IPL 2025 : ఉప్పల్ స్టేడియం భద్రతకు సర్వం సిద్ధం : ఇక మ్యాచ్లు హ్యాపీగా ఆడుకోవటమే

IPL 2025 : ఉప్పల్ స్టేడియం భద్రతకు సర్వం సిద్ధం : ఇక మ్యాచ్లు హ్యాపీగా ఆడుకోవటమే

ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న IPL పండుగ మరికొన్ని గంటల్లో షురూ అవ్వబోతోంది. ఫ్యాన్స్ ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకుని రెడీ గా ఉన్నారు. ఐపీఎల్ అంటే ఫుల్ హంగామా చేసే హైదరాబాద్ ఫ్యాన్స్.. మ్యాచ్ కోసం ప్లాన్స్ సిద్ధం చేసుకున్నారు. శనివారం (మార్చి 22) ఐపీఎల్ ప్రారంభం కానుండటంతో ప్రేక్షకుల్లో సందడి మొదలయ్యింది. 

ఐపీఎల్ మ్యాచ్ ల కోసం ఉప్పల్ స్టేడియం సిద్ధమయ్యింది. మ్యాచ్ ల కోసం పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్లు సీపీ సుధీర్ బాబు తెలిపారు. మొత్తం 3 వేలకు పైగా పోలీస్ బలగాలతో, 450 సీసీ కెమెరాలతో నిత్యం నిఘా ఉంటుందని తెలిపారు. ప్రతి గేట్ దగ్గర మొబైల్ చెకింగ్ ఉంటుందని ప్రెస్ మీట్ లో చెప్పారు. 

ఉప్పల్ లో మొత్తం 7 లీగ్ మ్యాచ్ లు ఉన్నాయి. అందుకోసం ఉప్పల్ స్టేడియంలో ఏర్పాట్లు పూర్తి అయినట్లు ఆయన తెలిపారు. మ్యాచ్ సందర్భంగా వచ్చే ప్రేక్షకులకు వాటర్ బాటిల్స్, ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదని అన్నారు. 

ALSO READ | స్విస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–300 టోర్నీ: తొలి రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే నిరాశపర్చిన సింధు

ఆదివారం (మార్చి 23) మధ్యాహ్నం 3.30 కు మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. మ్యాచ్ కోసం 3 గంటల ముందే గేట్లు ఓపెన్ చేస్తామని తెలిపారు. ప్రేక్షకులు ముందుగానే స్టేడియానికి చేరుకోవాలని సూచించారు. ప్రేక్షకుల వాహనాల పార్కింగ్ కోసం19 పార్కింగ్ ప్లేసులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రేక్షకుల రవాణా సౌకర్యం కోసం మెట్రో సర్వీసులు అర్థరాత్రి వరకు ఉంటాయని తెలిపారు.