ఐపీఎల్ ఫ్రాంఛైజీ రాజస్థాన్ రాయల్స్ 'మిషన్ ఐపీఎల్ 2025' పనులు మొదలు పెట్టేసింది. టోర్నీ ప్రారంభానికి ఇంకా రెండు నెలల సమయం ఉండగానే.. కొత్త జెర్సీని ఆవిష్కరించింది.
రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంఛైజీ బుధవారం (జనవరి 29) వారి IPL 2025 జెర్సీని విడుదల చేసింది. కొత్త జెర్సీని దిగ్గజ క్రికెటర్లు రాహుల్ ద్రవిడ్, కుమార సంగర్కర ఆవిష్కరించారు. రాజస్థాన్‌లోని చిత్తోర్‌ఘర్‌లోని విజయ్ స్తంభ్ స్మారక చిహ్నం ప్రేరణగా దీన్ని రూపొందించారట. అలా అని కొత్త జెర్సీలో.. కొత్తదనం ఏమీ కనిపించడం లేదు. అదే పింక్.. కాకపోతే, కొత్తది కనుక ధగధగ మెరుస్తూ ఉంది.
Royals fam, your Pink of 2025 is in safe hands 🤝🏻💗 pic.twitter.com/5wyQCFJX9E
— Rajasthan Royals (@rajasthanroyals) January 29, 2025
ఫ్రాంచైజీ జెర్సీని, కిట్‌ను వారి వెబ్‌సైట్‌లో అమ్మకానికి పెట్టింది. కావలసి వారు కొనుగోలు చేయవచ్చు.
Designed in Rajasthan, For Rajasthan. The Pink of 2025 is here. 🔥💗 pic.twitter.com/1yADw3zcqY
— Rajasthan Royals (@rajasthanroyals) January 29, 2025
ఐపీఎల్ టోర్నీ మార్చి 21న ప్రారంభం కానుంది. ఫైనల్ మ్యాచ్ మే 25న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతుంది.
రాజస్థాన్ రాయల్స్ స్క్వాడ్:
రిటైన్ ప్లేయర్స్: సంజు శాంసన్(కెప్టెన్), యశస్వి జైస్వాల్, ధృవ్ జురెల్, రియాన్ పరాగ్, షిమ్రోన్ హెట్మెయర్, సందీప్ శర్మ.
వేలంలో కొనుగోలు చేసిన వారు: జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, వనిందు హసరంగా, తుషార్ దేశ్‌పాండే, ఫజల్‌హాక్ ఫరూఖీ, ఆకాష్ మధ్వల్, కుమార్ కార్తికేయ, నితీష్ రాణా, శుభమ్ దూబే, యుధ్వీర్ సింగ్, వైభవ్ సూర్యవంశీ, క్వేనా మఫాకా, కునాల్ రాథోడ్, అశోక్ శర్మ.