IPL 2025: తెలుగు రాష్ట్రాల ఐపీఎల్ ఫ్యాన్స్‌కు పండగ.. ఉప్పల్‌లో 9, వైజాగ్‌లో 2 మ్యాచ్‌లు

IPL 2025: తెలుగు రాష్ట్రాల ఐపీఎల్ ఫ్యాన్స్‌కు పండగ.. ఉప్పల్‌లో 9, వైజాగ్‌లో 2 మ్యాచ్‌లు

తెలుగు రాష్ట్రాల క్రికెట్ అభిమానులకు పండగ లాంటి వార్త ఇది. ఎప్పుడు ఐపీఎల్ మ్యాచ్‌లు తక్కువని బాధపడుతున్న తెలుగు అభిమానులకు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ శుభవార్త చెప్పింది. తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణకు 11 మ్యాచ్‌లు కేటాయించింది.  

ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియం మొత్తం 9 మ్యాచ్‌లకు ఆతిథ్యమివ్వనుంది. ఇందులో లీగ్ మ్యాచ్‌లు 7 కాగా.. ప్లేఆఫ్స్‌ మ్యాచ్‌లు 2 ఉన్నాయి. ఉప్పల్‌లో తొలి మ్యాచ్ మార్చి 23న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ జట్ల మధ్య జరగనుంది.

ఉప్పల్‌లో జరిగే మ్యాచ్‌లు..

  • మార్చి 23: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ vs రాజస్థాన్‌ రాయల్స్‌ (మధ్యాహ్నం 3:30)
  • మార్చి 27: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌ (రాత్రి 7:30)
  • ఏప్రిల్ 06: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ vs గుజరాత్‌ టైటాన్స్‌ (రాత్రి 7:30)
  • ఏప్రిల్ 12: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ vs పంజాబ్ కింగ్స్ (రాత్రి 7:30)
  • ఏప్రిల్ 23: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ vs ముంబై ఇండియన్స్ (రాత్రి 7:30)
  • మే 05: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ vs ఢిల్లీ క్యాపిటల్స్ (రాత్రి 7:30)
  • మే 10: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ vs కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (రాత్రి 7:30)
  • మే 20: క్వాలిఫయర్‌ 1 (హైదరాబాద్‌, రాత్రి 7:30)
  • మే 21: ఎలిమినేటర్‌ (హైదరాబాద్‌, రాత్రి 7:30)

ఇక విశాఖ విషయానికొస్తే, ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు మరో హోంగ్రౌండ్‌గా వైజాగ్‌ను తీసుకుంది. విశాఖలో రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇది ఏపీ అభిమానులకు సొంతోషాన్నిచ్చేదే.

వైజాగ్‌లో మ్యాచ్‌లు

  • మార్చి 23: ఢిల్లీ క్యాపిటల్స్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌ (రాత్రి 7:30)
  • మార్చి 30: ఢిల్లీ క్యాపిటల్స్‌ vs సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (మధ్యాహ్నం 3:30)