IPL 2024 auction Live Updates: ఐపీఎల్ వేలం లైవ్ అప్‌డేట్స్..

IPL 2024 auction Live Updates: ఐపీఎల్ వేలం లైవ్ అప్‌డేట్స్..

ఐపీఎల్ 2024 మినీ వేలం ముగిసింది. దుబాయ్‌లోని కోకోకోలా ఎరెనా వేదికగా మంగళవారం మధ్యాహ్నం 1:00 గంటకు ప్రారంభమైన వేలం రాత్రి 9 గంటల వరకూ కొనసాగింది. ఈ వేలంలో భారత్ సహా 12 దేశాలకు చెందిన 333 మంది ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.

ముగిసిన ఐపీఎల్‌ వేలం..

ఐపీఎల్‌ వేలం ముగిసింది. ఈ వేలంలో ఫ్రాంచైజీలు రూ. 230.65 కోట్లు వెచ్చించి మొత్తం 72 మంది ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. ఆసీస్ బౌలర్ మిచెల్ స్టార్క్(రూ.24.75 కోట్లు) అత్యధిక ధర పలికిన ఆటగాడిగా నిలిచాడు.

తెలంగాణ యువకుడు

అండర్ 19 ప్రపంచ కప్‌కు ఎంపికైన తెలంగాణ, సిరిసిల్లా జిల్లాకు చెందిన ఆరవెల్లి అవనీష్ రావు(వికెట్‌ కీపర్‌/ బ్యాటర్) చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకుంది. రూ.20 లక్షల బేస్ ప్రైస్‌కు అతన్ని కోలుగోలు చేసింది.

నాండ్రీ బర్గర్‌ - రూ. 50 లక్షలు

దక్షిణాఫ్రికా పేసర్ నాండ్రీ బర్గర్‌ను రాజస్థాన్‌ రాయల్స్‌ రూ. 50 లక్షలకు దక్కించుకుంది.

రూ. 20 లక్షలు

  • స్వస్తిక్‌ ఛికారా (ఢిల్లీ క్యాపిటల్స్): రూ. 20 లక్షలు
  • అబిద్ ముస్తాక్‌ (రాజస్థాన్‌ రాయల్స్): రూ. 20 లక్షలు
  • శివలిక్‌ శర్మ (ముంబై ఇండియన్స్): రూ. 20 లక్షలు
  • స్వప్పిల్‌ సింగ్‌ (రాయల్ చాలెంజర్స్ బెంగళూరు): రూ. 20 లక్షలు
  • అరవెల్లి అవనిష్‌ రావు (చెన్నై సూపర్ కింగ్స్): రూ. 20 లక్షలు
  • షకిబ్ హుస్సేన్‌ (కోల్‌కతా నైట్ రైడర్స్): రూ. 20 లక్షలు

షాయ్ హోప్ - రూ.75 లక్షలు

వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.75 లక్షల కనీస ధరకు సొంతం చేసుకుంది.

గుస్ అట్కిన్సన్ - కోటి రూపాయలు

ఇంగ్లాండ్ బౌలర్ గుస్ అట్కిన్సన్ కోల్ కతా నైట్ రైడర్స్ కోటి రూపాయలకు దక్కించుకుంది.

ముంబైకి మహమ్మద్ నబీ

అఫ్ఘనిస్తాన్ ఆల్ రౌండర్ మహమ్మద్ నబీని ముంబై ఇండియన్స్ రూ. 1.5 కోట్లకు కొనుగోలు చేసింది.

ముజీబ్ ఉర్ రెహ్మాన్ - రూ. 2 కోట్లు

అఫ్గాన్ మిస్టరీ స్పిన్నర్ ముజీబ్ ఉర్ రెహ్మాన్ ను కోల్ కతా నైట్ రైడర్స్ రూ. 2 కోట్లకు సొంతం చేసుకుంది.

ఆర్సీబీ చెంతకు ఫెర్గూసన్ 

న్యూజిలాండ్ ప్రధాన పేసర్ లాకీ ఫెర్గూసన్ ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు రూ.2 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది.

మనీష్ పాండే - రూ. 50 లక్షలు

ఓడలు బండ్లు అవుతాయి.. బండ్లు ఓడలు అవుతాయి అంటే ఇదేనేమో. ఒకప్పుడు భారత జట్టులో కీలక ఆటగాడిగా మెలిగిన మనీష్ పాండే రూ. 50 లక్షల కనీస ధరకు అమ్ముడుపోయాడు. కోల్ కతా నైట్ రైడర్స్ అతన్ని కొనుగోలు చేసింది.

రిలీ రోసో - రూ.8 కోట్లు

తొలి రౌండ్ లో అమ్ముడుపోని దక్షిణాఫ్రికా విధ్వంసకర హిట్టర్ రిలీ రోసో ఆఖరి రౌండ్ లో భారీ ధర పలికాడు. అతని కనీస ధర రూ.2 కోట్లు కాగా, రూ.8 కోట్లు వెచ్చించి పంజాబ్ కింగ్స్ అతన్ని సొంతం చేసుకుంది.

దేశవాళీ క్రికెటర్లను పట్టించుకోని ఫ్రాంచైజీలు

విదేశీ క్రికెటర్లపై కోట్ల రూపాయలు కురిపించిన ఐపీఎల్ ఫ్రాంచైజీలు, దేశవాళీ ఆటగాళ్ల వంతు వచ్చేసరికి మొండిచేయి చూపాయి. రూ.20 లక్షల కనీస ధరకు కూడా వారిని కొనేందుకు ముందుకు రాలేదు. దేశవాలేదు టోర్నీల్లో హీరోలైన సందీప్‌ వారియర్, లూక్ వుడ్, శశాంక్‌ సింగ్‌, స్వస్తిక్‌ ఛిక్కా, రితిక్ ఈశ్వరన్, హిమ్మత్‌ సింగ్‌, సుమిత్‌ వర్మ, రోహిత్ రాయుడు, ప్రదోష్ పాల్, కమలేష్ నాగరకోటి, తనుష్ కోటియన్, అజితేశ్‌, గౌవర్‌ చౌధరి, బిపిన్ సౌరభ్, కేఎం ఆసిఫ్, సాకిబ్ హుస్సేన్, మొహమ్మద్ కైఫ్, అభిలాష్ శెట్టి, గుర్జ్‌పనీత్ సింగ్, పృథ్వీరాజ్ యర్రా, శుభమ్ అగర్వాల్ అన్‌సోల్డ్‌ ఆటగాళ్లుగా మిగిలిపోయారు.

పంజాబ్ కింగ్స్‌ దూకుడు

యువ క్రికెటర్లను చేజిక్కించుకోవడంలో పంజాబ్ కింగ్స్‌ యాజమాన్యం దూకుడు ప్రదర్శించింది. రూ. 20 లక్షల కనీస ధరకు అషుతోష్ శర్మ, విశ్వనాథ్‌ ప్రతాప్‌ సింగ్‌, శశాంక్‌ సింగ్‌, తనయ్‌ త్యాగరాజన్‌, ప్రిన్స్ చౌదరి రూపంలో  ఐదుగురిని దక్కించుకుంది.

రాబిన్ మిన్జ్ - రూ.3.6 కోట్లు

లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్, వికెట్ కీపరైన రాబిన్ మిన్జ్ ను గుజరాత్ టైటాన్స్ రూ.3.6 కోట్లకు కొనుగోలు చేసింది.

సుమిత్ కుమార్

రైట్ హ్యాండ్ బ్యాటర్, వికెట్ కీపర్ సుమిత్ కుమార్ ను ఢిల్లీ క్యాపిటల్స్ కోటి రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసింది.

నువాన్ తుషార - రూ. 4.8 కోట్లు

శ్రీలంక పేసర్ నువాన్ తుషారను ముంబై ఇండియన్స్ రూ. 4.8 కోట్లకు కొనుగోలు చేసింది. ఇతని బౌలింగ్ శైలి అచ్చం ఆ జట్టు మాజీ బౌలర్ లసిత్ మలింగను పోలి ఉంటుంది.

జై రిచర్డ్‌సన్‌ - రూ. 5 కోట్లు

ఆసీస్ బౌలర్ జై రిచర్డ్‌సన్‌ ను ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ రూ. 2 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది.  

డేవిడ్‌ విల్లే - రూ. 2 కోట్లు

ఇంగ్లాండ్‌ ఆల్ రౌండర్ డేవిడ్ విల్లేను రూ. 2 కోట్లకు లక్నో సూపర్‌ జెయింట్స్‌ సొంతం చేసుకుంది.

అనామక క్రికెటర్‌కు రూ.10 కోట్లు

ఐపీఎల్ 2024 వేలంలో ఆసీస్ యువ బౌలర్ స్పెన్సర్ జాన్సన్ రికార్డు ధర పలికాడు. అంతర్జాతీయ స్థాయిలో సరిగ్గా 10 మ్యాచ్ లు కూడా ఈ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఏకంగా రూ.10 కోట్లకు అమ్ముడు పోవడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. గుజరాత్ టైటాన్స్‌ అతన్ని సొంతం చేసుకుంది.

RCB మాజీ ప్లేయర్ అన్‌సోల్డ్ 

న్యూజిలాండ్ పేసర్, ఆర్సీబీ మాజీ ప్లేయర్ కైల్ జేమీసన్ అమ్ముడు పోలేదు. అతని బాటలోనే మరికొందరు అంతర్జాతీయ బౌలర్లు పయనించారు. మాట్ హెన్రీ, బెన్ ద్వార్షుయిస్, దుష్మంత చమీర, కీమో పాల్, మైఖేల్ బ్రేస్‌వెల్, కైస్ అహ్మద్, ఆడమ్ మిల్నే, టైమల్ మిల్స్ ల పట్ల ప్రాంఛైజీలు ఆసక్తి చూపలేదు. 

అమ్ముడుపోని విధ్వంసకర బ్యాటర్లు

న్యూజీలాండ్ ఓపెనర్ ఫిన్ అలెన్, ఆ జట్టు విధ్వంసకర బ్యాటర్లు కోలిన్ మున్రో, జిమ్మీ నీషామ్, విండీస్ కెప్టెన్ షాయ్ హోప్, ఒడియన్ స్మిత్, దక్షిణాఫ్రికా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ రాస్సీ వాన్ డెర్ డుసెన్  పట్ల ఫ్రాంచైజీలు ఆసక్తి చూపలేదు. దీంతో అన్‌సోల్డ్ ప్లేయర్లుగా మిగిలిపోయారు.

షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ - కేకేఆర్

విండీస్ బౌలింగ్ ఆల్ రౌండర్ షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ ను కేకేఆర్ రూ. 1.5 కోట్లకు దక్కించుకుంది.

పుల్కిత్ నారంగ్

ఢిల్లీకి చెందిన పుల్కిత్ నారంగ్ ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోలేదు. 20 లక్షల బేస్ ప్రైజ్ తో ఈ యువ స్పిన్నర్ ను ఎవరూ  కొనుగోలు చేయలేదు 

శ్రేయాస్ గోపాల్

కర్ణాటక లెగ్ స్పిన్నర్  శ్రేయాస్ గోపాల్ ను ముంబై ఇండియన్స్ జట్టు బేస్ ప్రైజ్ 20 లక్షలకు సొంతం చేసుకుంది. 

మురుగన్ అశ్విన్

మురుగన్ అశ్విన్ 20 లక్షల బేస్ ప్రైజ్ కు అమ్ముడుపోలేదు. తమిళనాడు కు చెందిన ఈ స్పిన్నర్ గతంలో పూణే వారియర్స్ తరపున ఆడాడు.  

ఎం సిద్ధార్థ్ 

ఎం సిద్ధార్థ్ ను రూ. 2.40 లక్షలకు లక్నో సూపర్ జయింట్స్ దక్కించుకుంది. 25 ఏళ్ళ సిద్ధార్ధ్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్.      

మానవ్ సుతార్ 

లెఫ్ట్ ఆర్మ్ బ్యాటర్, ఆర్థడాక్స్ స్పిన్నర్ మానవ్ సుతార్ ను గుజరాత్ టైటాన్స్ రూ. 20 లక్షలకు సొంతం చేసుకుంది.

రాసిఖ్ దార్ 

జమ్మూ కాశ్మీర్‌ యువ క్రికెటర్ రాసిఖ్ సలాం దార్ ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 20 లక్షలకు కొనుగోలు చేసింది.

కార్తీక్ త్యాగి

యువ బౌలర్ కార్తీక్ త్యాగిని రూ. 60 లక్షల తక్కువ ధరకు గుజరాత్ టైటాన్స్ దక్కించుకుంది.

సుశాంత్ మిశ్రా - రూ.2.2 కోట్లు

గుజరాత్ టైటాన్స్ యాజమాన్యం సుశాంత్ మిశ్రాను రూ. 2.2 కోట్లకు సొంతం చేసుకుంది.  

యశ్ దయాల్ - రూ.5 కోట్లు

యువ బౌలర్ యశ్ దయాల్ ను రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ. 5 కోట్లకు కొనుగోలు చేసింది.

కుమార్ కుషాగ్రా - రూ.7.2 కోట్లు

సమీర్ రిజ్వీ (రూ. 8.4 కోట్లు), షారుక్ ఖాన్ (రూ. 7.4 కోట్లు), శుభమ్ దూబే (రూ. 5.8 కోట్లు) బాటలో మరో భారత అన్‌క్యాప్‌డ్ ప్లేయర్ కోట్లు కొల్లగొట్టాడు. రైట్ హ్యాండ్ బ్యాటరైన కుమార్ కుశాగ్రాను ఢిల్లీ క్యాపిటల్స్‌ రూ.7.20 కోట్లకు సొంతం చేసుకుంది.

రికీ భుయ్

రికీ భుయ్ ని ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 20 లక్షల బేస్ ధరకు సొంతం చేసుకుంది.

రాయల్స్‌కు కాడ్మోర్

ఇంగ్లాండ్ విధ్వంసకర క్రికెటర్, వికెట్ కీపర్ టామ్ కాడ్మోర్ ను రాజస్థాన్ రాయల్స్ రూ. 40 లక్షల బేస్ ధరకు దక్కించుకుంది.

అన్‌క్యాప్డ్ ప్లేయర్స్ హైలెట్స్

  • సమీర్ రిజ్వీ (సీఎస్‌కే) - రూ. 8.4 కోట్లు
  • షారుక్ ఖాన్ (గుజరాత్) - రూ. 7.4 కోట్లు
  • శుభమ్ దూబే (ఆర్ఆర్) - రూ. 5.8 కోట్లు
  • అంగ్క్రిష్ రఘువంశీ (కేకేఆర్) - రూ. 20 లక్షలు
  • అర్షిన్ కులకర్ణి (లక్నో) - రూ. 20 లక్షలు
  • రమణదీప్ సింగ్ (కేకేఆర్) - రూ. 20 లక్షలు

షారుక్ ఖాన్ - రూ. 7.40 కోట్లు 

తమిళనాడు యువ బ్యాటర్ షారుఖ్ ఖాన్ రూ. 7.40 కోట్లు పలికాడు. రూ. 40 లక్షల ధరతో వేలంలోకి వచ్చిన అతని కోసం గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. చివరకు కింగ్స్ వెనక్కు తగ్గడంతో షారుఖ్ టైటాన్స్ సొంతమయ్యాడు.  

అన్షిత్‌ కులకర్ణి

అన్షిత్‌ కులకర్ణిని రూ. 20 లక్షలు వెచ్చించి లక్నో సూపర్ గెయింట్స్ సొంతం చేసుకుంది.

అంగ్క్రిష్ రఘువంశీ

అంగ్క్రిష్ రఘువంశీని రూ. 20 లక్షల బేస్ ధరకు కేకేఆర్ సొంతం చేసుకుంది.

సమీర్ రిజ్వీపై కాసుల వర్షం

యూపీ యువ ఆటగాడు, అనక్యాప్‌డ్‌ ప్లేయర్‌ సమీర్ రిజ్వీ భారీ ధర పలికాడు. 8.4 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ అతన్ని దక్కించుకుంది. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన రెండో అనక్యాప్‌డ్‌ ప్లేయర్‌ రిజ్వీ రికార్డుల్లోకి ఎక్కాడు. గతంలో భారత బౌలర్ ఆవేశ్ ఖాన్ అనక్యాప్‌డ్‌ ప్లేయర్‌ గా రూ.10 కోట్లు పలికాడు.

అన్‌క్యాప్‌డ్ ప్లేయర్‌కు రూ. 5.8 కోట్లు

ఐపీఎల్ 2024 వేలంలో భారత అనక్యాప్‌డ్‌ ప్లేయర్‌ శుభమ్ దూబే రికార్డు ధర పలికాడు. ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ ఆడకపోయినా కోట్లు కొల్లగొట్టాడు. రూ. 20 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన దూబెను రూ. 5.8 కోట్లకు రాజస్థాన్‌ రాయల్స్‌ సొంతం చేసుకుంది.

ఇప్పటివరకూ ఐపీఎల్ 2024 వేలంలో ఖరీదైన ఆటగాళ్లు

  • మిచెల్ స్టార్క్ (కేకేఆర్): రూ. 24.75 కోట్లు
  • పాట్ కమ్మిన్స్ (ఎస్‌ఆర్‌హెచ్): రూ.2 0.5 కోట్లు
  • డారిల్ మిచెల్ (సీఎస్‌కే) - రూ. 14 కోట్లు
  • హర్షల్ పటేల్ (పీబీకేఎస్) - రూ. 11.75 కోట్లు
  • అల్జారీ జోసెఫ్ (ఆర్‌సీబీ) - 11.5 కోట్లు

అంతర్జాతీయ స్పిన్నర్లకు నిరాశ

ఆల్ రౌండర్లు, పేసర్ల కోసం ఎగబడ్డ ఫ్రాంచైజీలు స్పిన్నర్లకు వచ్చే సరికి వెనకడుగు వేశాయి. కనీస ధర వెచ్చించేందుకు కూడా ఆసక్తి చూపలేదు. దీంతో ముజీబ్ ఉర్ రెహమాన్, తబ్రైజ్ షమ్సీ, ఇష్ సోధి, అకేల్ హోసేన్, ఆదిల్ రషీద్ అన్‌సోల్డ్ ప్లేయర్లుగా మిగిలిపోయారు.

దిల్షాన్ మధుశంక - రూ.4.6 కోట్లు

శ్రీలంక లెఫ్ట్ ఆర్మ్ పేసర్ దిల్షాన్ మధుశంకను ముంబై ఇండియన్స్ రూ.4.6 కోట్లకు దక్కించుకుంది. 

SRHకి ఉనద్కత్ 

భారత లెఫ్ట్ ఆర్మ్ పేసర్ జయదేవ్ ఉనద్కత్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ సొంతం చేసుకుంది.  అతని కోసం రూ. 1.6 కోట్లు వెచ్చించింది.

జోష్ హేజిల్‌వుడ్ అన్‌సోల్డ్

పాటు కమ్మిన్స్(రూ.20.50 కోట్లు), మిచెల్ స్టార్క్(రూ.24.75 కోట్లు) కోట్లు పలకగా.. మరో ఆసీస్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్ అన్‌సోల్డ్ ఆటగాడిగా మిగిలిపోయాడు. కొన్ని మ్యాచ్ లకు అందుబాటులో ఉండడని అతడు ముందుగానే తెలియజేయడంతో.. ఫ్రాంచైజీలు అతని పట్ల ఆసక్తి చూపలేదు. 

బౌలర్ మిచెల్ స్టార్క్.. రూ.24 కోట్ల 75 లక్షలు..

ఐపీఎల్ 2024 వేలం చరిత్రలోనే రికార్డులు బద్దలు అయిన ధర ఇది. ఆసీస్ బౌలర్ మిచెల్ స్టార్క్ ను 24 కోట్ల 75 లక్షల రూపాయలకు కోలకతా నైట్ రైడర్స్ సొంతం చేసుకుంది. గుజరాత్ టైటాన్స్, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య హోరాహోరీగా సాగిన వేలంపాట.. ఐపీఎల్ చరిత్రను తిరగరాసింది.
 

లక్నోకు శివం మావి

భారత యువ బౌలర్ శివం మావి రూ. 6.40 కోట్ల భారీ ధర పలికాడు. రూ.50 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన అతని కోసం లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పోటీ పడ్డాయి. చివరకు లక్నో అతన్ని దక్కించుకుంది.

ఉమేష్ యాదవ్ - రూ.5.80 కోట్లు

భారత పేసర్ ఉమేష్ యాదవ్ ను గుజరాత్ టైటాన్స్ దక్కించుకుంది. అతని కనీస ధర రూ.2 కోట్లు కాగా, రూ.5.80 కోట్లు వెచ్చించి అతన్ని సొంతం చేసుకుంది.

విండీస్ బౌలర్ కోసం ఫ్రాంచైజీల మధ్య వార్

వెస్టిండీస్ బౌలర్ అల్జారీ జోసెఫ్ కోసం ఐపీఎల్ ఫ్రాంచైజీల మధ్య వార్ నడించింది. చెన్నై, ఢిల్లీ, లక్నో, బెంగళూరు జట్లు పోటాపోటీగా బిడ్డింగ్ వేశాయి. చివరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ. 11 కోట్లు వెచ్చించి అతన్ని సొంతం చేసుకుంది.

ఫెర్గూసన్, మెండిస్ అన్‌సోల్డ్‌

కివీస్ పేసర్ లాకీ ఫెర్గూసన్, లంక వికెట్ కీపర్ కుషాల్ మెండిస్ ఐపీఎల్ వేలంలో నిరాశ ఎదురైంది. ఫ్రాంఛైజీలు ఆసక్తి చూపకపోవడంతో అన్‌సోల్డ్‌ ఆటగాళ్లుగా మిగిలిపోయారు.

కేఎస్ భరత్

భారత యువ వికెట్ కీపర్ కేఎస్ భరత్ ను కోల్‌కతా నైట్‌రైడర్స్‌ రూ. 50 లక్షలకు సొంతం చేసుకుంది.

ఢిల్లీకి ట్రిస్టన్ స్టబ్స్

దక్షిణాఫ్రికా యువ క్రికెటర్ ట్రిస్టన్ స్టబ్స్ ను ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది. రూ.50 లక్షల కనీస ధరకే అతన్ని తీసుకుంది. 

ఫిలిప్ సాల్ట్ అన్‌సోల్డ్‌

ఇంగ్లాండ్ విధ్వంసకర బ్యాటర్, వికెట్ కీపర్ ఫిలిప్ సాల్ట్ అన్‌సోల్డ్‌ ఆటగాడిగా మిగిలిపోయాడు.

రెండు రౌండ్లు ముగిశాక ఫ్రాంచైజీల వద్ద మిగిలివున్న మొత్తం

  • గుజరాత్‌ టైటాన్స్‌: రూ. 37.65 కోట్లు
  • కోల్‌కతా నైట్‌రైడర్స్‌: రూ. 32.70 కోట్లు
  • ఢిల్లీ క్యాపిటల్స్‌: రూ. 24.95 కోట్లు
  • రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు: రూ. 23.25 కోట్లు
  • లక్నో సూపర్ జెయింట్స్‌: రూ. 13.15 కోట్లు
  • పంజాబ్ కింగ్స్: రూ. 13.15 కోట్లు
  • ముంబై ఇండియన్స్‌: రూ. 12.75 కోట్లు
  • చెన్నై సూపర్ కింగ్స్‌: రూ. 11.6 కోట్లు
  • రాజస్థాన్‌ రాయల్స్‌: రూ. 7.10 కోట్లు
  • సన్‌రైజర్స్‌ హైదరాబాద్: రూ. 5.2 కోట్లు

రెండు రౌండ్ల హైలెట్స్

  • పాట్ కమ్మిన్స్ (సన్ రైజర్స్)- రూ. 20.5 కోట్లు
  • డారిల్ మిచెల్ (చెన్నై): రూ.14 కోట్లు
  • హర్షల్ పటేల్ (పంజాబ్ కింగ్స్): రూ. 11.75 కోట్లు
  • రోవ్‌మన్ పావెల్(రాజస్థాన్ రాయల్స్): రూ. 7.40 కోట్లు
  • ట్రావిస్ హెడ్(సన్ రైజర్స్) - రూ.6.80 కోట్లు 
  • గెరాల్డ్ కోయెట్జీ (ముంబై): రూ. 5 కోట్లు
  • క్రిస్ వోక్స్ (పంజాబ్ కింగ్స్): రూ. 4.2 కోట్లు
  • శార్దూల్ ఠాకూర్ (చెన్నై): రూ. 4 కోట్లు
  • రచిన్ రవీంద్ర (చెన్నై): రూ. 1.8 కోట్లు
  • అజ్మతుల్లా ఒమర్జాయ్ (గుజరాత్): రూ. 50 లక్షలు

అన్‌సోల్డ్‌ ఆటగాళ్లు: స్టీవ్ స్మిత్, రిలీ రోసో, మనీష్ పాండే, కరుణ్ నాయర్. 

క్రిస్ వోక్స్

ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్‌ క్రిస్ వోక్స్ ను రూ. 4.2 కోట్లకు పంజాబ్ కింగ్స్ దక్కించుకుంది.

డారిల్ మిచెల్ - రూ. 14 కోట్లు

కివీస్ ఆల్‌రౌండర్‌ డారిల్ మిచెల్ రికార్డు ధర పలికాడు. అతని కనీస ధర కోటి రూపాయలు కాగా, చెన్నై సూపర్ కింగ్స్ రూ.14 కోట్లు  వెచ్చించి అతన్ని దక్కించుకుంది.   

కోట్లు కొల్లగొట్టిన హర్షల్ పటేల్

మినీ వేలంలో భారత బౌలర్ హర్షల్ పటేల్ కోట్లు కొల్లగొట్టాడు. అతని కనీస ధర రూ. 2 కోట్లు కాగా, ఏకంగా రూ.11.75 కోట్లకు అమ్ముడుపోయాడు. అతని కోసం గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య తీవ్ర పోటీ నెలకొనగా.. చివరకు ఈ పోరులో కింగ్స్ ఓనర్ ప్రీతీ జింతా పైచేయి సాధించింది.

ముంబైకి గెరాల్డ్ కోయెట్జీ 

దక్షిణాఫ్రికా పేసర్ కోయెట్జీని నీతా అంబానీ ఆధ్వర్యంలోని ముంబై ఇండియన్స్ సొంతం చేసుకుంది. రూ. 5 కోట్లకు అతడు అమ్ముడుపోయాడు.

ఐపీఎల్ చరిత్రలోనే కమ్మిన్స్ అత్యధిక ధర

ఆస్ట్రేలియా పేసర్ పాట్ కమిన్స్ భారీ ధర పలికాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడుపోయాడు. అతని కనీస ధర రూ. 2 కోట్లు కాగా, సన్ రైజర్స్ హైదరాబాద్ రూ.20.50 కోట్లు వెచ్చించి అతన్ని దక్కించుకుంది.

అజ్మతుల్లా ఒమర్జాయ్‌

అఫ్ఘనిస్తాన్ ఆల్‌రౌండర్‌ అజ్మతుల్లా ఒమర్జాయ్‌ను గుజరాత్‌ టైటాన్స్ దక్కించుకుంది. రూ. 50 లక్షల కనీస ధరకే అతన్ని తీసుకుంది.

శార్దూల్ ఠాకూర్ చెన్నై సొంతం

భారత ఆల్‌రౌండర్‌ శార్దూల్ ఠాకూర్ ను చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకుంది. అతని కనీస ధర రూ. 2 కోట్లు కాగా, రూ. 4 కోట్లు పలికాడు.

రచిన్ రవీంద్ర కోసం మూడు జట్లు మధ్య పోటీ

రూ. 50 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన కివీస్ యువ ఆల్ రౌండర్ రచిన్ రవీంద్ర కోసం మూడు జట్లు మధ్య పోటాపోటీ నడిచింది. అతన్ని చేజిక్కించుకునేందుకు చెన్నై సూపర్ కింగ్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ పోటీపడ్డాయి. చివరకు రూ. 1.8 కోట్లకు చెన్నై అతన్ని సొంతం చేసుకుంది.

వనిందు హసరంగా(ఎస్‌ఆర్‌హెచ్‌)

శ్రీలంక ఆల్ రౌండర్ వనిందు హసరంగా సన్ రైజర్స్ సొంతమయ్యాడు. రూ.1.5 కోట్ల ధరకు ఎస్‌ఆర్‌హెచ్‌ యాజమాన్యం అతన్ని కైవసం చేసుకుంది. 

మనీష్ పాండే, కరుణ్ నాయర్ అన్‌సోల్డ్‌

ఐపీఎల్ 2024 మినీ వేలంలో భారత క్రికెటర్లకు నిరాశ తప్పడం లేదు. మనీష్ పాండే, కరుణ్ నాయర్ లను కొనుగోలు చేయడానికి ఫ్రాంచైజీలు ఆసక్తి చూపలేదు. దీంతో అన్‌సోల్డ్‌ ఆటగాళ్లుగా మిగిలిపోయారు.  

స్టీవ్ స్మిత్ కు నిరాశ

ఆసీస్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ ను కొనుగోలు చేయడానికి ఫ్రాంచైజీలు ఆసక్తి చూపలేదు. దీంతో అన్‌సోల్డ్‌ ఆటగాడిగా మిగిలిపోయాడు.

ట్రావిస్ హెడ్ - రూ.6.80 కోట్లు 

వరల్డ్ కప్ హీరో, ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ చేజిక్కించుకుంది. హెడ్ కనీస ధర రూ.2 కోట్లు కాగా, 
అతని కోసం చెన్నై సూపర్ కింగ్స్, హైదరాబాద్ జట్ల మధ్య పోటాపోటీ వార్ నడించింది. చివరకు అతన్ని సన్ రైజర్స్ సొంతం చేసుకుంది. 

హ్యారీ బ్రూక్

రూ.2 కోట్ల బేస్ ప్రైస్‌తో వేలంలోకి వచ్చిన ఇంగ్లాండ్ యువ క్రికెటర్  హ్యారీ బ్రూక్ ను రూ.4 కోట్ల ధరకు ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది.

​​​​​మొదటి ఆటగాడు

ఐపిఎల్ 2024 మినీ వేలంలోకి వచ్చిన తొలి ఆటగాడిగా విండీస్ విధ్వంసకర క్రికెటర్ రోవ్‌మన్ పావెల్ నిలిచారు. అతని బేస్ ధర కోటి రూపాయలు కాగా, రూ. 7.40 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ సొంతం చేసుకుంది.

​​​​ఏ ఫ్రాంచైజీ వద్ద ఎంత డబ్బు ఉందంటే..

  • గుజరాత్‌ టైటాన్స్‌: రూ. 38.15 కోట్లు
  • సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌: రూ. 34 కోట్లు
  • కోల్‌కతా నైట్‌ రైడర్స్‌: రూ. 32.7 కోట్లు
  • చెన్నై సూపర్‌ కింగ్స్‌: రూ. 31.4 కోట్లు
  • పంజాబ్‌ కింగ్స్‌: రూ. 29.1 కోట్లు
  • ఢిల్లీ క్యాపిటల్స్‌: రూ. 28.95 కోట్లు
  • రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు: రూ. 23.25 కోట్లు
  • ముంబై ఇండియన్స్‌: రూ. 17.75 కోట్లు
  • రాజస్తాన్‌ రాయల్స్‌: రూ. 14.5 కోట్లు
  • లక్నో సూపర్‌ జెయింట్స్‌: రూ. 13.15 కోట్లు