
ఇండియన్ క్రికెట్ లో BCCI ట్యాలెంట్ హంట్ సక్సెస్ అయ్యింది. మంచి ఫలితాలను ఇస్తోంది. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ట్యాలెంటెడ్ ప్లేయర్లను వెతికి పట్టుకునేందుకు తీసుకొచ్చిన IPL కారణంగా.. ఎంతో మంది ఆణిముత్యాల్లాంటి ప్లేయర్లు వెలుగులోకి వచ్చారు. వస్తున్నారు. ఐపీఎల్ ప్రారంభమైన 17 ఏళ్ల నుంచి ఇప్పటి వరకు కొత్త కొత్త ప్లేయర్లు ఇంటర్నేషనల్ ప్లేయర్లను కూడా డామినేట్ చేస్తున్నారంటే మనోళ్ల సత్తా ఏంటో అర్థం చేసుకోవచ్చు.
ALSO READ | IPL 2025 : SRH జట్టులోకి నితీష్ కుమార్ ఎంట్రీ ఇచ్చేశాడు..!
కొత్త కొత్త ప్లేయర్లు ట్యాలెంట్ చూపించడమే కాదు.. జట్టును నడిపించే సత్తా కూడా తమలో ఉందని నిరూపించుకుంటున్నారు మనవాళ్లు. ఒకప్పుడు ఐపీఎల్ లో కెప్టెన్లుగా సగం వరకు విదేశీ కెప్టెన్లే ఉండేవారు. ఆటలో అనుభవం.. జట్టును నడిపించే సామర్థ్యం, క్రికెట్ లో వారికున్న రికార్డ్స్ దృష్ట్యా విదేశీ ప్లేయర్లకే కెప్టెన్ బాధ్యతను ఇచ్చేవారు. కానీ ఇప్పుడు లెక్క మారుతోంది. మారింది కూడా. జట్టును నడిపించడంలో, విజయం అందిచడంలో మనవారు ఎక్కడా తీసిపోరు అన్నట్లుగా దాదాపు అన్ని టీమ్స్ కు ఇప్పుడు మన వాళ్లే కెప్టెన్లుగా ఉన్నారు.
‘‘పేరుకేమో ఇండియన్ ప్రీమియర్ లీగ్.. డామినేషన్ అంతా విదేశీయులదే.. ఏ మనవాళ్లు చేయలేరా కెప్టెన్సీ..’’ అనే చర్చ నడిచేది ఫ్యాన్స్ లో ఇన్నాళ్లు. దీనికి తగ్గట్లుగానే.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటే.. ఇండియన్సే కెప్టెన్స్ అన్నట్లుగా ఈసారి దాదాపు అంతా మనవాళ్లే కెప్టెన్లుగా వ్యవహరించడం విశేషం. ఈ సీజన్ లో 10 జట్లలో 9 టీమ్ లకు ఇండియన్సే కెప్టెన్స్. గత సీజన్ లో బెంగళూర్ కు ఫాప్ డూప్లెసిస్, హైదరాబాద్ కు కమిన్స్ కెప్టెన్స్ గా ఉండేవారు. అయితే ఈసారి ఓన్లీ హైదరాబాద్ మాత్రమే విదేశీ ప్లేయర్ కు జట్టు కెప్టెన్ బాధ్యతలు అప్పగించింది. మిగత జట్లన్నీ బాద్యతలు ఇండియన్స్ కే ఇవ్వడం గమనార్హం.
ఏ ఏ టీమ్స్కు మన కెప్టెన్స్ ఉన్నారు:
గత సీజన్ లో గుజరాత్ టైటాన్స్ కు కెప్టెన్ గా ఉన్న హార్దిక్ పాండ్యా ముంబై కెప్టెన్ గా వెళ్లాడు. ముంబై భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఇప్పుడే కెప్టెన్ ను తయారు చేసుకునేందుకు పాండ్యాను జట్టులో చేర్చుకుంది. పాండ్యా వెళ్లడంతో గుజరాత్ కు 2024కు ముందు శుభ్‌మన్ గిల్ కెప్టెన్ అయ్యాడు. ఈఎడిషన్‌లో కూడా కెప్టెన్‌గా కొనసాగనున్నాడు. ఇక చైన్నై సూపర్ కింగ్స్ కు రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. ధోనీ సలహాలతో కెప్టెన్సీలో ఓనమాలు నేర్చేసుకున్నాడు.
పంజాబ్ కింగ్స్ ను నడిపించిన శిఖర్ ధావన్ రిటైరవ్వడంతో ఈసారి శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్నాడు. ఇక డిఫెండింగ్ ఛాంపియన్ కోల్ కత్తా నైట్ రైడర్స్ ను 2024 లో ఛాంపియన్ గా నిలిపిన శ్రేయస్ అయ్యర్ పంజాబ్ కింగ్స్ వెళ్లాడు. దీంతో కేకేఆర్ కూడా కొత్త కెప్టెన్ సారథ్యంలోనే బరిలోకి దిగుతోంది. అజింక్య రహానే కోల్ కత్తా ను నడిపించనున్నాడు.
ఇక ఆర్సీబీ కూడా ఈ సారి కొత్త కెప్టెన్ తోనే బరిలోకి దిగుతోంది. మేనేజ్ మెంట్ ఈ సారి ఫాఫ్ డుప్లెసిస్ ను వదిలేసి..రి రజత్ పటీదార్‌ను కెప్టెన్‌గా నియమించింది. ఐపీఎల్ లో అతి తక్కువ వయసున్న లక్నో సూపర్ జెయింట్స్ కూడా చాలా తొందరగా కెప్టెన్ ను మార్చుతోంది. 2022లో ఎంట్రీ ఇచ్చిన లక్నో సూపర్ జెయింట్స్ ను ఇన్నాళ్లూ కేఎల్ రాహుల్ నడిపించాడు. మెగావేలానికి ముందు రాహుల్ ను ఆ ఫ్రాంచైజీ వదిలేసి.. ఈ సీజన్‌కు రిషబ్ పంత్ కు కెప్టెన్ బాధ్యతలు అప్పగించింది మేనేజ్ మెంట్. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్ ఏంటంటే.. పంత్ ను ఢిల్లీని వదిలేయడంతో.. కొత్త కెప్టెన్ గా కూల్ ఆల్ రౌండర్, మంచి ఫామ్ లో ఉన్న అక్షర్ పటేల్ ను కొత్త సారథిగా నియమించింది ఢిల్లీ. మరో బెస్ట్ టీం రాజస్థాన్ రాయల్స్ తమ కెప్టెన్ గా సంజూ శాంసన్ నే కొనసాగిస్తోంది.
ఇక ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న ఐపీఎల్ 2025 మార్చి 22న ప్రారంభం అవుతుంది. ఫస్ట్ మ్యాచ్ కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో తలపడనుంది. మార్చి 22న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈసారి అంతా యంగ్ ప్లేయర్స్.. అది కూడా ఇండియన్స్ టీమ్స్ కు కెప్టెన్లుగా ఉండటంతో ఈ సీజన్ మరింత రసవత్తరంగా ఉండనుందని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.