
న్యూఢిల్లీ : టీమిండియా వికెట్ కీపర్, స్టార్ బ్యాటర్ రిషబ్ పంత్.. ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌కు ఆడనున్నాడా? అతని కోసం వేలంలో భారీ మొత్తాన్ని వెచ్చించేందుకు ఫ్రాంచైజీ రెడీ అవుతుందా? అంటే... దీనికి సంబంధించి చర్చలు జరిగాయని ఫ్రాంచైజీ సీఈవో కాశీ విశ్వనాథన్ తెలిపారు. అయితే పంత్‌ను తీసుకోవాలా? వద్దా? అనేది కెప్టెన్ రుతురాజ్, ధోనీ, ఫ్లెమింగ్‌పైనే ఆధారపడి ఉందన్నారు. వీళ్లు ముగ్గురే తుది నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.
‘పంత్ అద్భుతమైన ప్లేయర్. వేలంలో పెద్ద ప్లేయర్ల వద్దకు వెళ్లేందుకు అవసరమైన మొత్తం మా దగ్గర లేదు. ఉన్న డబ్బులతోనే మిగిలిన టీమ్‌ను ఏర్పాటు చేసుకోవాలి. ఇండియా ప్లేయర్ల విషయంలో మిగతా ఫ్రాంచైజీలతో పోటీపడే చాన్స్ మాకు ఉంటుందో లేదో చూసుకోవాలి. మేమైతే ప్రయత్నిస్తాం. కానీ వేలంలో మేం కోరుకున్నది దక్కుతుందో లేదో చూడాలి’ అని కాశీ వ్యాఖ్యానించారు.