IPL 2025: ఐపీఎల్ షెడ్యూల్ విడుదల.. RCB vs KKR మధ్య తొలి మ్యాచ్‌

IPL 2025: ఐపీఎల్ షెడ్యూల్ విడుదల.. RCB vs KKR మధ్య తొలి మ్యాచ్‌

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్‌ (2025) షెడ్యూల్ విడుదలైంది. ఈ టోర్నీ మార్చి 22న ప్రారంభమై మే 25న ముగియనుంది.  మొత్తం 74 మ్యాచులు 65 రోజులపాటు జరుగుతాయి. ఇందులో 12 డబుల్-హెడర్ మ్యాచ్‌లు. 

తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌(KKR), రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు(RCB) జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు ఈడెన్‌గార్డెన్స్‌ వేదిక. కోల్‌కతా నైట్ రైడర్స్ సొంత మైదానం, ఐకానిక్ స్టేడియం ఈడెన్ గార్డెన్స్ టోర్నీ ప్రారంభ మ్యాచ్, ఫైనల్‌కు ఆతిథ్యమివ్వనుంది.

గత సీజన్‌ రన్నరప్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మార్చి 23న తొలి పోరులో రాజస్థాన్‌ రాయల్స్‌తో అమీ తుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్ ఉప్పల్ వేదికగా జరగనుంది. అదే రోజు రాత్రి మాజీ ఛాంపియన్లు చెన్నై సూపర్‌కింగ్‌, ముంబై ఇండియన్స్‌ జట్లు తలపడనున్నాయి.

ప్లేఆఫ్స్‌ మ్యాచ్‌లు..

  • మే 20: క్వాలిఫయర్‌ 1 (హైదరాబాద్‌)
  • మే 21: ఎలిమినేటర్‌ (హైదరాబాద్‌)
  • మే 23: క్వాలిఫయర్‌ 2 ( కోల్‌కతా)
  • మే 25: ఫైనల్‌ ( కోల్‌కతా)

 

పోటీలో ఉన్న 10 జట్లు ఇవే..

  • ముంబై ఇండియన్స్‌ (MI)
  • చెన్నై సూపర్‌ కింగ్స్‌(CSK)  
  • రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు (RCB)
  • పంజాబ్‌ కింగ్స్‌ (PBKS) 
  • ఢిల్లీ క్యాపిటల్స్‌ (DC)
  • కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (KKR) 
  • సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (SRH)
  • రాజస్థాన్ రాయల్స్‌ (RR) 
  • లక్నో సూపర్‌ జెయింట్స్‌ (LSG)
  • గుజరాత్‌ టైటాన్స్‌ (GT)

ఈ సీజన్‌లో 13 వేదికల్లో మ్యాచ్‌లు జరగనున్నాయి.

ఐపీఎల్ మ్యాచ్‌లు జరిగే స్టేడియాలు

  • నరేంద్ర మోడీ స్టేడియం: అహ్మదాబాద్
  • ఎం చిన్నస్వామి స్టేడియం: బెంగళూరు
  • ఎం. ఏ చిదంబరం స్టేడియం: చెన్నై
  • అరుణ్ జైట్లీ స్టేడియం: ఢిల్లీ
  • రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం: హైదరాబాద్
  • సవాయి మాన్‌సింగ్ స్టేడియం: జైపూర్
  • ఈడెన్ గార్డెన్స్: కోల్‌కతా
  • వైఎస్ఆర్ క్రికెట్ స్టేడియం: వైజాగ్‌
  • ఎకానా స్టేడియం: లక్నో
  • వాంఖడే స్టేడియం: ముంబై
  • మహారాజా యదవీంద్ర సింగ్ క్రికెట్ స్టేడియం: ముల్లన్‌పూర్
  • బర్సపారా స్టేడియం: గౌహతి
  • హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం: ధర్మశాల

ALSO READ | ఆ ముగ్గురిని ఎదుర్కోవడం కష్టం.. టీమిండియాదే ఛాంపియన్స్ ట్రోఫీ: ఆసీస్ మాజీ కెప్టెన్