
ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ బెట్టింగ్ ముఠాను జనగామ పోలీసులు అరెస్టు చేశారు. జనగామ పట్టణ సీఐ మల్లేష్ యాదవ్ మంగళవారం పోలీస్ స్టే షన్ లో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. జనగామలోని పలు ప్రాంతాల్లో కొందరు యువకులు ఐపీఎల్ బెట్టింగులకు పాల్పడుతున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు సోమవారం అర్ధరాత్రి దాడులు నిర్వహించారు. జనగామకు చెందిన నోముల నర్సిహులు, ఎం. శ్రీధర్ , ఎం.లక్ష్మణ్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నా రు.రహీమ్ అనే యువకుడు పరారయ్యాడు. వీరు బెంగళూరు ఐపీఎల్ మ్యాచ్ కు సంబంధించి ఆన్ లైన్ , ఆఫ్ లైన్ లలో బెట్టింగ్ కు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. వారి నుంచి నాలుగు సెల్ ఫోన్లతోపాటు రూ. 6,980 స్వాధీనం చేసుకున్నారు. వారిచ్చి న సమాచారం ఆధారంగా మరో 20 మంది యువకులు కూడా బెట్టింగ్ లకు పాల్పడుతున్నట్లు తమ దృష్టి వచ్చిందని, వారిని కూడా తర్వలోనే పట్టుకుంటామని సీఐ తెలిపారు. అరెస్ట్ చేసిన యువకులను రిమాండ్ కు తరలించామన్నా రు. సమావేశంలో ఎస్సై రాజేష్ నాయక్, కానిస్టేబుల్స్ సంతోష్ , వీరన్న, అనిల్ , కిషోర్ తదితరులు పాల్గొన్నారు.