టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఐపీఎల్ ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్‌తో తన తొమ్మిదేండ్ల బంధాన్ని తెంచుకున్నాడు. సౌతాఫ్రికా హిట్టర్, సన్ రైజర్స్ బ్యాటర్ హెన్రిచ్ రూ.23 కోట్ల ఫీజుతో ఆర్‌సీబీ సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ (21 కోట్లు) అధిగమించి ఐపీఎల్‌లో ఖరీదైన రిటెన్షన్ ప్లేయర్‌గా నిలిచాడు. రాబోయే సీజన్ కోసం జరిగే మెగా వేలానికి ముందు పది ఫ్రాంచైజీలు తమ జట్టుతో కొనసాగించుకునే (రిటైన్) ఆటగాళ్ల జాబితాను బీసీసీఐ శుక్రవారం విడుదల చేసింది. ఒక రైట్ టు మ్యాచ్ (ఆర్‌టీఎం) సహా ఆరుగురిని రిటైన్ చేసుకునే అవకాశం ఉండగా..
డిఫెండింగ్ చాంపియన్ కేకేఆర్, రాజస్తాన్ రాయల్స్ అత్యధికంగా ఆరుగురిని రిటైన్ చేసుకున్నాయి. ఆర్‌సీబీ ముగ్గురిని, పంజాబ్ కింగ్స్ అత్యల్పంగా ఇద్దరినే నిలబెట్టుకుంది. రిషబ్ పంత్‌తో పాటు కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్‌ను ఊహించినట్టుగానే ఆయా ఫ్రాంచైజీలు విడుదల చేశాయి. ఢిల్లీ కొత్త కోచింగ్ స్టాఫ్ నియామకం నచ్చక పంత్ ఫ్రాంచైజీని వీడినట్టు తెలుస్తోంది. పంత్‌ను రిలీజ్ చేసిన ఢిల్లీ తమ టాప్ రిటెన్షన్‌గా అక్షర్ పటేల్ (16.5 కోట్లు)ను ఎంచుకుంది.
ముంబై ఇండియన్స్ జస్‌ప్రీత్ బుమ్రాకు 18 కోట్లు ఇచ్చి తమ కీలక ఆటగాళ్లయిన సూర్యకుమార్, హార్దిక్, రోహిత్‌తో పాటు తిలక్ వర్మను రిటైన్ చేసుకుంది. పంజాబ్ ఫ్రాంచైజీ ఇద్దరు అన్‌క్యాప్డ్ ప్లేయర్లను (ప్రభ్‌సిమ్రాన్, శశాంక్) మాత్రమే నిలుపుకొని రాబోయే ఐపీఎల్ వేలం కోసం అత్యధికంగా రూ. 110.5 కోట్లను ఖాతాలో ఉంచుకుంది.
పది ఫ్రాంచైజీల రిటెన్షన్స్ జాబితా
ఢిల్లీ : అక్షర్ (రూ.16.5 కోట్లు), కుల్దీప్ యాదవ్ ( 13.25 కోట్లు), స్టబ్స్ (10 కోట్లు), పోరెల్ (4 కోట్లు); రిటెన్షన్స్ ఖర్చు: 43.75 కోట్లు. వేలానికి మిగిలిన మొత్తం: 76.25 కోట్లు. ఆర్‌టీఎం: 2;
ముంబై : బుమ్రా (18 కోట్లు), సూర్యకుమార్(16.35 కోట్లు), హార్దిక్ (16.35 కోట్లు), రోహిత్ (16.30 కోట్లు), తిలక్ (8 కోట్లు). రిటెన్షన్స్ ఖర్చు: 75 కోట్లు; వేలానికి మిగిలిన మొత్తం: 45 కోట్లు. ఆర్‌టీఎం: 1;
ఆర్‌సీబీ : విరాట్ కోహ్లీ (21 కోట్లు), రజత్ పటీదార్ ( 11 కోట్లు), యశ్ దయాల్ ( 5 కోట్లు); రిటెన్షన్స్ ఖర్చు: 37 కోట్లు. వేలానికి మిగిలిన మొత్తం: 83 కోట్లు. ఆర్‌టీఎం: 3;
పంజాబ్ : శశాంక్ (5.5 కోట్లు), ప్రభ్‌సిమ్రాన్ (4 కోట్లు), రిటెన్షన్స్ ఖర్చు: 9.5 కోట్లు. వేలానికి మిగిలిన మొత్తం: 110.5 కోట్లు; ఆర్‌టీఎం:4 ;
కేకేఆర్ : రింకూ సింగ్ (13 కోట్లు), చక్రవర్తి ( 12 కోట్లు), నరైన్ (12 కోట్లు), రస్సెల్ (12 కోట్లు), హర్షిత్ రాణా (4 కోట్లు), రమణ్‌దీప్ (4 కోట్లు). రిటెన్షన్స్ ఖర్చు: 57 కోట్లు. వేలానికి మిగిలిన మొత్తం:63 కోట్లు. ఆర్‌టీఎం: 0.
సన్‌రైజర్స్ : కమిన్స్ (18 కోట్లు), అభిషేక్ (14 కోట్లు), నితీష్ ( 6 కోట్లు), క్లాసెన్ ( 23 కోట్లు), హెడ్ (14 కోట్లు); రిటెన్షన్స్ ఖర్చు: 75 కోట్లు; వేలానికి మిగిలిన మొత్తం: 45 కోట్లు. ఆర్‌టీఎం:1.
సీఎస్కే : రుతురాజ్ (18 కోట్లు), పతిరణ (13 కోట్లు), శివం దూబే (12 కోట్లు), జడేజా ( 18 కోట్లు), ధోనీ (4 కోట్లు). రిటెన్షన్స్ ఖర్చు:
65 కోట్లు. వేలానికి మిగిలిన మొత్తం: 55 కోట్లు. ఆర్‌టీఎం: 1.
రాజస్తాన్ : శాంసన్ (18 కోట్లు), జైస్వాల్ (18 కోట్లు), పరాగ్ (14 కోట్లు), జురెల్ (14 కోట్లు), హెట్‌మయర్ (11 కోట్లు), సందీప్ శర్మ (4 కోట్లు); రిటెన్షన్ ఖర్చు: 79 కోట్లు; వేలానికి మిగిలిన మొత్తం: 41 కోట్లు. ఆర్‌టీఎం: 0
లక్నో : పూరన్ ( 21 కోట్లు), బిష్ణోయ్ ( 11 కోట్లు), మయాంక్ యాదవ్ (11 కోట్లు), మోసిన్ (4 కోట్లు), బదోనీ (4 కోట్లు). రిటెన్షన్స్ ఖర్చు: 51 కోట్లు; వేలానికి మిగిలిన మొత్తం: 69 కోట్లు, ఆర్‌టీఎం: 1;
గుజరాత్ : రషీద్(18 కోట్లు), గిల్ (16.5 కోట్లు), సుదర్శన్ (8.5 కోట్లు), తెవాటియా ( 4 కోట్లు), షారుక్ ( 4 కోట్లు), రిటెన్షన్స్ ఖర్చు: 51 కోట్లు; వేలానికి మిగిలిన మొత్తం: 69 కోట్లు. ఆర్‌టీఎం1.