IPL Auction 2025 Live Updates: ఐపీఎల్ మెగా వేలం 2025.. లైవ్ అప్‌డేట్స్

IPL Auction 2025 Live Updates: ఐపీఎల్ మెగా వేలం 2025.. లైవ్ అప్‌డేట్స్
  • కేఎల్ రాహుల్: రూ.14 కోట్లు (ఢిల్లీ క్యాపిటల్స్)
     
  • లియామ్ లివింగ్‌స్టోన్: రూ.8.75 కోట్లు (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు)
     
  • మహ్మద్ సిరాజ్(హైదరాబాద్ పేసర్): రూ.12.25 కోట్లు (గుజరాత్ టైటాన్స్)
     
  • యుజ్వేంద్ర చాహల్: రూ.18 కోట్లు 

         రికార్డు ధర పలికిన భారత స్పిన్నర్ చాహల్.. కొనుగోలు చేసిన పంజాబ్ కింగ్స్

  • డేవిడ్ మిల్లర్ (సౌతాఫ్రికా బ్యాటర్): రూ.7.50 కోట్లు (లక్నో సూపర్ జెయింట్స్)
  • మహమ్మద్ షమీ(భారత బౌలర్): రూ.10.00 కోట్లు (సన్‌రైజర్స్ హైదరాబాద్)
  • రూ.27 కోట్లు పలికిన రిషబ్ పంత్.. కొనుగోలు చేసిన లక్నో సూపర్ జెయింట్స్.. 
  • రెండో స్థానానికి అయ్యర్.. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర రిషబ్ పంత్ (రూ. 27 కోట్లు)​​​​​​
  • వేలంలోకి భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్.. సన్ రైజర్స్, లక్నో మధ్య పోటీపోటీ
  • ఢిల్లీ క్యాపిటల్స్ చెంతకు మిచెల్ స్టార్క్.. రూ. 11.75 కోట్లు పలికిన ఆస్ట్రేలియాపేసర్ 
  • జాస్ బట్లర్ (ఇంగ్లండ్ బ్యాటర్):  రూ. 15.75 కోట్లు (గుజరాత్ టైటాన్స్)
  • ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా శ్రేయాస్ అయ్యర్(రూ. 26.75 కోట్లు) రికార్డు. గతంలో ఈ రికార్డు ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ (రూ.24.75 కోట్లు) పేరిట ఉంది. ఇప్పుడు ఆ రికార్డును అయ్యర్ బ‌ద్ధ‌లు కొట్టాడు.
  • భారత బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్‌కు రికార్డు ధర.. రూ. 26.75 కోట్లకు దక్కించుకున్న పంజాబ్‌ కింగ్స్‌
  • ​​​కగిసో రబడ (సౌతాఫ్రికా బౌలర్): రూ. 10.75 కోట్లు (గుజరాత్ టైటాన్స్)
  • అర్షదీప్ సింగ్ (భారత బౌలర్): రూ. 18 కోట్లు (పంజాబ్‌ కింగ్స్‌)
  • వేలంలోకి వచ్చిన మొదటి ప్లేయర్.. అర్షదీప్ సింగ్(బేస్ ధర రూ.2 కోట్లు)

 అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఐపీఎల్‌ మెగా వేలం ప్రారంభమైంది. సౌదీ అరేబియా, జెడ్డాలోని అబాది అల్ జోహార్ అరేనా వేదికగా ఈ వేలం నిర్వహిస్తున్నారు. స్టార్‌ స్పోర్ట్స్‌, జియో సినిమా ఓటీటీలో లైవ్ ప్రత్యక్షప్రసారం చేయబడుతుంది. ఇంట్లో కూర్చొని హాయిగా వీక్షించచ్చు.

    ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ సింగ్ ధుమాల్ తన ప్రసంగంతో వేలాన్ని ప్రారంభించారు. రెండు రోజుల పాటు జరిగే ఈ ఈవెంట్‌లో మొదటి రోజు 84 మంది ఆటగాళ్లు వేలంలోకి రానున్నారు.

  • ఐపీఎల్ వేలం జరుగుతున్న ప్రదేశం: జెడ్డా (సౌదీ అరేబియా)
  • వేదిక: అబాది అల్ జోహార్ అరేనా

మొత్తం 577 మంది ఆటగాళ్లు వేలం బరిలో ఉన్నారు. వీరిలో 367 మంది భారత ఆటగాళ్లు, 210 మంది విదేశీ ప్లేయర్లు. వీరందరినీ కొనే వీలు లేదు. కేవలం 204 మంది క్రికెటర్లను మాత్రమే కొనుక్కోవడానికి వీలుంది.

గతేడాది మినీ వేలంలో ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ రూ.24.75 కోట్ల రికార్డు ధర పలకగా.. ఇప్పుడు ఆ రికార్డు బ‌ద్ధ‌లు కొట్టే కోటీశ్వ‌రుడు ఎవ‌రా..? అన్న ఆస‌క్తి అందరిలో ఉంది. ఫార్మాట్‌ ఏదైనా విధ్వంసకర బ్యాటింగ్‌తో అలరించే రిషభ్‌ పంత్‌ ఈసారి అత్యధిక ధర పలుకుతాడని అంచనా వేస్తున్నారు. అతని కోసం రూ.25 నుంచి 30 కోట్ల వరకు వెచ్చించవచ్చని అంచనా.

ఏ ప్రాంచైజీ దగ్గర ఎంత పర్స్ మిగిలివుందంటే..?

వేలంలో ఆటగాళ్లను కొనేందుకు పది ఫ్రాంఛైజీల వద్ద మొత్తంగా రూ.641.5 కోట్లు ఉన్నాయి. అత్యధికంగా పంజాబ్‌ కింగ్స్‌ వద్ద  రూ.110.50 కోట్లు ఉంది.

  • పంజాబ్‌ కింగ్స్‌: రూ. 110.5 కోట్లు
  • రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: రూ. 83 కోట్లు
  • ఢిల్లీ క్యాపిటల్స్: రూ. 73 కోట్లు
  • గుజరాత్ టైటాన్స్: రూ. 69 కోట్లు
  • లక్నో సూపర్ జెయింట్స్:  రూ. 69 కోట్లు
  • చెన్నై సూపర్ కింగ్స్: రూ. 55 కోట్లు
  • కోల్‌కతా నైట్ రైడర్స్: రూ. 51 కోట్లు
  • ముంబై ఇండియన్స్: రూ. 45 కోట్లు
  • సన్‌రైజర్స్ హైదరాబాద్: రూ. 41 కోట్లు
  • రాజస్థాన్ రాయల్స్: రూ. 69 కోట్లు

ఆటగాళ్ల రిటైన్ లిస్ట్

చెన్నై సూపర్ కింగ్స్‌(CSK)

  • రుతురాజ్ గైక్వాడ్: రూ.18 కోట్లు
  • మతిశ పతిరన: రూ.13 కోట్లు
  • శివమ్ దూబె: రూ.12 కోట్లు
  • రవీంద్ర జడేజా: రూ.18 కోట్లు
  • ఎంఎస్ ధోని: రూ.4 కోట్లు

ముంబై ఇండియన్స్‌(MI)

  • జస్‌ప్రీత్ బుమ్రా: రూ.18 కోట్లు
  • రోహిత్ శర్మ: రూ.16.30 కోట్లు
  • సూర్యకుమార్ యాదవ్: రూ.16.35 కోట్లు
  • హార్దిక్ పాండ్యా: రూ.16.35 కోట్లు
  • తిలక్ వర్మ: రూ.8 కోట్లు

రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు(RCB)

  • విరాట్ కోహ్లీ: రూ.21 కోట్లు
  • రజత్ పటిదార్: రూ.11 కోట్లు
  • యశ్‌ దయాళ్‌: రూ.5 కోట్లు

సన్‌రైజర్స్‌ హైదరాబాద్(SRH) 

  • హెన్రిచ్ క్లాసెన్: రూ.23 కోట్లు
  • పాట్ కమిన్స్: రూ.18 కోట్లు
  • అభిషేక్ శర్మ: రూ.14 కోట్లు
  • నితీశ్‌ రెడ్డి: రూ.6 కోట్లు
  • ట్రావిస్ హెడ్: రూ.14 కోట్లు

రాజస్థాన్ రాయల్స్‌(RR) 

  • సంజు శాంసన్: రూ.18 కోట్లు
  • యశస్వి జైస్వాల్: రూ.18 కోట్లు 
  • రియాన్ పరాగ్: రూ.14 కోట్లు
  • ధ్రువ్ జురెల్: రూ.14 కోట్లు
  • హెట్‌ మయర్‌: రూ.11 కోట్లు
  • సందీప్ శర్మ: రూ.4 కోట్లు

ఢిల్లీ క్యాపిటల్స్‌(DC)

  • అక్షర్ పటేల్: రూ.16.5 కోట్లు
  • కుల్‌దీప్ యాదవ్: రూ.13.25 కోట్లు
  • ట్రిస్టన్ స్టబ్స్: రూ.10 కోట్లు
  • అభిషేక్ పొరెల్: రూ.4 కోట్లు

కోల్‌కతా నైట్‌రైడర్స్‌(KKR) 

  • రింకు సింగ్: రూ.13 కోట్లు
  • వరుణ్‌ చక్రవర్తి: రూ.12 కోట్లు
  • సునీల్ నరైన్: రూ.12 కోట్లు
  • ఆండ్రీ రస్సెల్: రూ.12 కోట్లు
  • హర్షిత్ రాణా: రూ.4 కోట్లు
  • రమణ్‌దీప్ సింగ్: రూ.4 కోట్లు

గుజరాత్‌ టైటాన్స్‌(GT)

  • రషీద్‌ ఖాన్‌: రూ.18 కోట్లు
  • శుభ్‌మన్‌ గిల్‌: రూ.16.5 కోట్లు
  • సాయి సుదర్శన్‌: రూ.8.5 కోట్లు
  • రాహుల్‌ తెవాతియా: రూ.4 కోట్లు
  • షారుక్‌ ఖాన్‌: రూ.4 కోట్లు

లక్నో సూపర్‌ జెయింట్స్‌(LSG)

  • నికోలస్‌ పూరన్‌: రూ.21 కోట్లు
  • రవి బిష్ణోయ్‌: రూ.11 కోట్లు
  • మయాంక్‌ యాదవ్: రూ.11 కోట్లు
  • మోసిన్‌ ఖాన్‌: రూ.4 కోట్లు
  • ఆయుష్‌ బదోనీ: రూ.4 కోట్లు

పంజాబ్‌ కింగ్స్‌(PBKS)

  • శశాంక్‌ సింగ్‌: రూ.5.5 కోట్లు
  • ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌: రూ.4 కోట్లు