calls for a dazzling celebration like never before! 🥳
— IndianPremierLeague (@IPL) March 19, 2025
Who better than the sensational Disha Patani to set the stage ablaze? 💃
Don’t miss the electrifying Opening Ceremony of the #TATAIPL 18! 🤩 @DishPatani pic.twitter.com/3TeHjOdz67
ఎక్కడ, ఎప్పుడు..?
- మార్చి 22న (శనివారం) సాయంత్రం 6 గంటలకు ఓపెనింగ్ సెర్మనీ
- కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో గ్రాండ్ ఓపెనింగ్
Brace yourself for a symphony of magic like never before as the soulful Shreya Ghoshal takes the stage at the #TATAIPL 18 Opening Ceremony! 😍
— IndianPremierLeague (@IPL) March 19, 2025
Celebrate 18 glorious years with a voice that has revolutionised melody🎶@shreyaghoshal pic.twitter.com/mJB9T5EdEe
ఐపీఎల్ ఓపెనింగ్ సెర్మనీ ఎక్కడ చూడవచ్చు:
- స్టేడియం కు వెళ్లలేని వాళ్లకు ఈ కింది ఛానల్స్ లో లైవ్ చూడవచ్చు
- స్టార్ స్పోర్ట్స్ లోని దాదాపు అన్ని చానల్స్ లో లైవ్ స్ట్రీమింగ్ ఇస్తున్నారు.
- అవి: Star Sports 1, Star Sports 1 HD, Star Sports 1 Hindi, Star Sports 1 Hindi HD, Star Sports 2, Star Sports 2 HD, Star Sports 2 Hindi, Star Sports 2 Hindi HD, Star Sports Khel, and Star Sports 3
- జియో సినిమా జియో హాట్ స్టార్: JioCinema, JioHotstar లలో లైవ్ స్ట్రీమింగ్ ఉంటుంది.
టికెట్స్ డీటెయిల్స్:
Get ready for the ultimate vibe check! 😎
— IndianPremierLeague (@IPL) March 19, 2025
Global Superstar Karan Aujla, is all set to light up the #TATAIPL 18 Opening Ceremony, bringing the fire and setting new trends like never before! 🔥@GeetanDiMachine pic.twitter.com/zRyGCRl8be
- IPL 2025 ఓపెనింగ్ సెర్మనీకి టికెట్లు రూ.3 వేల నుంచి 30 వేల రూపాయల మధ్య ఉన్నాయి.
- సీటింగ్ పొజిషన్ ను బట్టీ రేట్లు మారతాయి
- BookMyShow, Paytm Insider, TicketGenie మొదలైన వెబ్ సైట్లలో బుక్ చేసుకోవచ్చు