IPL 2025: ఢిల్లీ క్యాపిటల్స్ ఈసారైనా కప్పుకొడుతుందా.?

IPL 2025: ఢిల్లీ క్యాపిటల్స్ ఈసారైనా కప్పుకొడుతుందా.?

ఐపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఒక్కసారి కూడా ట్రోఫీ నెగ్గని జట్లలో ఢిల్లీ క్యాపిటల్స్ ఒకటి. వీరేందర్ సెహ్వాగ్ మొదలు రిషబ్ పంత్ వరకు ఇండియా మేటి ఆటగాళ్లు, జయవర్దనే, కెవిన్ పీటర్సన్ వంటి ఫారిన్ స్టార్లు ఎంత ప్రయత్నించినా జట్టుకు టైటిల్ అందించలేకపోయారు.2020లో ఫైనల్ వరకూ వచ్చినా గమ్యాన్ని ముద్దాడలేకపోయింది. గత రెండు సీజన్లలో 9, 6వ స్థానాలతో తీవ్రంగా నిరాశపరిచింది. ఇక లాభం లేదని 18వ సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో డీసీ ఫ్రాంచైజీ తమ జట్టును పూర్తిగా మార్చేసింది. కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, ట్రిస్టన్ స్టబ్స్, అభిషేక్ పోరెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మాత్రమే రిటైన్ చేసి వేలంలో కొత్తగా 19 మంది ఆటగాళ్లను  తీసుకుంది.  

రిషబ్ పంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను వదులుకున్న డీసీ ఫ్రాంచైజీ కేకేఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ట్రోఫీ అందించిన తమ మాజీ కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శ్రేయస్ అయ్యర్ కోసం ప్రయత్నించి విఫలమైంది. లక్నో, ఆర్సీబీ మాజీ కెప్టెన్లు కేఎల్ రాహుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, డుప్లెసిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మిచెల్ స్టార్క్‌‌‌‌, నటరాజన్‌‌‌‌ తదితర టాప్ ప్లేయర్లను తీసుకొని జట్టును బలోపేతం చేసుకుంది. రాహుల్, డుప్లెసిస్‌‌‌‌ ఇద్దరికీ కెప్టెన్సీలో చాలా అనుభవం ఉన్నా.. తమ ఆల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రౌండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అక్షర్ పటేల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పగ్గాలు అప్పగించింది. అంతకుముందే తమ కోచింగ్‌‌‌‌ స్టాఫ్‌‌‌‌ను కూడా మార్చేసింది. మరి, పూర్తిగా కొత్త రూపంతో బరిలోకి దిగుతున్న డీసీ ఈసారైనా కప్పు కొడుతుందేమో చూడాలి.

పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫుల్ బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఈసారి అత్యంత శక్తివంతమైన బౌలింగ్ యూనిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఏర్పాటు చేసుకుంది.  మిచెల్ స్టార్క్, నటరాజన్, దుష్మంత చమీరా, మోహిత్ శర్మ, ముకేష్ కుమార్ వంటి బౌలర్లు ఉండటం జట్టుకు గొప్ప బలం. స్టార్క్ గత సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కతా నైట్ రైడర్స్ కు టైటిల్ అందించడంలో కీలకపాత్ర పోషించాడు.   టీమిండియా సీనియర్ స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ మిడిల్ ఓవర్లలో ప్రత్యర్థులను కట్టడి చేయగలరు.  డుప్లెసిస్, ఫ్రేజర్-మెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గర్క్, కేఎల్ రాహుల్, అభిషేక్ పోరెల్ రూపంలో టాపార్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నాణ్యమైన బ్యాటర్లు అందుబాటులో ఉన్నారు.  ఫ్రేజర్- గత సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 234 స్ట్రైక్ రేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో చెలరేగగా, డుప్లెసిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా 161 స్ట్రైక్ రేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో రాణించాడు. ఈ మధ్య టీమిండియా తరఫున హిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కొట్టిన కేఎల్ రాహుల్ టాపార్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు మిడిలార్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ ఆడగలడు. మిడిలార్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాధ్యతలు చేపట్టేందుకు స్టబ్స్, కరుణ్ నాయర్ కూడా అందుబాటులో ఉండటం ప్లస్ పాయింట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. అక్షర్ పటేల్ స్పిన్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గానే కాకుండా ఫినిషర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గానూ తన మార్కు చూపెట్టగలడు. టీమిండియాలోనూ కీలక ఆటగాడిగా ఎదిగిన అక్షర్‌‌‌‌‌‌‌‌కు ఐపీఎల్ కెప్టెన్సీ కొత్తే అయినా.. డొమెస్టిక్ క్రికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గుజరాత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జట్టును నడిపించిన అనుభవం అతనికి ఉంది. గతంలో లక్నో కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా వ్యవహరించిన కేఎల్ రాహుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అతనికి 
అవసరమైన సపోర్ట్ అందించనున్నాడు.  

బ్యాకప్ ప్లేయర్ల సమస్య

స్పిన్ విభాగంలో బ్యాకప్ ప్లేయర్ల కొరత  ఢిల్లీకి సమస్యగా మారొచ్చు.  కుల్దీప్ లేదా అక్షర్ గాయపడితే మరో ప్రత్యామ్నాయం లేదు. పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్లే, డెత్ ఓవర్ల బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో డీసీ బలంగా ఉన్నప్పటికీ 7–-15 ఓవర్ల మధ్య ప్రత్యర్థి జట్టు స్కోరును కంట్రోల్ చేసే స్పెషలిస్టులు జట్టులో లేరు. ఇక ఇంగ్లండ్ హిట్టర్ హ్యారీ బ్రూక్ లీగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి చివరి నిమిషంలో వైదొలిగాడు. తను లేకపోవడంతో మిడిలార్డర్ బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాస్త బలహీనం అవ్వొచ్చు. అతని స్థానాన్ని  ఎవరితో భర్తీ చేస్తారో చూడాలి.  

ఎంతదూరం

ఢిల్లీ క్యాపిటల్స్ సమతూకమైన జట్టును రూపొందించుకుందని స్పష్టంగా కనిపిస్తోంది. పేస్ బౌలింగ్ అత్యంత శక్తివంతంగా మారింది. ఇది ప్రత్యర్థి జట్లకు ప్రధాన సవాల్ కానుంది. అలాగే, టాపార్డర్ కూడా బలంగా ఉండటం మరో అద్భుతమైన అవకాశం. కొత్త కెప్టెన్ అక్షర్ పటేల్ గ్రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎంత చురుకైన నిర్ణయాలు తీసుకుంటాడు? ఆటగాళ్లను ఏ విధంగా నడిపిస్తాడనేది డీసీ విజయావకాశాలను నిర్ణయిస్తుంది.  స్టార్క్, కేఎల్ రాహుల్, డుప్లెసిస్ అనుభవం జట్టుకు అదనపు ప్రయోజనం కానుంది. దాంతో తొలి ఐపీఎల్ ట్రోఫీ అక్షర్ సేనను ఊరిస్తోంది.

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు

బ్యాటర్లు: డుప్లెసిస్, ఫ్రేజర్ -మెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గర్క్, కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, సమీర్ రిజ్వి, అశుతోష్ శర్మ; కీపర్లు: అభిషేక్ పోరెల్, ట్రిస్టన్ స్టబ్స్, డొనోవన్ ఫెరైరా; ఆల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రౌండర్లు: అక్షర్ పటేల్ (కెప్టెన్), అజయ్ మందల్, త్రిపురాన విజయ్, మాధవ్ తివారి, మన్వంత్ కుమార్; స్పిన్నర్లు: కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, విప్రజ్ నిగమ్; ఫాస్ట్ బౌలర్లు: మిచెల్ స్టార్క్, టి. నటరాజన్, దుష్మంత చమీరా, మోహిత్ శర్మ, ముకేష్ కుమార్, దర్శన్ నల్కండే.