IPL 2025: లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్‌గా రిషబ్ పంత్ 

ఐపీఎల్ ప్రాంఛైజీ లక్నో సూపర్ జెయింట్స్ (LSG) తదుపరి కెప్టెన్‌గా భారత బ్యాటర్/ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఎంపికయ్యాడు. మెగా వేలంలో రూ.27 కోట్ల భారీ ధరకు పంత్ ను సొంతం చేసుకున్న లక్నో యాజమాన్యం.. అతనికే నాయకత్వ బాధ్యతలు అప్పగించింది.

లీగ్ చరిత్రలో అత్యధిక ధర..

రూ. 2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన పంత్.. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ లీగ్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. 3.. 4.. 5.. 6.. ఇలా తన రేటు ఒక్కో కోటి పెంచుకుంటూ ఏకంగా రూ. 27 కోట్లధర పలికాడు. దాంతో, పంత్‌కే కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం మొదటి నుంచి నడుస్తోంది. కాకపోతే రిటైన్ చేసుకున్న పూరన్, సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ ఐడెన్ మర్‌క్రమ్‌ ఇద్దరూ జట్టులో ఉండటంతో కెప్టెన్సీ ఎవరకి అప్పగిస్తారనే చర్చ జోరుగా నడిచింది. చివరకు స్వదేశీయుడిపైనే సంజీవ్ గోయెంకా టీమ్ నమ్మకముంచింది.

ALSO READ : రోహిత్‌‌‌‌ ఓకే.. కోహ్లీ నో..రంజీ మ్యాచ్ బరిలో హిట్‌‌‌‌మ్యాన్‌‌‌‌ 

2016లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన పంత్‌కి ఇది రెండో ఫ్రాంచైజీ. గతంలో పంత్.. ఢిల్లీ క్యాపిటల్స్‌ (DC) కెప్టెన్‌గా పని చేశాడు. ఇప్పటివరకూ ఐపీఎల్ కెరీర్‌లో 111 మ్యాచులు ఆడిన పంత్.. 3,284 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, 18 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

లక్నో సూపర్ జెయింట్స్ జట్టు

బ్యాటర్స్: ఐడెన్ మార్క్రామ్, డేవిడ్ మిల్లర్, ఆయుష్ బడోని (రిటైన్), హిమ్మత్ సింగ్, మాథ్యూ బ్రీట్జ్కే.

వికెట్ కీపర్లు: రిషబ్ పంత్, నికోలస్ పూరన్ (రిటైన్), ఆర్యన్ జుయల్.

ఆల్ రౌండర్లు: అబ్దుల్ సమద్ (స్పిన్), మిచెల్ మార్ష్ (పేస్), షాబాజ్ అహ్మద్ (స్పిన్), యువరాజ్ చౌదరి (స్పిన్), రాజవర్ధన్ హంగర్గేకర్ (పేస్), అర్షిన్ కులకర్ణి (పేస్).

స్పిన్నర్లు: రవి బిష్ణోయ్ (రిటైన్), ఎం సిద్ధార్థ్, దిగ్వేష్ సింగ్.

ఫాస్ట్ బౌలర్లు: మయాంక్ యాదవ్ (రిటైన్), మొహ్సిన్ ఖాన్ (రిటైన్), ఆకాష్ దీప్, అవేష్ ఖాన్, ఆకాష్ సింగ్, షమర్ జోసెఫ్, ప్రిన్స్ యాదవ్.