దుబాయ్‌లో IPL 2024 వేలం.. లైవ్ స్ట్రీమింగ్‌తో పాటు పూర్తి వివరాలు

దుబాయ్‌లో  IPL 2024 వేలం.. లైవ్ స్ట్రీమింగ్‌తో పాటు పూర్తి వివరాలు

ఐపీఎల్ 2024 కు సంబంధించి దుబాయ్ వేదికగా వేలం నిర్వహించే సమయం రాబోతుంది. ప్రపంచ క్రికెట్ లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ వేలం రేపు( డిసెంబర్ 19) నిర్వహిస్తారు. నవంబర్ 26 న ఆయా ఫ్రాంచైజీలు తమ ప్లేయర్ల రిటైన్, రిలీజ్ జాబితాను తెలియజేసింది.మొత్తం 1166 మంది ఆటగాళ్లు వేలం కోసం తమ పేరును నమోదు చేసుకోగా.. వీరిలో 333 మంది మాత్రమే షార్ట్ లిస్ట్ చేయబడ్డారు. 214 మంది భారత క్రికెటర్లతో పాటు.. 119 మంది విదేశీ ఆటగాళ్లున్నారు. 
   
పర్స్ విషయానికొస్తే.. ఈ సారి ప్రతి జట్టుకు 5 కోట్ల రూపాయలు పెంచాలని BCCI నిర్ణయించింది. గుజరాత్ టైటాన్స్ వద్ద గరిష్టంగా  38. 15 కోట్లు మిగిలి ఉండగా.. లక్నో సూపర్ జయింట్స్ దగ్గర కేవలం 13.15 కోట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. 23 ఆటగాళ్ల ప్రాధమిక ధర 2 కోట్లుగా నిర్ణయించారు. ఇంగ్లాండ్ స్టార్ క్రికెటర్లు బెన్ స్టోక్స్, జో రూట్, జోఫ్రా ఆర్చర్ ఈ మెగా టోర్నీ నుంచి తప్పుకున్నారు. డిసెంబర్ 19న దుబాయ్‌లోని కోకా కోలా అరేనాలో మధ్యాహ్నం 1 గంటలకు ఈ వేలం ప్రారంభమవుతుంది.
  
స్ట్రీమింగ్ ఇందులో చూడాలంటే? 

 IPL వేలం 2024 స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. మొబైల్స్ లో జియో సినిమాలో ఈ ఆక్షన్ చూడొచ్చు 

ఫ్రాంచైజీల దగ్గర మిగిలి ఉన్న డబ్బు: 

చెన్నై సూపర్ కింగ్స్: 31.4 కోట్లు 
ఢిల్లీ క్యాపిటల్స్: 28.95 కోట్లు 
గుజరాత్ టైటాన్స్ : 38.15 కోట్లు 
కోల్ కత్తా నైట్ రైడర్స్: 32.7 కోట్లు 
లక్నో సూపర్ జయింట్స్: 13.15 కోట్లు 
ముంబై ఇండియన్స్ :17.75 కోట్లు 
పంజాబ్ కింగ్స్ : 29.1 కోట్లు 
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: 23.25కోట్లు 
రాజస్థాన్ రాయల్స్: 14.5 కోట్లు 
సన్ రైజర్స్ హైదరాబాద్:34 కోట్లు