
ఐపీఎల్ 2025 లో రివెంజ్ వీక్ ఏదైనా ఉందంటే అది లాస్ట్ వీకే అని చెప్పాలి. క్రికెట్ ఫ్యాన్స్ కు బ్లాక్ బస్టర్ కిక్కిచ్చిన వారంగా చెప్పుకోవచ్చు. ఆదివారం (ఏప్రిల్ 27) వాంఖడే స్టేడియంలో లక్నో సూపర్ గెయింట్స్ ను 54 రన్స్ తేడాతో చిత్తు చేసి ముంబై ఇండియన్స్ ప్రతీకారం తీర్చుకుంది. వరుసగా 5 విజయాలతో సూపర్ ఫామ్ తో టాప్ లోకి వచ్చింది ముంబై.
ఆ తర్వాత బెంగళూరు అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ ను 6 వికెట్ల తేడాతో ఓడించి పాయింట్స్ టేబుల్ లో టాప్ లోకి దూసుకెళ్లింది. ఈ రెండు మ్యాచ్ ల తర్వాత ప్లేఆఫ్స్ అవకాశాలు పూర్తిగా మారిపోయాయనే చెప్పవచ్చు. ఇప్పటి వరకు ఆశలు సజీవంగా ఉన్నాయి అనుకున్న టీమ్స్ పరిస్థితేంటి.. ప్లే ఆఫ్స్ ఏ టీమ్ కు ఎంత ఛాన్స్ ఉంది.. రేసులో నిలచేదెవరో తప్పుకునేదెవరో పాయింట్స్ టేబుల్ ఆర్డర్ ప్రకారంగా చూద్దాం.
1. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB):
ఢిల్లీపై గెలుపుతో RCB పాయింట్స్ టేబుల్ లో టాప్ లోకి ఎగబాకింది. 10 మ్యాచ్ లు ఆడిన బెంగళూరు 7 గెలిచి 14 పాయింట్లతో టాప్ లో ఉంది. ఇంకా నాలుగు మ్యాచ్ లలో రెండు గెలిస్తే ప్లే ఆఫ్ కు క్వాలిఫై అవుతుంది.
2. గుజరాత్ టైటాన్స్ (GT):
గుజరాత్ 8 మ్యాచ్ లు ఆడగా 12 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ప్లే ఆఫ్ స్పాట్ కు వెళ్లాంటే మిగిలిన మ్యా్చ్ లలో కేవలం 3 గెలిస్తే చాలు. నాలుగు గెలిస్తే ఇక ప్లేఆఫ్ సీటు పక్కా.
3. ముంబై ఇండియన్స్ (MI):
సీజన్ ను ఓటములతో ప్రారంభించిన ముంబై.. ఎప్పట్లాగే మధ్యలో పుంజుకొని రేస్ లోకి దూసుకొచ్చింది. వరుసగా ఐదు మ్యాచ్ లు గెలిచి థర్డ్ ప్లేస్ లోకి చేరుకుంది. 10 మ్యాచ్ లు ఆడిన ముంబై 12 పాయింట్లతో మూడవ స్థానంలో ఉంది. ప్లేఆఫ్ కు చేరుకోవాలంటే నాలుగు గేమ్స్ లో మూడు గెలవాల్సి ఉంది .రెండు గెలిచిన ఆశలు సజీవంగా ఉంటాయి.
4. ఢిల్లీ క్యాపిటల్స్ (DC):
ఈ సీజన్ లో అన్ని విభాగాల్లో స్ట్రాంగ్ పర్ఫామెన్స్ చూపిస్తూ వస్తున్న ఢిల్లీ 9 మ్యాచుల్లో 12 పాయింట్లు సంపాదించి 4వ స్థానంలో ఉంది. అయితే 5 మ్యాచ్ లలో 4 తప్పకుండా గెలిస్తే ఈజీగా ప్లేఆఫ్ కు చేరుకుంటుంది. 3 గెలిచిన కూడా ఢిల్లీకి ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉంటాయి.
5. పంజాబ్ కింగ్స్ (PBKS):
పంజాబ్ ఆడిన 9 మ్యాచ్ లలో 5 గెలుపులు, ఒక డ్రా తో 5వ స్థానంలో ఉన్న పంజాబ్.. ప్లే ఆఫ్ బెర్త్ కన్ఫామ్ చేసుకోవాలంటే 4 గెలవాల్సి ఉంది. 3 గెలిచినా అవకాశాలు PBKS ఉంటాయి.
6. లక్నో సూపర్ గెయింట్స్ (LSG):
LSG 10 పాయింట్లతో 6వ స్థానంలో ఉంది. ప్లే ఆఫ్ అవకాశాలు ఉండాలంటే ఉన్న నాలుగు మ్యాచ్ లలో 3 గెలవాల్సి ఉంది.
7. కోల్ కతా నైట్ రైడర్స్ (KKR):
డిఫెండింగ్ ఛాంపియన్ KKR ఈ సీజన్ లో టఫ్ టైమ్ ఎదుర్కొంటోంది. 9 మ్యాచ్ లు ఆడగా కేవలం 3 మ్యాచ్ లే గెలిచింది. ప్లే ఆఫ్ కు చేరుకోవాలంటే మిగిలి ఉన్న 5 మ్యాచ్ లూ తప్పనిసరిగా గెలవాలి.
8. సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH):
కేకేఆర్ లాగే హైదరాబాద్ పరిస్థితి కూడా సేమ్. 9 మ్యాచ్ లలో మూడింటిలోనే గెలిచి టఫ్ టైమ్ తెచ్చుకుంది. సీజన్ ఆరంభంలో భారీ స్కోర్ చేసి ఈసారి హైదరాబాద్ ను ఎదుర్కోవడం ఎవరికైనా కష్టం అన్నట్లుగా ఉన్న జట్టు తర్వాత చతికిల పడింది. ఇప్పుడు ప్లేఆఫ్ కూడా చేరుకుంటుందో లేదోననే పరిస్థితికి చేరిపోయింది. రేస్ లో ఉండాలంటే మిగతా 5 మ్యాచ్ లు తప్పకుండా గెలవాల్సిన పరిస్థితి హైదరాబాద్ ది.
9. రాజస్థాన్ రాయల్స్(RR):
ఆడిన 9 మ్యాచ్ లలో 7 మ్యాచ్ లు ఓడిపోయి రాజస్థాన్ ప్లే ఆఫ్స్ అవకాశాలు ఆల్మోస్ట్ కోల్పోయిందనే చెప్పాలి. అయితే మిగిలి ఉన్న 5 మ్యాచ్ లలో అన్నీ గెలిస్తే.. ఏదో కొంత ఆశ మిగిలి ఉండవచ్చు. అలాగనీ బెర్త్ అవకాశం వస్తుందని చెప్పలేం. పైన ఉన్న టీమ్ ల ఫలితాలు అటు ఇటు అయితే ఏదో లక్కులో లక్కు అన్నట్లు ఉంది పరిస్థితి. అది కూడా అన్ని మ్యాచ్ లు గెలిస్తేనే.
10. చెన్నై సూపర్ కింగ్స్ (CSK):
ఐపీఎల్ లో 5 సార్లు ట్రోఫీ విన్నర్ చెన్నై పరిస్థితి ఈ సారి చాలా దారుణంగా ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజస్థాన్ రాయల్స్ కు ఉన్న కనీస అవకాశం కూడా లేదు. మిగిలి ఉన్న ఐదు మ్యాచ్ లు తప్పకుండా గెలవాలి. అదికూడా భారీ స్కోర్ తేడాతో.. హై రన్ రేట్ వచ్చేలా ఉండాలి. వేరే టీమ్స్ ఫలితాలు తారుమారు అయితే తప్ప చెన్నై కి ఛాన్స్ ఉంటుందని చెప్పలేం.
►ALSO READ | ఇండియన్ ఆర్మీని యూజ్లెస్ అని కామెంట్ చేసిన షాహిద్ అఫ్రీదీ.. ఇంకా ఎన్నెన్ని మాటలన్నాడో తెలిస్తే రక్తం మరిగిపోతుంది..!